MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10: షాలిని నా కడుపు చూసింది, తట్టుకోలేకపోయా.. నువ్వు మూర్ఖుడివా త్రిగుణ్ ? రోహిత్ కామెంట్స్

Bigg Boss Telugu 10: షాలిని నా కడుపు చూసింది, తట్టుకోలేకపోయా.. నువ్వు మూర్ఖుడివా త్రిగుణ్ ? రోహిత్ కామెంట్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 50 వ రోజు జరిగిన నామినేషన్స్ ప్రక్రియ అనేక ట్విస్టులతో సాగింది. నామినేషన్స్ మొదటి దశలో కేవలం గ్రీన్ లెవల్ లో ఉన్న వారికి మాత్రమే నామినేట్ చేసే అవకాశం దక్కింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 26 2026, 11:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బిగ్ బాస్ తెలుగు 10
Image Credit : Asianet News

బిగ్ బాస్ తెలుగు 10

బిగ్ బాస్ హౌస్ లో 50వ రోజు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోమవారం రోజు నామినేషన్స్ ప్రక్రియ ఆసక్తికరంగా ప్రారంభం అయింది. నామినేషన్స్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ గ్రీన్ లెవల్ లో ఉన్న వారికి మాత్రమే ఇచ్చారు. గ్రీన్ లెవల్ లో ఉన్న త్రిగుణ్, దేబ్జానీ, ముకేశ్, అమన్, నీతూ మాత్రమే నామినేట్ చేయాలి. బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం ఈ ఐదుగురు చర్చించుకుని ఎవరు ఎంతమందిని నామినేట్ చేయాలి అనేది డిసైడ్ అయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గ్రీన్ లెవల్ లో ఉన్న వారికి మాత్రమే ఆ ఛాన్స్
Image Credit : Asianet News

గ్రీన్ లెవల్ లో ఉన్న వారికి మాత్రమే ఆ ఛాన్స్

అమన్, దేబ్జానీ, నీతూ, ముకేశ్ ఒక్కొక్కరిని చేయాలని డిసైడ్ అయ్యారు. త్రిగుణ్ మాత్రం ముగ్గురిని నామినేట్ చేసే ఛాన్స్ తీసుకున్నారు. ముందుగా నీతూ.. ఝాన్సీని నామినేట్ చేసింది. గేమ్స్ బాగా ఆడుతున్నప్పటికీ నీ సొంత ఐడెంటిటీ హౌస్ లో కనిపించడం లేదు అని నీతూ చెప్పింది. ఆ తర్వాత ముకేశ్ ఆర్కేని నామినేట్ చేశాడు. హౌస్ లో రోబోట్ లాగా అటూ ఇటూ తిరుగుతున్నావు.. ఏదైనా చెప్పాలి అంటే ఏయ్ అని అరిచేసి సైలెంట్ అయిపోతావు. నీకంటూ ఓ క్లారిటీ లేదు అని ముకేష్ అతడిని నామినేట్ చేశారు.

34
రామ్ ప్రసాద్ కెప్టెన్సీ గురించి త్రిగుణ్ కామెంట్
Image Credit : Asianet News

రామ్ ప్రసాద్ కెప్టెన్సీ గురించి త్రిగుణ్ కామెంట్

ఆ తర్వాత త్రిగుణ్ వంతు వచ్చింది. త్రిగుణ్ తన ఫస్ట్ నామినేషన్ గా రామ్ ప్రసాద్ ని ఎంచుకున్నారు. కెప్టెన్ గా ఉన్నప్పుడు అందరికీ లీనియన్స్ ఇచ్చి సాఫ్ట్ గా మారిపోయారు. కెప్టెన్ కి ఉండాల్సిన అథారిటీ చూపించలేకపోయారు అని త్రిగుణ్ పేర్కొన్నారు. త్రిగుణ్ సెకండ్ నామినేషన్ గా రోహిత్ ని నామినేట్ చేశారు.

44
షాలిని అంటే అందుకు ఇష్టం, రోహిత్ ఎమోషనల్
Image Credit : Asianet News

షాలిని అంటే అందుకు ఇష్టం, రోహిత్ ఎమోషనల్

అగ్ని పరీక్షలో రోహిత్ లో కనిపించిన స్పిరిట్ ఇప్పుడు కనిపించడం లేదు. బిగ్ బాస్ కి మర్యాద ఇవ్వవు, పక్కన ఉన్న కంటెస్టెంట్స్ కి మర్యాద ఇవ్వవు. అందరినీ కించపరుస్తావు. అసలు నీకు ఎందుకు అంత అహంకారం అంటూ త్రిగుణ్ తన నామినేషన్స్ పాయింట్స్ పెట్టారు. రోహిత్ సమాధానం ఇస్తూ నేను నీ స్థాయికి దిగజారి మాట్లాడలేను. నాకు మర్యాద లేదు అని మాట్లాడుతున్నావు కదా.. షాలిని వెళ్ళిపోతున్నప్పుడు ఆమెకి నేను ముద్దు ఇచ్చాను. మీ దృష్టిలో ముద్దు అంటే వేరు. కానీ నాకు ఆ రోజు భయం వేసింది. ఒంటరివాడిని అయిపోతానేమో అని అనుకున్నా. షాలిని అంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా.. తనకు 3 చపాతీలు వస్తే తాను 2 మాత్రమే తిని నాకు ఒకటి పెట్టేది. ఆమె నా కడుపు చూసింది. అది ఆమెతో నాకు ఉన్న ఎమోషనల్ బాండింగ్. కానీ ఈ వ్యక్తి ఏంటి ఇంత దిగజారి మాట్లాడుతున్నాడు అని తట్టుకోలేకపోయా. తనకు ఇచ్చిన బ్యాడ్జిని చూపిస్తూ ఇదొక్కటే నన్ను ఆపుతోంది త్రిగుణ్.. లేకుంటే ఇంత ప్రశాంతంగా సమాధానం ఇవ్వను అని రోహిత్ వార్నింగ్ ఇచ్చాడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AK47 Ticket Price: ఆదర్శ కుటుంబం టికెట్ ధరలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి.. పెంచిన ధరలు ఇవే
Recommended image2
Trivikram: ఎన్టీఆర్‌ విషయంలో తప్పు ఒప్పుకున్న త్రివిక్రమ్‌.. అరవింద సమేతలో బ్లండర్‌ ఇదే
Recommended image3
Rambha: నాన్నతో 6 నెలలు మాటల్లేవ్, నా కెరీర్ లో అదే స్పెషల్ మూవీ..తండ్రి గురించి రంభ చెప్పిన విషయాలు
Related Stories
Recommended image1
Rambha: నాన్నతో 6 నెలలు మాటల్లేవ్, నా కెరీర్ లో అదే స్పెషల్ మూవీ..తండ్రి గురించి రంభ చెప్పిన విషయాలు
Recommended image2
Mahesh Babu: మహేష్ బాబు ఫ్యూచర్ ని ముందే ఊహించిన కవి.. ఫ్లాప్ మూవీ పాట 100 శాతం నిజమైందిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved