ఈ వారం రిలీజ్ లు..ఏది హిట్? , ఏది ఫట్?
చిన్న సినిమాలకు సక్సెస్ వస్తే వారి ఆనందానికి అంతే ఉండదు. ఇప్పుడు పొలిమేర 2 చిత్రం టీమ్ అలాంటి బ్లాక్ బస్టర్ టాక్ తో ఆనందంలో మునిగితేలుతోంది.
boxoffice
కొన్ని సినిమాలు ఊహించని విజయాన్ని సాధిస్తాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు అలాంటి సక్సెస్ వస్తే వారి ఆనందానికి అంతే ఉండదు. ఇప్పుడు పొలిమేర 2 చిత్రం అలాంటి బ్లాక్ బస్టర్ టాక్ తో ఆనందంలో మునిగితేలుతోంది. వివరాల్లోకి వెళితే..
ఈ వారం దాదాపు ఎనిమిది సినిమాలు టాలీవుడ్ భాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. వాటిలో ఎక్కువగా కీడా కోలా సినిమాకే క్రేజ్ ఉంది. బ్రహ్మానందం, చైతన్యరావు, రాగ్‌మయూర్ ప్రధాన పాత్రల్లో నటించిన కీడాకోలా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్ స్టోరీతో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. డైరెక్టర్‌గా వ్యవహరిస్తూనే కీడాకోలా సినిమాలో తరుణ్ భాస్కర్ ఓ కీలక పాత్రలో నటించాడు. హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాను రిలీజ్ చేసాడు. ఈ వారం రిలీజ్ అవుతోన్న చిన్న సినిమాల్లో కీడా కోలాపైనే ఎక్కువగా అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా కు యావరేజ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా అదిరిపోయే రేంజిలో లేదు. కానీ అలాగని పూర్తిగా పడుకోలేదు. సినిమాకు మీడియం రేంజిలో వసూళ్లు వస్తున్నాయి. తరుణ్ భాస్కర్ కనిపించే సీన్స్ కు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇక ఈ వారం వచ్చిన మరో చిత్రం మా ఊరి పొలిమేర2. రెండేళ్ల క్రితం ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రిలీజైన ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. నేరుగా ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ.. ఊహించని విజయం సాధించడమే కాకుండా..సీక్వెల్‌పై ఆసక్తిని పెంచింది. అందుకే ‘మా ఊరి పొలిమేర 2’పై ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పార్ట్ 1కి వచ్చిన రెస్పాన్స్ చూసి ఈ సీక్వెల్‌ని థియేటర్స్‌లో రిలీజ్ చేసారు మేకర్స్. అందుకు తగ్గట్టే భారీ స్థాయిలో ప్రమోషన్స్‌ని నిర్వహించారు. దానికి తోడు ఇటీవల రిలీజైన ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(నవంబర్ 3)థియేటర్స్‌లో రిలీజైన ‘మా ఊరి పొలిమేర 2’ప్రేక్షకులను బాగానే భయపెట్టిందనే చెప్పాలి. సింగిల్ స్క్రీన్లలో ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చిందనే చెప్పాలి. అడ్వాన్స్ బుకింగ్స్ కంటే రెగ్యులర్ సిని గోయర్స్ తో థియేటర్లు ఫుల్ అయ్యాయి. ఈ సినిమాలో లెక్కకు మించి ట్విస్టులు ఉండటంతో యావరేజ్ టాక్ వచ్చింది. అయినా జనం ఈ సినిమాకు బాగానే వస్తున్నారు. రెండు సినిమాలూ తొలి వీకెండ్ ఓపెనింగ్స్‌తోనే ఈజీగా గట్టెక్కేసేలా కనిపిస్తోంది.
నరకాసుర...
పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తోన్న నరకాసుర మూవీ ఈ శుక్రవారం థియేటర్ల ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. సోషల్ మెసేజ్‌కు కమర్షియల్ అంశాలను మేళవించి రూపొందిన ఈ సినిమాలో సంకీర్తన విపిన్, అపర్ణ జనార్ధన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా దర్శకుడు. ఈ సినిమా అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. సినిమా దర్శకత్వం,కథ లోపాలుగా ఉన్నాయని చెప్తున్నారు. ఈ సినిమా గట్టెక్కటం కష్టమే అంటున్నారు.
boxoffice
అలాగే ఈ సినిమాలతో పాటు మరో నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటిల్లో ఏది జనాలు గుర్తు పెట్టుకునేలా లేదు. దర్శకద్వయం శ్రీనాథ్, శ్రీకాంత్ తెరకెక్కించిన విధి ఈ మూవీ ఈ ఫ్రైడే థియేటర్లలోకి వచ్చింది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందిన ఈ చిన్న సినిమాలో రోహిత్ నందా, ఆనంది జంటగా నటించారు. అలాగే వికాస్ ముప్పాల, గాయత్రి గుప్తా ప్రధాన పాత్రల్లో నటించిన ప్లాట్ మూవీ ఈ వీకెండ్ థియేటర్లలో సందడి చేసింది. ప్లాట్ సినిమాకు భవ తారక దర్శకుడిగా వ్యవహరించాడు. వీటితో పాటుగా నవంబర్ 3న కృష్ణ ఘట్టం, ఒక్కసారి ప్రేమించాక సినిమాలు కూడా విడుదల అయ్యాయి.
ఈ సినిమాలకు కలెక్షన్స్ లేకపోవటంతో లియో, భగవంత్ కేసరి సినిమాలకు కలెక్షన్స్ ఉన్నాయి చాలా చోట్ల .
శంకర్‌దాదా ఏంబీబీఎస్ రీ రిలీజ్
చిరంజీవి హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ శంకర్ దాదా ఏంబీబీఎస్ నవంబర్ 4న థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్‌గా నటించింది. ఈ బాలీవుడ్ రీమేక్ మూవీలో శ్రీకాంత్ కీలక పాత్రను పోషించాడు. ఈ సినిమా కు అనుకున్న స్దాయిలో ఓపినింగ్స్ రావటంలేదని వినపడుతోంది.