- Home
- Entertainment
- ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, సిరీస్ లు.. జాన్వీ కపూర్ అభిమానులకు పండగే, థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెడీ
ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, సిరీస్ లు.. జాన్వీ కపూర్ అభిమానులకు పండగే, థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెడీ
ఈ వారం ఓటీటీలో వినోదం అందించడానికి పలు వెబ్ సిరీస్ లు, సినిమాలు సిద్ధం అయ్యాయి. జాన్వీ కపూర్, అనుపమ పరమేశ్వరన్ లాంటి నటీమణుల అభిమానులకు మరింత వినోదం ఉండబోతోంది.

This Week OTT Releases
ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో వివిధ జోనర్లకు చెందిన భారతీయ అంతర్జాతీయ సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. నవంబర్ 24 నుంచి 30 వరకు సినిమా ప్రేమికులు ఇంట్లోనే వినోదాన్ని ఈ కొత్త ఓటీటీ కంటెంట్ తో పొందవచ్చు. స్ట్రేంజర్ థింగ్స్ 5 వాల్యూం 1 వంటి ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న సిరీస్ నుంచి బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ సన్నీ సంస్కారి కి తులసి కుమారి వరకు అనేక టైటిళ్లు విడుదలవుతున్నాయి. ఈ వారం స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్న ప్రతి టైటిల్ వివరాలు ఇవి.
ప్రైమ్ వీడియో
కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 (హిందీ)
రిషబ్ శెట్టి నటించిన ఫోక్ థ్రిల్లర్ కాంతారా ఎ లెజెండ్ చాప్టర్ 1 ఇప్పటికే కొన్ని వారాలుగా ప్రైం వీడియోలో స్ట్రీమింగ్‌లో ఉంది. ఇప్పుడు ఈ చిత్రం హిందీ వెర్షన్ నవంబర్ 27న ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి రానుంది.
ఎక్కడ చూడాలి: ప్రైమ్ వీడియో
రిలీజ్ డేట్: నవంబర్ 27
నెట్ ఫ్లిక్స్
సన్నీ సంస్కారి కి తులసి కుమారి
వరుణ్ ధావన్ జాన్వి కపూర్ సాన్యా మల్హోత్రా రోహిత్ సరాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ కామెడీ నవంబర్ 27 నుండి స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. అధికారిక తేదీ వచ్చే వారం ప్రకటించనున్నారు.
ఎక్కడ చూడాలి: నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్: నవంబర్ 27 (ఎక్స్‌పెక్టెడ్)
ఆర్యన్
విష్ణు విశాల్ సెల్వరాఘవన్ నటించిన తమిళ క్రైం థ్రిల్లర్ ఆర్యన్ నవంబర్ 28న ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వస్తుంది. థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాకపోయినా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో కొత్త అవకాశాలను ఆశిస్తోంది. హిందీ సహా అనేక భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఎక్కడ చూడాలి: నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్: నవంబర్ 28
స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1
అత్యంత ప్రేమించిన నెట్ ఫ్లిక్స్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ ఇప్పుడు తన చివరి అధ్యాయంలోకి ప్రవేశించింది. ఫైనల్ సీజన్‌ను రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. మొదటి భాగం నవంబర్ 26 నుండి స్ట్రీమింగ్‌లోకి వస్తుంది. రెండో భాగం క్రిస్మస్ రోజున విడుదల కానుంది. ఫైనల్ ఎపిసోడ్ న్యూ ఇయర్ ఈవ్ న విడుదల అవుతుంది.
ఎక్కడ చూడాలి: నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్: నవంబర్ 26
జింగిల్ బెల్ హైస్ట్
ఒలివియా హోల్ట్ కానర్ స్విండెల్స్ నటించిన క్రైం కేపర్ జింగిల్ బెల్ హైస్ట్ నవంబర్ 26న స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఇద్దరు చిన్న స్థాయి దొంగలు లండన్‌లో ఒకే షాపును టార్గెట్ చేసే కథ ఇది.
ఎక్కడ చూడాలి: నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్: నవంబర్ 26
కెవిన్ హార్ట్ యాక్టింగ్ మై ఏజ్
నెట్ ఫ్లిక్స్ కోసం కేవిన్ హార్ట్ ఐదవ ప్రత్యేక ప్రదర్శన యాక్టింగ్ మై ఏజ్ నవంబర్ 24న విడుదల అవుతుంది. నలభయ్యేళ్ల వయసులో ఎదురైన అనుభవాలను కామెడీ శైలిలో చెప్పనున్నాడు.
ఎక్కడ చూడాలి: నెట్ ఫ్లిక్స్
రిలీజ్ డేట్: నవంబర్ 24
జీ5
ది పెట్ డిటెక్టివ్
ప్రణేష్ విజయన్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ థ్రిల్లర్ ది పెట్ డిటెక్టివ్ నవంబర్ 28న విడుదల అవుతుంది. ఓ పెట్ మిస్సింగ్ కేసు అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్‌కు దారితీసే కథ ఇందులో చూపించారు. శరఫ్ యూ ధీన్ అనుపమ పరమేశ్వరన్ వినాయకన్ మేజర్ రవి తదితరులు నటించారు.
ఎక్కడ చూడాలి: జీ5
రిలీజ్ డేట్: నవంబర్ 28
రక్తబీజ 2
సీమా బిస్వాస్ మీమి చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన బెంగాలీ పొలిటికల్ థ్రిల్లర్ రక్తబీజ 2 నవంబర్ 28న అందుబాటులోకి రానుంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య గందరగోళం సృష్టించాలనుకునే మునీర్ ఆలం అనే లీడర్‌ను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందం చేసే రేస్ కథ.
ఎక్కడ చూడాలి: జీ5
రిలీజ్ డేట్: నవంబర్ 28
జియోహాట్ స్టార్
బోర్న్ హంగ్రీ
ప్రియాంక చోప్రా మద్దతుతో రూపొందిన దర్శకుడు బ్యారీ అవ్రిచ్ డాక్యుమెంటరీ బోర్న్ హంగ్రీ నవంబర్ 28న ప్రీమియర్ కానుంది. కెనడా చెఫ్ సాష్ సింప్సన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఎక్కడ చూడాలి: జియోహాట్ స్టార్
రిలీజ్ డేట్: నవంబర్ 28
బెల్ ఎయిర్ సీజన్ 4
వీధి తెలివితేటలతో ఉన్న ఒక యువకుడు తన ధనిక బంధువుల వద్ద నివసించాల్సి రావడంతో అతని జీవితం ఎలా మారుతుందనే కథ ఆధారంగా రూపొందిన బెల్ ఎయిర్ సీజన్ 4 నవంబర్ 25న విడుదలవుతుంది.
ఎక్కడ చూడాలి: జియోహాట్ స్టార్
రిలీజ్ డేట్: నవంబర్ 25

