MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుహాస్ కు జోడీగా కీర్తి సురేష్... ఫ్యాన్స్ కు పెద్ద షాకే..?

సుహాస్ కు జోడీగా కీర్తి సురేష్... ఫ్యాన్స్ కు పెద్ద షాకే..?

కొన్ని సార్లు ఇడస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ఆడియన్స్ ను షాక్ కు గురిచేస్తుంటాయి. ఫ్యాన్స్  అయోమయానికి గురి చేస్తుంటాయి. అలాంటి కాంబో ఒకటి కలవబోతున్నట్టు ఇండస్ట్రీలో టాక్. ఇంతకీ ఏంటా సంగతంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 21 2024, 10:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కమెడియన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన సుహాస్.. హీరోగా వరుసగా రెండు సూపర్ హిట్లు కొట్టాడు. దాంతో మనోడికి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. హీరోగానే ఎక్కువ ఆఫర్లు కొట్టేస్తున్నాడు సుహాస్. దాంతో టాలీవుడ్ కు మరో నేచురల్ స్టార్ దొరికాడంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు అందరికి  షాకించ్చేలా మరో న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది అదేంటంటే..? సుహాస్ తో కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోందట...? 

27

టాలీవుడ్  లో వరుస సినిమాలు చేసింది కీర్తి. రీసెంట్ గా దసరా సినిమాతో కూడా దుమ్ము రేపింది. ఎందుకో తెలియదు.. ఆతరువాత ఆమెకు పెద్దగా అవకాశాలు లేవు ఇక్కడ.  కీర్తి సురేష్  కు గతంతో పోల్చి చూస్తే మూవీ ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే. తెలుగులో కీర్తి సురేష్ బిజీ కావాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. 

37

అయితే తాజా సమాచారం ప్రకారం  సుహాస్   కీర్తి సురేష్ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని టాలీవుడ్ లో ఓ టాక్ నడుస్తోంది. అంతే కాదు.. ఈసినిమాను ను  అమెజాన్ ప్రైమ్ డిజిటల్ సంస్థ.. వీరి  కాంబినేషన్ లో సినిమా నిర్మిస్తోందని తెలుస్తోంది. తన టాలెంట్ తో సుహాస్ అంచెలంచెలుగా ఎదుగుతూ వరుస విజయాలను అందుకుంటున్నారు. ఆ టాలెంట్ ను గుర్తించి సుహాస్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిందట అమెజాన్. 
 

47

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్  సినిమాతో సుహాస్ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే. సుహాస్ కీర్తి సురేష్ కాంబినేషన్ ప్రాజెక్ట్ కు ఉప్పుకప్పురంబు అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఐవి శశి డైరెక్షన్ లో ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ముంబైలో జరిగిన ప్రైమ్ ఈవెంట్ లో ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడింది.

57

అమెజాన్ ప్రైమ్ ఒకవైపు భారీ సినిమాల డిజిటల్ హక్కులను కొనుగోలు చేస్తూనే మరోవైపు క్రేజీ వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది. సుహాస్ కీర్తి సురేష్ జోడీ బాగుంటుందని మరి కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సుహాస్ ఖాతాలో ఇప్పటికే కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.  అంతే కాదు ఈమధ్య అతను రెమ్యునరేషన్ కూడా పెంచినట్టు వార్తలు వచ్చాయి. 

67

సుహాస్ రెమ్యునరేషన్ ఒక్క సారిగా 3 కోట్లకు పెంచాడట. ఈ విషయంలో సుహాస్ ను డైరెక్టర్ గా ప్రశ్నించారు మీడియా వారు. దాంతో రెమ్యూనరేషన్ పెంచాను.. నేను బ్రతకొద్దా.. అయినా మీరు అన్నంత  మాత్రం పెంచలేదు అన్నారు. 

77

అంచలంచలుగా ఎదుగుతున్న సుహాస్.. స్టార్ హీరో స్థాయికి ఎదిగినా ఆశ్చర్యపోవసరం లేదు. ఇక కీర్తి సురేష్ తో కాంబినేషన్ వార్తలు నిజం అయితే.. ఒక వేళ ఈ సినిమా నిజంగా హిట్ అయితే.. సుహాస్ కెరీర్ ఒక్క సారిగా ఒ 10 మెట్లు ఎక్కినట్టే అవుతుంది. మరి ఈ న్యూస్ లో నిజం ఎంత ఉందో చూడాలి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Raj B Shetty: ఆరేళ్లు ప్రేమించాక హ్యాండిచ్చిన అమ్మాయి.. రాజ్‌ బి శెట్టిని మార్చేసిన బ్రేకప్‌ లవ్‌ స్టోరీ
Recommended image2
కేడీ ది డెవిల్ సినిమాకు, ఎన్టీఆర్ హీరోయిన్‌కి మ‌ధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆమె ఎందుకు ట్రెండ్ అవుతోంది.
Recommended image3
India Top 10 Heroes: మహేష్‌ కి చరణ్‌ ఝలక్‌, టాప్‌ 10లోకి దూసుకొచ్చిన పవన్‌.. నెంబర్‌ 1 ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved