డిప్రెషన్ నుంచి బయటపడి.. కమెడియన్ బబ్లూ రీ ఎంట్రీ.. ఆ ముగ్గురూ చనిపోవడంతో...?
టాలీవుడ్ ప్రేక్షకులకు కమెడియన్ బబ్లూను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వెండితెరకు చాలా కాలం దూరంగా ఉన్న ఈ హాస్య నటుడు రీ ఎంట్రీకి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
కమెడియన్ బబ్లూ తెలుగు ఆడియన్స్ కు బాగా పరిచయం ఉన్న పేరు. బబ్లూ పేరు వినగానే గుండ్రంగా.. బన్నులా ఉండే ఆకారం అందరికి ఎదరుగా వస్తుంది. చిన్నతనంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బబ్లూ.. ఆతరువాత గ్యాప్ ఇచ్చి.. చిత్రం సినిమాతో మళ్ళీ తెరపై కనిపించారు.
వరుస సినిమాలలో కమెడయిన్ గా సందడి చేసిన బబ్లూ.. తన మ్యానరిజంతో.. సెపరేట్ ఇమేజ్ ను సాధించాడు. చిత్రం సినిమా నాటికి బబ్లూ 10వ తరగతి మాత్రమే చదువుతున్నాడు. ఈక్రమంలో చిత్రం సినిమా తరువాత వరుస అవకాశాలు సాధించాడు బబ్లూ.. ఇక సడెన్ గా సినిమాల నుంచి మాయం అయిన బబ్లూ.. కొంతకాలంగా ఎక్కడ కనిపించలేదు.
ఇక రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు ఈ కమెడియన్ .. రీసెంట్‌గా వరుసగా యూట్యూబ్ ఛానల్స్ కు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ అందరికీ కనిపించారు. అసలు ఇన్ని రోజులు బబ్లూ ఏం చేశాడు.. ఎక్కడ ఉన్నాడు వివరంగా వెల్లడించాడు. బబ్లూ అలియాస్ సదానంద్ 5 ఏళ్ల వయసులో ముద్దుల మేనల్లుడు సినిమాలో నటించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు.11వ ఏట సీరియల్స్‌లో నటించడం మొదలుపెట్టారు.
అయితే సదానంద్ గా ఉన్న బబ్లూకు ఈ పేరు పెట్టింది మాత్రం హాస్య బ్రహ్మ జంద్యాల. ఇక చిత్రం సినిమా తరువాత అతని కెరీర్ మారిపోుయింది, కొన్ని సంవత్సరాలుగా వెండితెరకు దూరమైన బబ్లూ జీవితంలో అనుకోని విషాదాలు తనని క్రుంగదీశాయి.. అంతే కాదు చాలా కాలం ఆయన డిప్రెషన్ లోకి వెళ్ళినట్టుతెలుస్తోంది. 2012 లో తండ్రి మరణం, 2022 లో అనారోగ్యంతో చెల్లెలు మరణంతో బబ్లూ కోలుకోలేకపోయాడు.
అంతే కాదు.. ఈ ఇయర్ లో తన కజిన్ బ్రదర్ చనిపోవడంతో.. వరుసబాధల నుంచి తేరుకోలేకపోతున్నాడు బబ్లూ.ఇక ఈ బాధలు తట్టుకోలేక తాను బ్యాంకాక్ వెళ్లినట్లు తెలిపారు. అంతే కాుద అక్కడ డీజేగా పనిచేసి.. రీసెంట్ గా ఇండియాకు వచ్చాడట బబ్లూ.. ప్రస్తుతం తను ఓ ఫిల్మ్ అకాడమీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడట బబ్బ్లూ.
అంతే కాదు ఆయన రీ ఎంట్రీ కూడా నటుడిగా ఉండకపోవచ్చంటున్నారు. దర్శకుడిగా ఆయన త్వరలోనే తన సొంత ప్రాజెక్టుచేయడానికి రెడీ అవుతున్నానని బబ్లూ చెప్పారు.ఇక త్వరలో ఓ ఇంటివాడు కూడా కాబోతున్నాడట బబ్లూ. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఓ అమ్మాయితో తాను ప్రేమలో పడ్డట్టు వెల్లడించాడు.