MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళి, సుకుమార్, వినాయక్, కరుణాకరన్ ఈ డైరెక్టర్ల ఫస్ట్ హీరోయిన్లు వీళ్ళే.. కొందరు కనుమరుగు, మరికొందరు

రాజమౌళి, సుకుమార్, వినాయక్, కరుణాకరన్ ఈ డైరెక్టర్ల ఫస్ట్ హీరోయిన్లు వీళ్ళే.. కొందరు కనుమరుగు, మరికొందరు

స్టార్ హీరోల తొలి చిత్రాల్లో నటించిన హీరోయిన్లని అభిమానులు బాగా గుర్తు పెట్టుకుంటారు. అదే విధంగా స్టార్ డైరెక్టర్ల తొలి చిత్రాల హీరోయిన్లు కూడా ప్రత్యేకమే. టాలీవుడ్ స్టార్ దర్శకుల తొలి చిత్రాల్లో నటించిన హీరోయిన్లు ఎవరు.. వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే వివరాలు తెలుసుకుందాం.  

3 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Dec 06 2023, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

వి వి వినాయక్- కీర్తి చావ్లా : మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఆది చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన కీర్తి చావ్లా హీరోయిన్ గా నటించింది. అంతకు ముందే ఇండస్ట్రీకి పరిచయం అయిన కీర్తిచావ్లాకి గుర్తింపు తెచ్చింది మాత్రం ఆది చిత్రమే. 2016 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్న కీర్తి చావ్లా ఆ తర్వాత కనుమరుగైంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

సుకుమార్-అను మెహతా : టాలీవుడ్ లో మూసగా సాగుతున్న ప్రేమ కథలకు సుకుమార్ తన తొలి చిత్రంతోనే కొత్త అర్థం చెప్పాడు. ఆర్య చిత్రం సుకుమార్, బన్నీ ఇద్దరి కెరీర్ లో ఎప్పటికి స్పెషల్ మూవీనే. ఈ చిత్రంలో అను మెహతా హీరోయిన్ గా నటించింది. ఆర్య తర్వాత ఆమెకి మంచి ఆఫర్స్ వస్తాయని భావించారు. కానీ అను మెహతా ఎక్కువ కాలం టాలీవుడ్ లో నిలబడలేకపోయింది. 

 

39

త్రివిక్రమ్ - శ్రీయ శరన్ : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా తొలి చిత్రం నువ్వే నువ్వే. రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో తరుణ్, శ్రీయ శరన్ మధ్య కెమిస్ట్రీ సూపర్ గా కుదిరింది. ఈ చిత్రం తర్వాత దశాబ్దానికి పైగా టాలీవుడ్ లో శ్రీయ హవా కొనసాగింది. ఏజ్ పెరిగాక ఆమెకి హీరోయిన్ గా ఆఫర్స్ తగ్గాయి కానీ ఇప్పటికీ శ్రీయ నటిస్తూనే ఉంది. 

 

49

రాజమౌళి - గజాల : దర్శకధీరుడు రాజమౌళి తొలి చిత్రం స్టూడెంట్ నెం 1 అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కి తొలి సక్సెస్ కూడా ఇదే. ఈ మూవీలో తారక్ కి జోడిగా అప్పటి క్రేజీ హీరోయిన్ గజాల నటించింది. స్టూడెంట్ నంబర్ 1 తర్వాత గజాల చాలా చిత్రాల్లో నటించింది. అయితే 2016లో వివాహం తర్వాత గజాల సినిమాలకు పూర్తిగా దూరమైంది. 

 

59

బోయపాటి శ్రీను - మీరా జాస్మిన్ : బోయపాటి శ్రీను తెరకెక్కించిన తొలి చిత్రం భద్ర. ప్రేమ ఫ్యాక్షన్ ని మిక్స్ చేసి బోయపాటి రూపొందించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. రవితేజకి జోడిగా ఈ చిత్రంలో హోమ్లీ హీరోయిన్ మీరా జాస్మిన్ నటించింది. ఈ మధ్యన కొంతకాలం సినిమాలకు దూరమైన మీరాజాస్మిన్.. ప్రస్తుతం సాలిడ్ రీఎంట్రీకి సిద్ధం అవుతోంది. 

 

69

సురేందర్ రెడ్డి - సింధు తులాని: డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఫస్ట్ మూవీ అతనొక్కడే. యాక్షన్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కూడా కీలకం. కళ్యాణ్ రామ్ జోడిగా మరదలిగా సింధు తులాని నటించింది. ఆ తర్వాత సింధు తులాని చాలా చిత్రాల్లో నటించింది. కానీ ఆ రేంజ్ హిట్ పడలేదు. 2017 నుంచి సింధు తులాని సినిమాలకు దూరమైంది. 

 

79

హరీష్ శంకర్ - జ్యోతిక : హరీష్ శంకర్ ఫస్ట్ మూవీ షాక్. పేరుకు తగ్గట్లుగానే హరీష్ కి ఆ మూవీ షాక్ ఇచ్చింది. రవితేజ, జ్యోతిక జంటగా నటించిన ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్. హరీష్ శంకర్ ఫస్ట్ హీరోయిన్ అంటే జ్యోతికనే. ఎన్నో మెమొరబుల్ చిత్రాల్లో నటించిన జ్యోతిక సూర్యతో వివాహం తర్వాత చాలా కాలం బ్రేక్ తీసుకుంది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి కథాబలం ఉన్న చిత్రాలు ఎంచుకుంటోంది. 

 

89

పూరి జగన్నాధ్ - అమీషా పటేల్, రేణు దేశాయ్ : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెబ్యూ మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే. బద్రి చిత్రంతో పూరి డైరెక్టర్ అయ్యారు. ఈ మూవీలో అమీషా పటేల్, రేణు దేశాయ్ ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు. అమీషా పటేల్ ఎక్కువ కాలం టాలీవుడ్ లో కొనసాగలేకపోయింది. ఇక రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడిపోవడం తెలిసిన కథే. 

 

99

కరుణాకరన్- కీర్తి రెడ్డి : ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ డెబ్యూ మూవీ కూడా పవన్ కళ్యాణ్ తోనే. తొలి ప్రేమ చిత్రం ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో పవన్, కీర్తి రెడ్డి కెమిస్ట్రీ సూపర్బ్ గా పండింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించిన కీర్తి రెడ్డి ఆ తర్వాత హీరో సుమంత్ ని పెళ్లి చేసుకుంది. కొంతకాలానికి ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత కీర్తి రెడ్డి ఫారెన్ లో సెటిల్ అయింది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Devara: దేవర కలెక్షన్స్ నిజమా ఫేకా, దుబాయ్ లో సక్సెస్ పార్టీ ఎందుకు చేశారు ? అసలు గుట్టు బయటపడింది
Recommended image2
Chennai Love Story Collections: బాక్సాఫీసు వద్ద కిరణ్‌ అబ్బవరం రచ్చ.. చెన్నై లవ్‌ స్టోరీకి మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు
Recommended image3
Jana Nayakudu 2 Days Collections: విజయ్‌కి బిగ్‌ షాక్‌, జన నాయకుడు కలెక్షన్లు, రెండో రోజు భారీ డ్రాప్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved