ఘనంగా వరుణ్ తేజ్ - లావణ్య రిసెప్షన్.. కదిలివచ్చిన తారలు (ఫొటోలు)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. నిన్న రాత్రి జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ తారలు హాజరై సందడి చేశారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ వేడుకను నిర్వహించారు.
ఈ వేడుకకు టాలీవుడ్ తారలు కదిలివచ్చారు. సెలబ్రెటీలతో వరుణ్ - లావణ్య రిసెప్షన్ వేడుక మరింత ప్రత్యేకంగా మారింది. తారల సందడితో కోలాహాలంగా మారింది.
టాలీవుడ్ లోని సీనియర్ హీరోలు, ప్రొడ్యూసర్లు, కమెడియన్లు, యంగ్ హీరోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగా కపుల్స్ తో నటుడు అభినవ్ గోమఠం ఫొటోకు ఫోజిచ్చారు.
గ్రాండ్ గా సెలబ్రేట్ చేసిన వరుణ్ రిసెప్షన్ కు హీరోయిన్లు సైతం హాజరయ్యారు. నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకమైన గిఫ్ట్స్ ను అందించారు.
వరుణ్ తేజ్ - లావణ్య రిసెప్షన్ లో యంగ్ హీరో నవదీప్ సందడి చేశారు. స్టైలిష్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఫుల్ జోష్ లో ఫొటోకు ఫోజిచ్చారు.
దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్ వరుణ్ - లావణ్య రిసెప్షన్ వేడుకలకు ప్రత్యేక అతిథిగా నిలిచారు. బ్లూ స్టైలిష్ సూట్ లో వెంకీ అదరగొట్టారు. ఫొటోలకు ఫోజులిచ్చి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి వరుణ్ - లావణ్య మరుపెళ్లిలో సందడి చేశారు. స్టైలిష్ వేర్స్ లో అన్నదమ్ములు అదరగొట్టారు.
అక్కినేని హీరో సుశాంత్ పార్టీ వేర్ లో రిసెప్షన్ కు హాజరయ్యారు. బ్లాక్ ష్టర్ లో ఆకట్టుకున్నారు. ఇలా ఫొటోకు ఫోజిచ్చి మెగా కపుల్స్ ను విష్ చేశారు.
సితారా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ యజమాని, యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ కూడా వీరి రిసెప్షన్ కు హాజరయ్యారు. సింపుల్ లుక్ తో ఆకట్టుకున్నారు.
వరుణ్ తేజ్ నటించిన ‘గాంధీవదారి అర్జున’ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ కూడా హాజరయ్యారు. వరుణ్, లావణ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ సతీమణితో కలిసి వేడుకలో పాల్గొన్నారు. వరుణ్, లావణ్య జంటను ఆశీర్వదించారు. నూతన జంటకు ఒక్కటైన సందర్భంగా శుభాాకాంక్షలు తెలిపారు.
తెలుగు హీరోయిన్, టాలీవుడ్ యంగ్ బ్యూటీ రీతూ చౌదరి బ్యూటీఫుల్ శారీలో మెరిసింది. వరుణ్, లావణ్యను విష్ చేస్తూ ఫొటోకు ఫోజుచ్చింది.
‘బేబీ’ మూవీ డైరెక్టర్ సాయి రాజేశ్, నిర్మాత ఎస్కేఎన్ వేడుకలో సందడి చేశారు. బోకేలతో ఎంట్రీ ఇచ్చి వరుణ్, లావణ్యను విష్ చేశారు. ఫొటోకు ఫోజిచ్చారు.
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుటుంబంతో సహా వేడుకకు హాజరయ్యారు. హీరో సాయి శ్రీనివాస్, గణేశ్ స్టైలిష్ వేర్స్ లో అదరగొట్టారు. యంగ్ కంపుల్ ను విష్ చేశారు.
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ సింపుల్ లుక్ లో వేడుకకు హాజరయ్యారు. బొకే అందించి నూతన వధూవరులను విష్ చేశారు. ఫొటోకు ఫోజిచ్చి అభినందించారు.
లావణ్య త్రిపాఠి కోస్టార్, యంగ్ హీరో కార్తీకేయ రిసెప్షన్ లో మెరిశారు. వరుణ్ - లావణ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫొటోకు ఇలా స్టిల్ ఇచ్చారు.
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేశ్ ఎనర్జిటిక్ లుక్ తో వరుణ్ - లావణ్య రిసెప్షన్ లో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా మెగా కపుల్ ను విష్ చేసి కలిసి ఫొటో దిగారు.
‘బలగం’ హీరో ప్రియదర్శి, యువ నటుడు ప్రిన్స్ కూడా రిసెప్షన్ లో సందడి చేశారు. యంగ్ కపుల్ ను విష్ చేస్తూ ఫొటోకు స్టిల్ ఇచ్చారు.
