- Home
- Entertainment
- టాలీవుడ్ డైరెక్టర్లు ఈ హీరోయిన్లని జీవితంలో మరచిపోలేరు, వీళ్ళనే ఎందుకు రిపీట్ చేస్తారో తెలుసా..
టాలీవుడ్ డైరెక్టర్లు ఈ హీరోయిన్లని జీవితంలో మరచిపోలేరు, వీళ్ళనే ఎందుకు రిపీట్ చేస్తారో తెలుసా..
కొందరు టాలీవుడ్ దర్శకులు తమ చిత్రాలలో హీరోయిన్లని రిపీట్ చేస్తుంటారు. ఆ దర్శకులు, హీరోయిన్లు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

Tollywood Heroines
టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ ఉంటాయి. హీరోలు - దర్శకులు, హీరోలు - హీరోయిన్లు ఇలా ఆడియన్స్ లో ఆసక్తి కలిగించే సూపర్ హిట్ కాంబినేషన్స్ గురించి వింటూనే ఉంటాం. అదే విధంగా దర్శకులు - హీరోయిన్లలో కూడా క్రేజీ కాంబినేషన్లు ఉన్నాయి. కొందరు దర్శకులు హీరోయిన్లకి రిపీట్ చేస్తుంటారు. అందుకు గల కారణం ఏంటి.. ఆ దర్శకులు, హీరోయిన్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
రక్షిత - పూరి జగన్నాధ్
పూరి జగన్నాధ్ కి బాగా కలిసి వచ్చిన హీరోయిన్లలో రక్షిత ఒకరు. వీరి కాంబినేషన్ లో ఇడియట్, శివమణి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత ఆమెని పూరి జగన్నాధ్ ఆంధ్రావాలాలో కూడా రిపీట్ చేశారు. కానీ ఆ మూవీ వర్కౌట్ కాలేదు.
అనుష్క శెట్టి - రాజమౌళి
రాజమౌళి తన చిత్రాలలో ఎవరు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారు అని భావిస్తారో వాళ్ళకే అవకాశం ఇస్తారు. సెంటిమెంట్ ప్రకారం హీరోయిన్లని రిపీట్ చేయడం అంటూ ఉండదు. కానీ జక్కన్న విక్రమార్కుడు, బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాల కోసం అనుష్క శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నారు. రాజమౌళి ఆశించినట్లుగానే అనుష్క అద్భుతంగా నటించి మెప్పించింది.
సమంత, ఇలియానా - త్రివిక్రమ్
త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హీరోయిన్లని రిపీట్ చేస్తుంటారు. సమంతని ఏకంగా మూడు చిత్రాలలో హీరోయిన్ గా తీసుకున్నారు. అత్తారింటికి దారేది, అ..ఆ.., సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. ఇలియానా కూడా త్రివిక్రమ్ కి లక్కీ హీరోయినే అని చెప్పాలి. త్రివిక్రమ్ దర్శకత్వంలో జల్సా, జులాయి చిత్రాల్లో ఇలియానా నటించింది.
పాయల్ రాజ్ పుత్ - అజయ్ భూపతి
పాయల్ రాజ్ పుత్ పేరు చెప్పగానే ఆర్ఎక్స్ 100 చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ మూవీ సూపర్ హిట్ అయింది. మంగళవారం చిత్రంతో కూడా పాయల్ రాజ్ పుత్ మంచి విజయం దక్కించుకుంది. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు అజయ్ భూపతి కావడం విశేషం.
సాయి పల్లవి - శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల గతంలో కమలినీ ముఖర్జీతో ఎక్కువగా సినిమాలు చేశారు. ఇటీవల సాయి పల్లవితో ఫిదా, లవ్ స్టోరీ చిత్రాలు తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి.
మెహ్రీన్ - అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి, మెహ్రీన్ కాంబినేషన్ లో రాజా ది గ్రేట్, ఎఫ్ 2 చిత్రాలు వచ్చాయి. ఆ రెండు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఆ తర్వాత ఎఫ్ 3లో కూడా మెహ్రీన్ ని అనిల్ రావిపూడి రిపీట్ చేశారు.
పూజా హెగ్డే - హరీష్ శంకర్
డైరెక్టర్ హరీష్ శంకర్ కి పూజా హెగ్డే లక్కీ హీరోయిన్ అని చెప్పొచ్చు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పూజా హెగ్డే డీజే, గద్దలకొండ గణేష్ చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించాయి.