ఆకాశ్ పూరి ప్రేమాయణం, పొలిటికల్ లీడర్ మనవరాలితో పెళ్ళి..? నిజమెంత..?
పూరీ జగన్నాథ్ తనయుడు, టాలీవుడ్ యంగ్ హీరో పూరీ ఆకాశ్ పెళ్లి చేసుకోబోతున్నాడా..? పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నఫ్యామిలీకి అల్లుడిగా వెళ్లబోతున్నాడా..?

ఈమధ్య యంగ్ హీరోలంతా ఓ ఇంటివారు అవుతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్, శర్వానంద్, మానస్ లాంటి స్టార్స్ పెళ్ళిళ్ళు చేసుకుని ఇంటివారు అయ్యారు. తాజాగా మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడట. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి పెళ్ళి చేసుకోబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.
అయితే ఆకాశ్ పూరి లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తన క్లాస్ మెట్ ను ఆకాశ్ పెళ్ళాడబోతున్నాడట. అంతే కాదు అమ్మాయి కూడా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నేత మనవరాలు అని తెలుస్తోంది. త్వరలో ఎంగేజ్ మెంట్ ఉంటుందని.. ఈ ఇయర్ పెళ్ళి ఉంటుందని అంటున్నారు. పెళ్లికి ఇద్దరు కుటుంబ సభ్యులు ఒప్పుకున్న తర్వాతనే ఈ న్యూస్ అన్ అఫీషియల్ గా సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతుంది అంటున్నారు.
అయితే అనౌన్స్ మెంట్ ఎప్పుడు ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది. అంతే కాదు ప్రస్తుతం ఈన్యూస్ రూమర్ గానే ఉంది. ఈ విషయంలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే కాని అసలు విషయం తెలుస్తుంది.
పూరి జగన్నాథ్ .. సినిమా ఇండస్ట్రీలో ఈ పేరుకి ఎలాంటి ప్రత్యేకమైన గౌరవం ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్నాడు.
మరీ ముఖ్యంగా చాలామంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్ హీరోలుగా మార్చేసాడు పూరీ జగన్నాథ్. కాని తన కొడుకుని మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయాడు. అటు ఆకాశ్ కూడా తన తండ్రి దర్శకత్వంలో సినిమా చేయను అని చెప్పేశాడు.
ఇక పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి గురించి కూడా అందరికీ తెలిసిందే . చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు . హీరోగా కూడా తన లక్ ని పరీక్షించుకున్నాడు . కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు . రీసెంట్ గా పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి.. పొలిటికల్ లీడర్ మనవరాలు తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అని ..పెళ్లి చేసుకోబోతున్నాడు అని వార్తలు వైరల్ అయ్యాయి .
ప్రస్తుతం ఆర్ సి ట్రెండ్ సెట్టర్ క్లాత్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు ఆకాష్ పూరి. రీసెంట్ గా దీనికి సంబంధించిన ఓ ఈవెంట్ లో పాల్గొంటూ తాను ఓ పొలిటికల్ లీడర్ మనవరాలు తో ప్రేమ కొనసాగిస్తున్నాను అని పెళ్లి చేసుకోబోతున్నాను అని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల మీదే అని.. హీరోగా సెట్ అయ్యి.. తన కాళ్ల మీద తాను నిలబడాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు. అందుకే తన తండ్రి దర్శకత్వంలో కూడా సినిమా చేయనంటున్నాడు