- Home
- Entertainment
- Heroines Remuneration: రేట్లు పెంచేసిన టాలీవుడ్ బ్యూటీస్... అమ్మో అంత తీసుకుంటున్నారా...?
Heroines Remuneration: రేట్లు పెంచేసిన టాలీవుడ్ బ్యూటీస్... అమ్మో అంత తీసుకుంటున్నారా...?
హీరోలకంటే మేం ఏం తక్కువ అంటున్నారు స్టార్ హీరోయిన్లు. వరుసగా రెండు మూడు సక్సెస్ లు కనిపిస్తే చాలు రేట్లు పెంచేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని చూస్తున్నారు. అందుకే రెంట్లు అమాంతం పెంచేస్తున్నాడు. ముక్కు పిండి వసూలు చేస్తుననారు. ఇంతకీ మన టాలీవుడ్ భామలన రెమ్యూనరేషన్లు ఎంత..?

హీరోయిన్ల లైఫ్ కెరీర్ స్పాన్ చాలా తక్కువ . ఒక్క సారి ఫెయిడ్ అవుట్ అయితే చాలా ఇంక హీరోయిన్ గా లైఫ్ పోయినట్టే.. ఏ క్యారెక్టర్ రోల్సో చేసుకుంటే ఏమోస్తుంది. అందుకే హీరోయిన్ గా ఉండగానే చక్కబెట్టుకుంటున్నారు భామలు. రేట్లు పెంచేసి చేతినిండా సంపాదించుకుంటున్నారు. ఇప్పటి యంగ్ స్టార్ హీరోయన్లతో పాటు.. సీనియర్ హీరోయిన్లు కూడా కోట్లు డిమాండ్ చేస్తున్నారు.
ముందుగా యంగ్ హీరోయిన్ల సంగతి చూస్తే.. ప్రస్తుతం టాలీవుడ్ లో డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఇద్దరు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నారు. పూజా హెగ్డే, రష్మిక. బాలీవుడ్ ప్లాన్స్ లో బిజీగా ఉన్న ఈ ఇద్దరు హీరోయిన్లు రేట్లు అమాంతం పెంచేవారట. ఇంతకు ముందు పూజా హెగ్డే సినిమాకు కోటి తీసుకోవడమే ఎక్కువ. ఫెయిల్యూర్ హీరోయిన్ గా ఉన్న పూజా.. ఆతరువాత వరుస సక్సెస్ లతో ఫామ్ లోకి వచ్చింది. ఇఫ్పుడు సినిమాకు ఏకంగా 4నుంచి 5కోట్ల వరకూ డిమాండ్ చేస్తుందట. ప్రస్తుతం ఆమె నటించిన రాధేశ్యామ్ రిలీజ్ కు రెడీగా ఉంది.
ఇక రష్మిక విషయానికి వస్తే.. పూజా హెగ్డే అయినా ఫెయిల్యూర్స్ నుంచి సక్సస్ ఫుల్ హీరోయిన్ గా ఎదిగింది. కాని రష్మిక మందన్న మాత్రం.. ఓవర్ నైట్ స్టార్ గామారింది. వరుస సక్సెస్ లో దూసుకుపోతున్న రష్మిక పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారింది. దాంతో రెమ్యూనరేషన్ పెంచేసిందట బ్యూటీ. గతంలో రెండున్నర మూడు కోట్లు తీసుకునే రష్మిక ఇప్పుడు పక్కాగా 5 కోట్లు కావాలి అంటుందట.
ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలవల్ల కెరీర్ కోల్పోయింది అనుకున్న టైమ్ లోనే.. స్టార్ హీరోల సినిమా ఛాన్స్ లు కోట్టేస్తోంది కీర్తి సురేష్ మూడు భాషల్లో బిజీ స్టార్ గా మారిపోయిన కీర్తి తన రెమ్మునరేషన్ కూడ సవరించిందట. ఇది వరకూ 2 కోట్ల వరకూ తీసుకున్న కీర్తి ఇప్పుడు మూడు నుంచి నాలుగు కోట్లు డిమాండ్ చేస్తుందట. ప్రస్తుతం ఆమె మహేష్ బాబు సరసన సర్కారువారి పాట సినిమాలో నటిస్తోంది.
ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కృతి శెట్టి. ఈమూవీకి ఈ బ్యూటీ రెమ్యూనరేషన్ కేవలం ఆరులక్షలే. అయితే సినిమా హిట్ అవ్వడంతో 60 లక్షల వరకూ గిఫ్ట్ గా వచ్చాయి కృతీకి. వెంటనే వరుసగా ఆఫర్లు అందుకున్న కృతి బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో హిట్ అందుకోవడంతో తన రెమ్యూనరేషన్ కోటిన్నర నుంచి 2 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
అటు శంకర్-రామ్ చరణ్ మూవీలో నటిస్తోన్నబాలీవుడ్ సోయగంకియారా అద్వాని కూడా భారీ గానే డిమాండ్ చేస్తుంది. టాలీవుడ్ లో రెండు సినిమాలు చేసిన కియారా.. ఆతరువాత బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. ఇఫ్పుడు రామ్ చరణ్ జోడీగా చేస్తోంది ఈసినిమాకు దాదాపు నాలుగు కోట్లు తీసుకుంటున్నట్టు మాచారం
అటు సీనియర్ హీరోయిన్లు కూడా తమ ఇమేజ్ ను పెంచుకుంటూ పనిలో పనిగా రెమ్యూనరేషన్ కూడ పెంచుతున్నారు. మూడు పదుల వయస్సుదాటి నలబై వైపు పరుగులు పెడుతున్న నయనతార కూడా భారీగా రేటు పెంచి..గట్టిగా డిమాండ్ చేస్తుందట. సినిమాకు దాదాపు ఆమె 7 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం.
అటు స్టార్ హీరోయిన్ గా ఒక ఐపు ఊపి.. ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకుంటున్న సమంత కూడా.. తన కెరీర్ ను పరుగుతు పెట్టిస్తోంది. మొన్నామధ్య పుష్పాలో సాంగ్ చేయడానికే దాదాపు కోటి పైన తీసుకుందట సమంత. ఇక సినిమా మొత్తానికి అంటే 4 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ఏజ్ పెరుగుతున్నా..ఫిట్ నెస్ విషయంలో తగ్గేది లేదు అంటుంది బ్యూటీ.
వీళ్లే కాదు అటు తమన్నా, రాశీఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు ఈ రేంజ్ హీరోయిన్లు అందరూ బాగానే డిమాండ్ చేస్తున్నారు. ఫిజిక్ ను కాపాడుకుంటూ. సినిమా అవకాశాలు చూసుకుంటూ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ముగ్గరు కోటి నుంచి రెండు కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.