- Home
- Entertainment
- ప్లాస్టిక్ సర్జరీకి రెడీ అవుతున్న కృతిశెట్టి...? అందంకోసం ఏ భాగాన్ని మార్చుకోబోతుందంటే...?
ప్లాస్టిక్ సర్జరీకి రెడీ అవుతున్న కృతిశెట్టి...? అందంకోసం ఏ భాగాన్ని మార్చుకోబోతుందంటే...?
చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంది కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో కుర్రకారు మనసులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. తనదైన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

వరుసగా.. ఉప్పెన, శ్యామ్‌సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన కృతి శెట్టి.. నాలుగో సినిమాగా వారియర్ లో నటించి మెప్పించింది కాని.. ఈ సినిమాతో ఫస్ట్ ఫెయిల్యూర్ ను ఫేస్ చేసింది బ్యూటీ. ఇక తాజాగా మాచర్చ నియోజకవర్గం సినిమాలో నితిన్ జోడీగా నటించింది కృతి. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది.
వరుస సినిమాలతో మెప్పిస్తున్న కృతి శెట్టి.. రీసెంట్‌గా హీరో రామ్ తో దివారియర్ సినిమాలో నటిచింది కాని... ఈ సినిమా ఆమెకు నిరాశ మిగిల్చింది. అయితే కృతి శెట్టి అందానికి వంక పెట్టడానికి లేదు. కాని కృతి శెట్టి లో కూడా ఓచిన్న లోపం ఆమెను ఇబ్బంది పెడుతుందట. ఆ విషయంలో ట్రోల్స్ కూడా ఫేస్ చేసిందట కృతి. అదేంటంటే ఆమె పెదాలు పెద్దవిగా ఉండటం.. ఆమెను ఇబ్బంది పెడుతుందట.
వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా... కృతి శెట్టి త్వరలోనే తన పేదలకు సర్జరీ చేయించుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఈమె పెదాలు కాస్త పెద్దవిగా ఉండడంతో పెద్ద ఎత్తున నెటిజెన్లు కూడా తన పెదవుల పై ట్రోలింగ్ చేసినట్టు సమాచారం.
ఈ మధ్య మాచర్ల నియోజకవర్గం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కనిపించిన కృతి శెట్టి పెదాలపైన రకరకాల కామెంట్లు వినిపించాయట. ఇలా అందరూ తన పెదాలను విమర్షిస్తుండటంతో... తన పెదాల వల్ల తన అందానికి మచ్చ వస్తుదని భావిస్తుందట కృతి శెట్టి. అందుకే తన పెదాలను చిన్నగా చేయించుకోవడం కోసం సర్జరీ చేయించుకోవడానికి సిద్ధమైనట్లుగా సమాచారం.
ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసుకుందట కృతి. డాక్టర్లను కలవడం, వివరాలు అందించడం కూడా అయిపోయిందట. కాని ఈ విషయంపై అఫీషియల్ ఇన్ ఫర్మేషన్ మాత్రం లేదు. అయితే ఇదే కనుక నిజమైతే త్వరలోనే మరొ కొత్త కృతి శెట్టి ని చూడవచ్చు.
అయితే ఈ విషయంలో కొందరు ఈ స్టార్ హీరోయిన్ కు సలహాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. అంతరిస్క్ తీసుకుని సర్జరీ చేసుకోవడం అవసరమా..? ఏమైనా తేడా వస్తే పరిస్థితి ఏంటీ..? అని అడుగుతున్నారట. మరి దీనిపై కృతి ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.