క్యాన్సర్ తో పోరాడి జయించిన హీరోయిన్లు వీళ్లే.. మనీషా కోయిరాలా నుంచి హంసానందిని వరకూ.. ?
క్యాన్సర్ మహమ్మారీ.. ఎంతో భవిష్యత్తు ఉన్న బాలీవుడ్ నటిని చిన్నవయస్సులోనే బలితీసుకుంది. క్యాన్సర్ తో పోరాడుతూ ఆమె మరణించింది. కాని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది తారలు క్యాన్సర్ ను జయించారు. పోరాడి గెలిచారు.
photo credit : poonam panday instagram
చిన్న వయస్సులోనే క్యాన్సర్ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయినట్టు నాటకం ఆడింది బాలీవుడ్ నటి పూనమ్ పాండే. వివాదాల హీరోయిన్ గా పేరున్న పూనమ్ సర్వికల్ క్యాన్సర్ తో ఇబ్బందిపడుతున్నారు. . ఇక ఆమె మరణించినట్టు ఆడిన నటకం... క్యాన్సర్ పై అవగాహన కోసమే అనిఅన్నారు. కాని ఈ వార్త బాలీవుడ్ లో సంచలనంగా మారింది. కాని ఇంత వరకూ ఆమెకు సబంధించిన ఫోటోలు కాని.. వీడియోలు కాని బయటకు రాలేదు. దాంతో మొదటి నుంచి అందరికి ఈ విషయంలో అనుమానమే ఉంది. కాగా బాలీవుడ్ లో చాలామంది తారలు క్యాన్సర్ బారిన పడ్డారు. కాని వారు క్యాన్సర్ తో యుద్దం చేసి.. జయించి విజేతలుగా నిలిచారు. అందులో తెలుగు తారలు కూడా ఉన్నారు.
ఈమద్యే క్యాన్సర్ తో పోరాడి గెలిచింది తెలుగు తార హంసానందిని.. హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆతరువాత స్పెషల్ సాంగ్స్ కు పరిమితం అయిన ఈబ్యూటీ.. టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హంసా నందిని 2020 లో క్యాన్సర్ బారినపడింది. ఆ ఏడాది తనకు తానే ప్రకటన చేసింది. గ్రేడ్ 3 కార్సినోమా ఉన్నట్లు తెలుసుకున్న ఆమె అందుకు తగ్గట్గుగా ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. క్రమంగా కోలుకున్నారు.
సహజ నటిగా పేరు తెచ్చుకుంది సోనాలి బింద్రే.. మహేష్ తో మురారి సినిమా చేసిన సోనాలీ.. ఈసినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో ఇంద్ర, మన్మధుడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో స్టార్ హీరోల సరసన సోనాలి బింద్రే నటించి మెప్పించింది. ఇక ఈ స్టార్ హీరోయిన్ చాలా కాలం మెటాస్టాటిక్ క్యాన్సర్ తో పోరాడిన ఆమె.. ధైర్యంగా నిలబడి ట్రీట్మెంట్ తీసుకుని కోలుకుంది.
టాలీవుడ్ తార.. మలయాళ ముద్దుగుమ్మ.. అందాల మమతా మోహన్ దాస్ కూడా క్యాన్సర్ మహమ్మారిని జయించారు. హీరోయిన్ గా, సింగర్ గా మల్టీ టాలెంట్ చూపించిన ఈమె... 2009 హాడ్కిన్ లింఫోమా క్యాన్సర్ బారిన పడింది. కాని ఏమాత్రంక్రుంగిపోకుండా.. చికిత్స తీసుకుని ఎంతో దైర్యంగా క్యాన్సర్ నుంచి బయటపడ్డారు.
అసలు బాలీవుడ్ తారల్లో ముందుగా క్యాన్సర్ మహమ్మారిని ఎదురించి జయించిన తార మనీషా కొయిరాలా అనే చెప్పాలి. మనీషా కొయిరాలాకు 2012లో అండాశయ క్యాన్సర్ వచ్చింది. కాని ఆమె ఏమాత్రం భయపడలేదు.. ధైర్యంగా ఎదురించింది. దాదాపు మూడేళ్లు నొప్పిని భరించి ట్రీట్మెంట్ తీసుకుంది.. 2015లో ఆమె క్యాన్సర్‌ను జయించారు.
తెలుగు,తమిళ భాషల్లో హీరోయిన్ గా ఊపు ఊపేసిన నటి గౌతమి. 90స్ లో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టిన అలనాటి అందాల తార గౌతమి కూడా క్యాన్సర్ ను జయించారు. గౌతమి బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడ్డారు. ఆతర్వాత ట్రీట్మెంట్ ద్వారా ఆమె ఆ మహమ్మారిని జయించారు. వీరే కాదు ఇంకా చాలా మంది తారలు క్యాన్సర్ ను జయించారు సంజయ్ దత్, తహీరా కశ్యప్, రాకేశ్ రోషన్, లాంటి స్టార్స్ ఎందరో క్యాన్సర్ ను జయించి గెలిచారు.