జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు.. కాస్ట్ తెలిస్తే.. కళ్లు తేలేస్తారు మరి..
సెలబ్రిటీలు ఏవైన కాస్ట్లీ వస్తువులు కొంటే.. సోషల్ మీడియా జనాలకు పండగే.. వాటి కాస్ట్ ను వైరల్ చేస్తూ.. సందడి చేస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ గ్యారేజ్ లోకి కొత్త కారు వచ్చి చేరింది. ఇంతకీ ఆ కారు కాస్ట్ ఎంతో తెలుసా..?

మన సెలబ్రిటీలలో ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క వస్తువుపై క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే.. ఒకరికి వాచెస్.. మరికొందరికి డ్రెస్సెస్ ..మరికొందరికి ఫారెన్ ట్రిప్పులు.. అందులో జూనియర్ ఎన్టీఆర్ కి కార్లంటు ఎంత ఇష్టమో కూడా తెలిసిందే.. ఇలా మన ఎన్టీఆర్ కి కార్ల పిచ్చి ..ఇప్పటికే తన గ్యారేజ్లో చాలా చాలా డిఫరెంట్ వెరైటీ కార్లు ఉన్నాయి.
ఆయన కార్ల కలెక్షన్ కొన్ని కోట్ల విలువ చేస్తుంది. అయితే ఆయన గ్యారేజ్ లో ఇన్ని కార్లు ఉండగా.. తాజాగా అందులోకి మరో కారు వచ్చి చేరింది. కోట్లు కోట్లు ఉంటుంది. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ మరో కొత్త కారు కొన్నారు . దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .
ఈమధ్య యంట్ టైగర్ ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీస్ కు వచ్చారు. ఆయన ఆ ఆఫీస్ నుంచి నుంచి బయటకు వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక నెట్టింట జనాలు వాకబ్ చేయగా.. ఆయన కొత్త కారు కొనుగోలు చేశారని తెలిసింది. ఆకారును రిజిస్ట్రేషన్ చేసేందుకే అక్కడికి వెళ్లారు అని సమాచారం.
బ్లాక్ టీ షర్ట్ లో.. బ్లూ జీన్స్ ప్యాంట్ లో బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి చాలా సింపుల్ గా వెరీ వెరీ స్టైలిష్ గా జూనియర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్ లోని ఆర్టీవో ఆఫీస్ లో కనిపించారు .దాంతో ఈ పిక్స్ ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాగా ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఏ కారు కొన్నారు అనేది హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ జూనియర్ కొన్నది ఏ కారు అంటే.. మెస్సిడేస్ బెంజ్ మే బాచ్ ఎస్ క్లాసిక్ యస్ 580.
ఈ లగ్జరీ ప్రీమియం కారును ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా కొన్నారట. ఇక ఈ కారు కాస్ట్ ఎంతా అనే కదా మీ డౌట్.. సోసల్ మీడియా సమాచారం ప్రకారం. ఈ కారు కాస్ట్.. దాదాపు 3 కోట్లకు పైనే ఉంటుందని అంటున్నారు. అడ్వాన్స్డ్ లగ్జరీ ఫీచర్స్ తో ఈ కారు తయారు చేశారట . ఎమర్జెన్సీ సమయంలో ఆటోమేటిక్గా అలారం కూడా మోగుతుందట .
ఇక ప్రస్తుతం దేవర షూటింగ్ ఫైనల్ షెడ్యల్ లో ఉన్నారు తారక్. కొరటాల డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమూవీ తరువాత ఆయన ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు.. మరికొన్న సినిమాలు లైన్ అప్ చేస్తున్నారు తారక్.