నాకు ఎవరూ ప్రపోజ్ చేయడంలేదు.. బాధలో అనన్య నాగళ్ల , నెటిజన్ల షాకింగ్ కామెంట్స్..?
తనకు ఎవరూ ప్రపోజ్ చేయడంలేదంటూ బాధపడుతుంది టాలీవుడ్ యాక్ట్రస్ అనన్య నాగళ్ల. ఇప్పటి వరకూ తనకు బాయ్ ఫ్రెండ్స్ లేరంటూ.. ఫీల్ అవుతుంది

చేసింది కొన్ని సినిమాలే అయినా... టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపుతో పాటు క్రేజ్‌ను సొంతం చేసుకుంది బ్యూటీ అనన్య నాగళ్ళ . మల్లేశం, వకీల్ సాబ్ లాంటి సినిమాల్లో తన పర్ఫార్మెన్స్‌తో.. ఆడియన్స్ ను ఆకట్టుకుంది. వరుస ఆఫర్లు కూడా సాధిస్తోంది. తాజాగా సమంత నటించిన శాకుంతలం సినిమాతో.. మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది బ్యూటీ.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది అనన్య నాగళ్ల. హాట్ హాట్ ఫోటోస్ తో తెగ సందడి చేస్తుంది. అంతే కాదు తన సినిమాలకు సబంధించినవే కాకుండా.. పర్సనల్ విషయలు కూడా... తన ఫ్యానస్ తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూ... ఉంటుంది బ్యూటీ.
ఈ క్రమంలోనే రీసెంట్ గా తన అభిమానులతో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది ఈ హీరోయిన్. తాజాగా ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చిన అనన్యను ఓ అభిమాని డిఫరెంట్ గా ప్రశ్నించాడు. నీ బాయ్‌ఫ్రెండ్ పేరు, అతని ఇన్‌స్టా ఐడీ ఏమిటి అని అడిగాడు. దీనికి ఆన్సర్ ఇచ్చిన అనన్య. తనకు అసలుబాయ్ ఫ్రెండ్ లేడు అంటూ.. వాపోయింది.
Ananya Nagalla
అనన్య ఆన్సర్ చేస్తూ.. బాయ్ ఫ్రెండా.. అంత సీన్ లేదు.. అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అనుకుంటున్నారు. అందుకే నన్ను ఎవరూ... ట్రై చేయడం లేదు... అని నాకు అనిపిస్తుంది. అంటూ డిఫరెంట్ గా సమాధానం చెప్పింది అనన్య. నాకు ఎవరూ ప్రపోజ్ చేయడం లేదు..అంటూ వాపోయింది ఈ బ్యూటీ.
Ananya Nagalla
దాంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలా తనకు ఎవరూ ప్రపోజ్ చేయడం లేదని అనన్య చెప్పడంతో.. అభిమానులు ఆమెకు వరుస పెట్టి ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. నన్ను ప్రేమించు అంటే.. నన్ను ప్రేమించు అంటూ.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం మంచి మంచి కథలు ఎంచుకుని.. సినిమాలు చేస్తూ.. టాలీవుడ్ లో ఎదిగే ప్రయత్నంచేస్తుంది అనన్య. చిన్న చిన్న సినిమాలు.. కథా బలం లేని సినిమాలు చేయకుండా.. మంచి పర్ఫామెన్స్ స్కోప్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తోంది. అంతే కాదు సోషల్ మీడియాలో వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్లతో అదరగొడుతుంది బ్యూటీ. ఫాలోయింగ్ ను అమాంతం పెంచుకుంటూ పోతోందిత.