- Home
- Entertainment
- ఆర్య నుంచి మన్మధుడి వరకూ ప్రీక్వెల్ సూపర్ హిట్ అయ్యి సీక్వెల్ ప్లాప్ అయిన సినిమాలు..? మరి ఎఫ్3 పరిస్థితేంటి
ఆర్య నుంచి మన్మధుడి వరకూ ప్రీక్వెల్ సూపర్ హిట్ అయ్యి సీక్వెల్ ప్లాప్ అయిన సినిమాలు..? మరి ఎఫ్3 పరిస్థితేంటి
ఒక సినిమా హిట్ అయ్యింది అంటే చాలు ఆసినిమాకు సంబంధించి మరో సినిమా వస్తే.. ఖచ్చితంగా హిట్ అవుతుంది అని అనుకుంారు మేకర్స్. అదే ఫార్ములాను ఉపయోగించి వెంటనే సీక్వెల్ తీసేస్తారు. ఈమధ్య మేకర్స్ కు అది కామన్ అయిపోయింది. కాని ఈ ఫార్ములాకు గ్యారెంటీ లేదు.

సీక్వెల్ చేసిన ప్రతీ సినిమా హిట్ అవ్వలి అని లేదు. రేపు హిట్ సినిమా ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమా రిజల్ట్ గురించి ఇండస్ట్రీ అంతా ఎదురుచూస్తుంది. గతంలో కూడా ఇంత కంటే పెద్ద సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి. కాని అందులో హిట్ అయినవి కొన్ని మాత్రమే. మరి ఎన్నో ఆశలతో రిలీజ్ అయ్యి.. బోల్తా పడ్డ టాలీవుడ్ సీక్వెల్ సినిమాలు ఏంటో చూద్దాం.
అల్లు అర్జున్ కెరిర్ లో ఫస్ట్ సూపర్ డూపర్ హిట్.. బన్నీకి స్పెషల్ ఇమేజ్ ఇచ్చిన సినిమా ఆర్య. అంతకు ముందే గంగోత్రి సినిమాతో హిరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లుకి.. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఆర్య మైలేజ్ తెచ్చిపెట్టంది. అయితే కొన్ని ఏళ్ళ గ్యాప్ తరువాత ఇదే సుకుమార్ ఆర్యకు సీక్వెల్ గా ఆర్య2 చేశారు. అయితే డిజాస్టర్ అనలేం కాని.. ఆర్య2 అంతగాప్రభావం చూపించలేదు అన్నది మాత్రం నిజం
ప్రీక్వెల్ హిట్ అయ్యి..సీక్వెల్ ప్లాప్ అయిన సినిమాలలో.. మాస్ మహారాజ్ కిక్ సినిమ కూడా ఒకటి. రవితేజకు ఇడియట్ తరువాత ఆరేంజ్ లో మాస్ సినిమా.. హిట్ సినిమా కిక్ అని చెప్పకోవచ్చు.. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీతో ఆడియన్ కు తన పెర్పామెన్స్ తో గిలిగింతలు పెట్టాడు రవితేజ. ఇక కొన్ని ఏళ్ల గ్యాప్ తరువాత చ్చిన కిక్2 మాత్రం డిజాస్టర్ గా నిలిచింది.
మెగాస్టార్ కెరీర్ లోనే మర్చిపోలేని మూవీ శంకర్ దాదా ఎబీబియస్. ఈ సినిమాలో మెగాస్టార్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ లో హిట్ అయిన మున్నాబాయి ని తెలుగులో రీమేక్ చేశారు. అయితే అదే బాలీవుడ్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన లగేరహో మున్నాబాయ్ ను శంకర్ దాదా జిందాబాద్ గా చేసి..దెబ్బతిన్నారు మెగాస్టార్.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో.. ఈమూవీ సీక్వెల్ కు వెళ్లారు. స్వయంగా కథ రాసుకుని.. బాబీ డైరెక్షన్ లో సర్దార్ గబ్బర్ సింగ్ చేశారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అవ్వగా.. సర్ధార్ గబ్బర్ సింగ్ ప్లాప్ ల లిస్ట్ లో చేరింది.
ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం వచ్చి.. నాగార్జునకు టాలీవుడ్ మన్మధుడు అనే బిరుడు ఇచ్చింది మన్మధుడు సినిమా. ఈ సినిమాను అంతకు మించి అన్నట్టు చేయాలని ట్రై చేశాడు డైరెక్టర్ రాహుల్. స్పైసీనెస్ పెంచి.. నాగ్ చేత పరుగులు పెట్టించారు. మన్మధుడు 2 తో పెద్ద డిజాస్టర్ నే ఫేస్ చేశారు.
సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా తన చాలా సినిమాలకు సీక్వెల్స్ చేశాడు. అందులో జగపతిబాబు తో చేసిన గాయం మూవీ అప్పట్లో సెన్సేషనల్ హిట్.. ఆతరువాత కొన్నాళ్లకు అదే గాయం సినిమాను గాయం2గా జగపతిబాబుతోనే సీక్వెల్ చేశారు వర్మ. కాని ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ధారుణంగా పడిపోయింది.
ఇక డిఫరెంట్ సినిమాలతో హడావిడి చేసే డైరెక్టర్ రవిబాబు అవును సినిమాతో అందరి దుృష్టిని ఆకర్షించాడు. ఒక ఇల్లు.. కొన్ని మాత్రమే పాత్రలతో.. హరర్ థ్రిల్లర్ ను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. కాని ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన అవును2 మాత్రం ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.
ఈమూవీ టాలీవుడ్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఈసినిమాను ఇలా ఉంచకుండా.... ధనుష్ భార్య సౌందర్య రజనీ కాంత్ డైరెక్షన్ లో ఈ సినిమాకు సీక్వెల్ గా.. విఐపి2 ను తెరకెక్కించి ధారుణంగా దెబ్బ తిన్నారు. ఈమూవీ ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. ఇలా ఇవే కాదు పోలీస్టోరీ, మని మని, లాంటి చాలా సినిమాలు ఇలానే సీక్వెల్ విషయంలో దెబ్బ తిన్నాయి.