- Home
- Entertainment
- మళ్ళీ తెరపైకి అనుష్క శెట్టి పెళ్లి, వరుడు మాత్రం ప్రభాస్ కాదట, మరి స్వీటీ పెళ్ళి ఎవరితో...?
మళ్ళీ తెరపైకి అనుష్క శెట్టి పెళ్లి, వరుడు మాత్రం ప్రభాస్ కాదట, మరి స్వీటీ పెళ్ళి ఎవరితో...?
చాలా కాలంగా అనుష్క ఫ్యాన్స్ ఆమె పెళ్ళి కోసం ఎదురు చూస్తున్నారు. 40 ఏళ్ళు వచ్చినా.. ఇంకా ఆమె పెళ్లి చేసుకోకపోవడంతో ఇక ఆమె పెళ్ళి చేసుకుంటుందా.. ? లేదా అనే అనుమానం అందరిలో ఉంది. అయితే ఈ విషయంలో మాత్రం అనుష్క మౌనమే సమాధానం అయ్యింది.

టాలీవుడ్ లో హీరోయిలను మించిన స్టార్ డమ్ సంపాదించిన హీరోయిన్లలో అనుష్కది మొదటి స్తానం. సూపర్ సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన స్వీటి.. వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్ లను అందుకుంది. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలు అందరి తోను అనుష్క నటంచింది.
ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించి స్టార్ హీరోయిన్ గా మారిన స్వీటికి అరుంధతి, బాహుబలి, భాగమతి లాంటి సినిమాలు ఆమె ఇమేజ్ ను ఎక్కడికో తీసుకెళ్ళాయి. ఇక సినిమాలకే అంకితమైన అనుష్క పెళ్లి గురించి ఏనాడు ఆలోచించలేదు. చివరిగా నిశ్శబ్ధం సినిమాలో నటించిన బ్యూటీ.. ఆతరువాత కనిపించలేదు.
ఇదిలా ఉంటే అనుష్క త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా బెంగుళూరు వ్యాపారవేత్త తో అనుష్క పెళ్లి అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో కూడా అనుష్క పెళ్ళి గురించి రకరకాల వార్తలు చక్కెర్లు కొట్టాయి. కాని అవి రూమ్స్ గానే మిగిలిపోయాయి.
ముఖ్యంగా ప్రభాస్ తో అనుష్క ప్రేమలో ఉందంటూ ఎన్నో రకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అంతే కాదు సీక్రేట్ గా వారు చెట్టా పట్టాలు వేసుకుని తిరిగారని. పెళ్ళి చేసుకోవాలని అనుకున్నారని, అమెరికాలో ఇల్లు కూడా కొన్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే ఈ విషయాలపై అటు ప్రభాస్, ఇటు అనుష్క ఇద్దరు స్పందించలేదు.
ప్రభాస్ కూడా 42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. అనుష్క కూడా 40 లో ఉంది. ఇప్పటికీ వీరిద్దరు ప్రేమలో ఉన్నారు అని రూమర్స్ వచ్చిన వేళా.. అనుష్కకు బెంగళూరు బిజినెస్ మెన్ తో పెళ్లి అని సరికొత్త కబురు తెలుస్తంది. అయితే ఇందులో నిజమెంత తెలియాలి అంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
ఇక చాలా కాలం తరువాత అనుష్క రీసెంట్ గానే సెట్స్ లో అడుగు పెట్టింది. దాదాపు 4 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న స్వీటి... రీసెంట్ గా నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తోంది. మరి ఈ టైమ్ లో అనుష్క పెళ్ళి పీటలు ఎక్కుతుందా..? లేక సినిమాలు చేసుకుంటూ.. ఇలానే ఉండిపోతుందా చూడాలి.