ఇటలీలో జరిగి వరుణ్ - లావణ్య పెళ్లిలోనూ సందడి చేసిన హీరో అల్లు శిరీష్, రిసెప్షన్ కూ స్టైలిష్ వేర్ లో హాజరయ్యారు. వారిద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు.
యంగ్ హీరో సందీప్ కిషణ్ అట్రాక్టివ్ సూట్ లో వేడుకకు హాజరయ్యారు. మెగా కపుల్ కు శుభాకాంక్షలు తెలిపి ఫొటోకు ఫోజిచ్చారు.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ తన సతీమణితో కలిసి వేడుకకు హాజరయ్యారు. స్టైలిష్ వేర్స్ లో బడా నిర్మాత అందరినీ ఆకట్టుకున్నారు.
వీరిద్దరి పెళ్లికోసం ఇటలీ వరకు వెళ్లి ఆశీర్వదించిన మెగాస్టార్ చిరంజీవి.. రిసెప్షన్ లోనూ ప్రత్యేకంగా నిలిచారు. ఈ సందర్భంగా వరుణ్ లావణ్య చిరు కాళ్లకు నమస్కరించి బ్లెస్సింగ్ స్ తీసుకున్నారు.
యంగ్ హీరో తేజా సజ్జా మెగా ఫంక్షన్ లో సందడి చేశారు. స్టైలిష్ అవుట్ ఫిట్ లో వేడుకలో అట్రాక్టివ్ గా నిలిచారు. ఈ సందర్భంగా ఫొటోకు ఫోజిచ్చి వారిని విష్ చేశారు.
జబర్దస్త్ నటుడు హైపర్ ఆది కూడా వరుణ్ తేజ్ రిసెప్షన్ కు హాజరై సందడి చేశారు. యంగ్ కపుల్ కు తన విషెస్ తెలిపి వారితో కలిసి ఫొటో దిగారు.
నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ వరుణ్ తేజ్ - లావణ్య రిసెప్షన్ కు హాజరై విష్ చేశారు. నూతన జంటతో కలిసి ఫొటో స్టిల్ ఇచ్చారు.
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సంపత్ నంది కూడా రిసెప్షన్ లో సందడి చేశారు. వరుణ్, లావణ్యకు తన విషెస్ తెలియజేశారు. నూతన జంటతో కలిసి ఫొటోకు ఫోజిచ్చారు.
నటుడు, కమెడియన్ శ్రీనివాస్ వరుణ్ - లావణ్య రిసెప్షన్ లో సందడి చేశారు. మెగా కపుల్ ను విష్ చేస్తూ ఫొటోకు ఫోజిచ్చారు.
రీసెంట్ గా ఎక్కడా కనిపించని హీరో అడివి శేష్ రిసెప్షన్ వేడుకలో సందడి చేశారు. వరుణ్, లావణ్యకు తన బెస్ట్ విషెస్ అందించారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ భార్య ఊహా, కొడుకు యంగ్ హీరో రోషన్ వేడుకలో మెరిశారు. తల్లికొడుకు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
‘పొలిమేర2’ నటుడు సత్యం రాజేశ్ ఈ యంగ్ కపుల్ రిసెప్షన్ కు హాజరయ్యారు. ఫుల్ జోష్ లో నటుడు వేడుకలోనూ ఎనర్జిటిక్ గ ా కనిపించారు. వరుణ్, లావణ్యకు విషెస్ తెలిపారు.
రిసెప్షన్ కు హాజరైన సీనియర్ నటుడు జగపతి బాబు మెగా కపుల్ ను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్, తదితరులతో కలిసి ఫోటో స్టిల్ ఇచ్చారు.
హీరో నవీన్ చంద్ర ఫ్యామిలీతో కలిసి హాజరయ్యారు. కొడుకు, భార్యతో కలిసి వేడుకలో కనిపించారు. కుటుంబంతో కలిసి నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలిపారు.
జబర్దస్త్ నటుడు, కమెడియన్ చమ్మక్ చంద్ర వేడుకలో సందడి చేశారు. వరుణ్, లావణ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫొటోకు ఫోజులిచ్చారు.
‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ సింపుల్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఫొటో గ్యాలరీలో ఫోజులిచ్చి.. స్టేజీపై వరుణ్, లావణ్యను విష్ చేశారు.
దివంగత కృష్ణంరాజు భార్య, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెద్దమ్మ శ్యామాలా దేవి వేడుకకు హాజరయ్యారు. వరుణ్, లావణ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుటుంబంతో సహా వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల రిసెప్షన్ కు హాజరయ్యారు. నవదంపతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.