వైభవంగా RRR నిర్మాత కుమారుడి వివాహం.. హాజరైన రాంచరణ్, పవన్, రాజమౌళి.. ఫొటోస్ వైరల్
ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. దానయ్య కుమారుడు కళ్యాణ్ వివాహం ఘనంగా జరిగింది. దానయ్య కుమారుడి పెళ్లి వేడుకకి టాలీవుడ్ ప్రముఖ సెలెబ్రిటీలంతా హాజరై వధూవరులని ఆశీర్వదించారు.

ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. దానయ్య కుమారుడు కళ్యాణ్ వివాహం ఘనంగా జరిగింది. దానయ్య కుమారుడి పెళ్లి వేడుకకి టాలీవుడ్ ప్రముఖ సెలెబ్రిటీలంతా హాజరై వధూవరులని ఆశీర్వదించారు. డివివి దానయ్య టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతగా కొనసాగుతున్నారు.
స్టార్ హీరోలతో బడా చిత్రాలు నిర్మించడం దానయ్య శైలి. రీసెంట్ గా రాజమౌలి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబోలో దానయ్య ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. దీనితో దానయ్య పాపులారిటీ ఇండియా మొత్తం వ్యాపించింది. ఇప్పుడు తన కుమారుడికి దానయ్య ఘనంగా వివాహం జరిపించారు.
సమత అనే అమ్మాయితో కళ్యాణ్ వివాహం కనుల పండుగలా జరిగింది. హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వివాహ వేడుక జరిగింది. దానయ్య దంపతులు టాలీవుడ్ నుంచి వచ్చిన ప్రముఖుల్ని రిసీవ్ చేసుకుని వారితో కలసి ఫోటోలు దిగారు.
కళ్యాణ్, సమత వివాహ వేడుకకి దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రాంచరణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్, ప్రశాంత్ నీల్ లాంటి వారంతా హాజరయ్యారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దానయ్య కుమారుడు కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ జాంబిరెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి అధీరా అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. దానయ్యే ఈ చిత్రాన్నిస్వయంగా నిర్మిస్తూ తన తనయుడిని ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు.
ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ లాంటి ఆస్కార్ విన్నింగ్ మూవీ తర్వాత దానయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓజి అనే యాక్షన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాహో తర్వాత సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇదే.