- Home
- Entertainment
- Tamannaah Bhatia : మిల్క్ బ్యూటీ లేటెస్ట్ లుక్.. ఆ విషయంలో సూపర్ స్మార్ట్ అనిపిస్తున్న తమన్నా
Tamannaah Bhatia : మిల్క్ బ్యూటీ లేటెస్ట్ లుక్.. ఆ విషయంలో సూపర్ స్మార్ట్ అనిపిస్తున్న తమన్నా
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ట్రెండీ లుక్స్ లో ఆకట్టుకుంటోంది. తాజాగా మిల్క్ బ్యూటీ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ ఎంతగానో పరిచయం. కోలీవుడ్ లోనూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. మరోవైపు సౌత్ లోనూ తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ అలరిస్తోంది.
సినిమాలు, సిరీస్ లతో తమన్నా భాటియా ఆడియెన్స్ ను ఫుల్ గా ఎంటర్ టైన్ చేస్తోంది. ఊహించని విధంగా ప్రాజెక్ట్స్ ను దక్కించుకుంటోంది. తనదైన మార్క్ లో సినిమాలు చేస్తూ అదరగొడుతోంది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
మరోవైపు తమన్నా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది. లేటెస్ట్ అవుట్ ఫిట్లను పరిచయం చేస్తూ మిల్క్ బ్యూటీ చేస్తున్న ఫొటోషూట్లు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
తాజాగా తమన్నా లుక్ కు అంతా ఫిదా అవుతున్నారు. తమన్నాకు ఇండస్ట్రీలో సీనియార్టి పెరుగుతున్నా.. ఇంకా యంగ్ బ్యూటీలానే దర్శనమిస్తోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేయడంతో పాటు రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తోంది.
సినిమాల ఎంపికల విషయంలో తమన్నా మాత్రం సూపర్ స్మార్ట్ అనిపిస్తోంది. విభిన్నపాత్రల్లో అలరించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇలా స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో ‘ఓదెల 2’ చిత్రంలో నటిస్తోంది.