టాలీవుడ్ రీమిక్స్ సాంగ్స్: చెడగొట్టినవి, గౌరవాన్ని నిలబెట్టినవి ఇవే!

First Published 24, Sep 2019, 4:27 PM

టాలీవుడ్ లో రీమిక్స్ సాంగ్స్ జోరు పెరుగుతోంది. కానీ ఒరిజినల్ వర్షన్స్థాయిని అందుకోవడంలో రీమిక్స్ సాంగ్ విఫలమవుతున్నాయి. కొన్ని పాటలని మాత్రం బాగానే రీమిక్స్ చేశారు. 

సవ్యసాచి: నాగ చైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన సవ్యసాచి చిత్రంలో 'నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు' సాంగ్ ని రీమిక్స్ చేశారు. ఈ పాట నాగార్జున అల్లరి అల్లుడు చిత్రంలోనిది. ఈ సాంగ్ అప్పట్లో యువతని ఒక ఊపు ఊపింది. ఒరిజినల్ వర్షన్ లోని జోష్ రీమిక్స్ లో కనిపించలేదు. చైతు, నిధి అగర్వాల్ మాత్రం స్టెప్పులతో ఆకట్టుకున్నారు.

రచ్చ: మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ గ్యాంగ్ లీడర్ చిత్రంలో 'వాన వాన వెల్లువాయే' సాంగ్ ని రాంచరణ్ రచ్చలో రీమిక్స్ చేశారు. రీమిక్స్ లో పాట కంటే తమన్నా గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఎదురయ్యాయి.

ఇంటెలిజెంట్: ఇటీవల కాలంలో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ చిరంజీవి పాటలని ఎక్కువగా రీమిక్స్ చేశాడు. కొండవీటి దొంగ చిత్రంలోని 'చమక్ చమక్ చామ్' అనే సాంగ్ ని ఇంటెలిజెంట్ లో రీమిక్స్ చేశారు. తేజు, లావణ్య త్రిపాఠిపై తెరకెక్కించిన ఈ పాట ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

సుప్రీం: యముడికి మొగుడు చిత్రంలోని అందం హిందోళం పాటని సుప్రీంలో సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నాపై రీమిక్స్ చేశారు. ఒరిజినల్ వర్షన్ ని చెడగొట్టకుండా తెరకెక్కించిన రీమిక్స్ లో ఇది కూడా ఒకటి. ఈ పాటలోని కొరియోగ్రఫీ ఆకట్టుకుంది.

సోగ్గాడే చిన్నినాయనా: ఏఎన్నార్, జగ్గయ్య, జయలలిత నటించిన ఆస్తిపరులు చిత్రంలోని సోగ్గాడే సాంగ్ ని నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో రీమిక్స్ చేశారు. విజువల్ పరంగా ఈ సాంగ్ ఆకట్టుకుంది.

పటాస్ : బాలయ్య సూపర్ హిట్ చిత్రం రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రంలో 'అరె ఓ సాంబా' సాంగ్ ని పటాస్ లో రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ ఆడియో, కొరియోగ్రఫీ అని విధాలుగా మెప్పించింది. ఈ పాటలో కళ్యాణ్ రామ్ బాలయ్య స్టైల్ ని ఫాలో అయిపోయాడు.

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్: ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి ఐకానిక్ సాంగ్ గువ్వా గోరింకతో అనే పాటని రీమిక్స్ చేశారు. ఒరిజినల్ వర్షన్ ని చెడగొట్టిన మరో పాటగా ఇది నిలిచిపోయింది.

ఒక లైలా కోసం : ఒక లైలా కోసం పాట వినగానే ఏఎన్నార్ గుర్తుకు వస్తారు. ఈ సాంగ్ ని నాగ చైతన్యపై రీమిక్స్ చేశారు. ఒరిజినల్ వర్షన్ లోని జోష్, ఫీల్ రీమిక్స్ లో కనిపించలేదు.

ప్రేమ కథా చిత్రం:సుధీర్ బాబు నటించిన ఈ కామెడీ హర్రర్ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ క్లాసికల్ సాంగ్ 'వెన్నెలైనా వేకువైనా' అనే పాటని రీమిక్స్ చేశారు. రీమిక్స్ పాట ఆకట్టుకుంది.

సీమ టపాకాయ్ : అల్లరి నరేష్, హీరోయిన్ పూర్ణపై సీమ టపాకాయ్ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం చిత్రంలోని ' ఆకాశంలో ఒకతార' పాటని రీమిక్స్ చేశారు. ఈ సాంగ్ ప్రేక్షకులని మెప్పించింది.

గద్దలకొండ గణేష్: వరుణ్ తేజ్ నటించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తోంది. శ్రీదేవి, శోభన్ బాబు నటించిన దేవత చిత్రంలోని ఐకానిక్ సాంగ్ ఎల్లువొచ్చి గోదారమ్మ పాటని ఏఈ చిత్రంలో రీమిక్స్ చేశారు. ఒరిజినల్ వర్షన్ గౌరవాన్ని తగ్గించకుండా దర్శకుడు హరీష్ జాగ్రత్త పడ్డారు. సాంగ్ లో సుశీల గారి వాయిస్ ని లాగే ఉంచేశారు. బాలసుబ్రహ్మణ్యం మరోసారి ఈ పాటని పాడారు. అద్భుతమైన కొరియోగ్రఫీ.. పూజ హెగ్డే, వరుణ్ స్టెప్పులతో ఈ సాంగ్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

loader