- Home
- Entertainment
- రవితేజ, నాని, నాగశౌర్య, శర్వానంద్, సాయి తేజ్.. అందరికి కొత్త డైరెక్టర్లే కావాలట, ఎందుకంటే...?
రవితేజ, నాని, నాగశౌర్య, శర్వానంద్, సాయి తేజ్.. అందరికి కొత్త డైరెక్టర్లే కావాలట, ఎందుకంటే...?
హిట్ల కోసం ఒకప్పటి లా సీనియర్ డైరెక్టర్లను టాప్ డైరెక్టర్లను నమ్ముకోవడం లేదు టాలీవుడ్ హీరోలు. తల నెరిసిన డైరెక్టర్లు అవసరం లేదట .. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ.. ఫ్రెష్ థాట్స్ ఉన్న టీనేజ్ కుర్రాళ్ళు కావాలట దాటిన వాళ్లు , నిండా 30 కూడా నిండకుండానే బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న డైరెక్టర్స్ వైపు ఆకర్శితులవుతున్నారు మన స్టార్స్.సీనియర్ల్ నుంచి యంగ్ హీరోల వరకూ కొత్త డైరెక్టర్లు. యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నవారెవరు చూద్దాం.

రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలు చూడడం ఆడియన్స్ ఎప్పుడో మానేశారు. టాలీవుడ్ లో కూడా అప్పటిలా కాకుండా కొత తరం కొత్త రక్తంతో మేకర్స్ వస్తుండటంతో.. సో కాల్డ్ సినిమాలు ఎప్పుడో ఎగిరిపోయాయి. అందుకే కొత్త కొత్త కాన్సెప్ట్ తో సరికొత్త గా సిల్వర్ స్క్రీన్ మీద కొస్తున్నారు హీరోలు. ఫ్రెష్ నెస్ కోసం కొత్త కొత్త డైరెక్టర్లతో కొలాబరేట్ అవుతున్నారు రవితేజ నుంచి నాగశౌర్య వరకూ కొత్త వారు యంగ్ డైరెక్టర్లే కావాటల.
సీనియర్ల లో కొత్తవారిని ఎంకరేజ్ చేసేస్తున్నది మాస్ మహారాజ్ ఒక్కడే. రవితేజ తన 68 వ సినిమా రామారావ్ ఆన్ డ్యూటీ రిలీజ్ కి ముస్తాబు చేస్తున్నాడు. పోలీస్ పాత్రలో పవర్ ఫుల్ గా కనిపించబోతున్నరవితేజ .. ఈసినిమాని శరత్ మండవ అనే కొత్త డైరెక్టర్ తో చేశారు. రవితేజ మార్క్ పవర్ పంచ్ లతో తెరకెక్కిన రామారావ్ ఆన్ డ్యూటీ లో మరోసారి మాస్ మోత మోగించ బోతున్నారు.
యంగ్ హీరోలలో సీనియర్ యంగ్ హీరో అంటే నాని గుర్తుకు వస్తాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో హడావిడి చేస్తున్న నాని... కొత్త డైరెక్టర్ని తన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఈ సారి దసరా సినిమాతో మరో కొత్త దర్శకుడిని ముందుకు తీసుకురాబోతున్నాడు. నానిని సరికొత్తగా చూపించబోతున్నాడు న్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నానికెరీర్ లోనే కంప్లీట్ కాంట్రాస్ట్ గా లుక్ వైజ్, అప్పియరెన్స్ వైజ్ , లాంగ్వేజ్ వైజ్ సరికొత్తగా తెరకెక్కుతోంది. అంతలా నానీని ట్రాన్స్ ఫామ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు శ్రీకాంత్ .
సినిమాల విషయంలో పెద్దగా ప్రయోగాలు చెయ్యని కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైమ్ తన స్టైల్ మార్చుకుని టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. ఇంత వెయిట్ ఉన్న సినిమాను డైరెక్ట్ చేస్తున్నది మాత్రం అసలు ఒక్క సినిమా కూడా చేయని, అసలు ఎక్స్ పీరియన్స్ ఏమాత్రం లేని యంగ్ డైరెక్టర్ వశిష్ట మల్లిడితో. బింబిసార గా తిగర్తల రాజ్యాదిపతిగా రూత్ లెస్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న కళ్యాణ్ రామ్ ..టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టూ గుడ్ ట్యాగ్ తో రాబోతున్నాడు. మరి ఏ నమ్మకంతో వశిష్టకు ఈ అవకాశం ఇచ్చాడో ఈ నందమూరి హీరో.
ఈమధ్య యాక్సిడెంట్ అవ్వడంతో చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చారు సాయిధరమ్ తేజ్. దాదాపు సంవత్సరం తర్వాత కార్తీక్ అనే కొత్త డైరెక్టర్ తో సుకుమార్ ప్రొడక్షన్ లో కొత్త సినిమాని స్టార్ట్ చేశారు. ఎక్స్ పెరిమెంట్స్ చెయ్యడానికి ఎప్పుడూ రెడీగాఉండే సాయిధరమ్ తేజ్ .. కార్తీక్ డైరెక్షన్లో మిస్టిక్ ధ్రిల్లర్ సినిమా చేస్తున్నారు.
సక్సెస్ లేకపోయినా సరే డిఫరెంట్ మూవీస్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాడు శర్వానంద్. ఇక తన తన అప్ కమింగ్ మూవీ తో... కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తున్నాడు శర్వ. రీతూవర్మ హీరోయిన్ గా కార్తీక్ అనే కొత్త కుర్రాడి డైరెక్షన్లో తెలుగు,తమిళ్ భాషల్లొ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది ఒకే ఒక జీవితం మూవీ. పెద్దగా ప్రచారం లేకుండా.. హిట్ కాన్సిడెన్స్ తో రిలీజ్ కు రెడీ అవుతున్నారు టీమ్.
వరుసగా ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నా.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న మరో యంగ్ హీరో నాగశౌర్య. ఈ యంగ్ స్టార్ కూడా కొత్త డైరెక్టర్ల తోనే సినిమా చేస్తున్నారు. లేటెస్ట్ గా పవన్ బసం శెట్టి ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ.. కొత్త సినిమాల మొదలుపెట్టారు. అంతకు ముందు వరుడు కావలెను సినిమాతో ఓ లేడీ డైరెక్టర్ ను ఇడస్ట్రీకి పరిచయం చేశాడు శౌర్య. అంతేకాదు మరో కొత్త డైరెక్టర్ తోనే పోలీస్ వారి హెచ్చరిక సినిమా కూడా చేస్తున్నారు నాగశౌర్య.
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా కొత్త డైరెక్టర్ తోనే రంగ రంగ వైభవంగా సినిమా చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా శిష్యుడిగా తమిళ్ లో ఆదిత్మ వర్మ మూవీ చేసిన గిరీశయ్య.. తెలుగులో మాత్రం వైష్ణవ్ తేజ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. కేతిక శర్మ జంటగా కంప్లీట్ యూత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన రంగరంగ వైభవంగా సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇలా యంగ్ స్టార్స్, సీనియర్ స్టార్స్ అంతా కొత్త టాలెంట్ పై ఆధారపడి సినిమాలు చేస్తున్నారు.