దర్శకుల కెరీర్ ని ముంచేసిన చిత్రాలు.. కోలుకోవడం కష్టమే?
First Published Aug 8, 2019, 11:23 AM IST
సినీ రంగాల్లో ప్లాప్ వస్తే కోలుకోవడం చాలా కష్టం. ఒకప్పుడు సక్సెస్ అందుకున్న దర్శకులకి ఊహించని విధంగా ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో మరో అవకాశం అందుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. అలాంటి దర్శకులపై ఓ లుక్కేద్దాం..

శ్రీను వైట్ల: ఆగడు సినిమా నుంచి ఈ దర్శకుడికి అపజయాలు మొదలయ్యాయి. ఆ సినిమా ఆడియెన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. పైగా గబ్బర్ సింగ్ ఫార్మాట్ ని ఫాలో అయ్యారని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అనంతరం శ్రీను వైట్ల చేసిన ఏ సినిమా కూడా యూ టర్న్ ఇవ్వలేకపోయింది.

గుణశేఖర్: 2003లో ఒక్కడు సినిమా తరువాత చేసిన సినిమాలేవీ ఈ డైరెక్టర్ కి అనుకున్నంతగా గుర్తింపు తీసుకురాలేదు. ముఖ్యంగా నిప్పు సినిమా గుణశేఖర్ కి ఉన్న కాస్త క్రేజ్ ని కూడా చెడగొట్టేసింది. ఆ తరువాత రుద్రమదేవి చేసినప్పటికీ నష్టాలూ రాకుండా సేవ్ అయ్యారే గాని అనుకున్నంతగా లాభాలు అందుకోలేకపోయారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?