MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సాయి పల్లవి మాత్రమే కాదు.. యాక్టర్లుగా మారిన డాక్టర్లు టాలీవుడ్ లో ఇంకెవరున్నారో తెలుసా..?

సాయి పల్లవి మాత్రమే కాదు.. యాక్టర్లుగా మారిన డాక్టర్లు టాలీవుడ్ లో ఇంకెవరున్నారో తెలుసా..?

హీరోయిన్ సాయి పల్లవి MBBS చదువుతూనే హీరోయిన్ గా ఇండస్ట్రీలో హీరోయిన్ గా స్టార్ స్టేటస్ సాధించింది. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో..  ముఖ్యంగా  టాలీవుడ్ లో డాక్టర్ చదివి యాక్టర్లు అయిన వారు చాలా మంది ఉన్నారు. ఇంతకీ టాలీవుడ్ లో ఉన్న డాక్టర్ కమ్ యాక్టర్లు ఎవరో చూద్దాం..

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 03 2022, 02:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సినిమాల మీద ఇంట్రెస్ట్ తో చాలా మంది డాక్టర్  చదువులు చదివి.. యాక్టర్లుగా మారారు. మరికొంత మంది మాత్రం ప్రాక్టీస్ చేస్తూనే.. టైమ్ దొరికినప్పుడు యాక్టర్ చేస్తూ వస్తున్నారు. మరికొంత మంది మాత్రం డాక్టర్ చదువులను మధ్యలోనే ఆపేసి యాక్టర్ల అవతారం ఎత్తారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

సాయి పల్లవి హీరోయిన్ గా సౌత్ లో ఎంత స్టార్ డమ్ సంపాదించిందో అందరికి తెలుసు. డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీ... ఫిల్మ్ కెరీర్ ను చూసుకుంటూనే.. తన MBBS ను కంప్లీట్ చేసింది. పేదవారి డాక్టర్ గా పేరు తెచ్చుకుంటా అంటోంది సాయి.. సినిమాల విషయంలో కూడా సెలక్టీవ్ గా వెళ్తోన్న సాయి పల్లవి.. స్టార్ హీరో అని చూడకుండా.. తన పాత్ర ఇంపార్టెన్స్ ను బట్టి సినిమా చేస్తుంది. 
 

37

ఇక ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా...  స్టార్ హీరోగా వెలుగు వెలిగిన రాజశేఖర్ కూడా డాక్టరే. తమిళనాడుకు చెందిన రాజశేఖర్.. అక్కడే మెడిసిన్ కంప్లీట్ చేసి.. కొన్నాళ్ళు ప్రాక్టీస్ కూడా చేశారు. ఆతరువాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీకి వచ్చిన ఈ హీరో.. కోలీవుడ్ ను వదిలి.. టాలీవుడ్ లో సెటిల్ అయ్యారు. 
 

47

టాలీవుడ్ లో చాలా సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేశాడు.. చేస్తున్నాడు భరత్ రెడ్డి. వైజాక్ కు చెందిన.. ఈ డాక్టర్.. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇష్టంతో.. అటు డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తూనే.. టైమ చూసుకుని సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. 
 

57

మరో వైపు యంగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. అజ్మిల్ అమీర్ కూడా మెడిసిన్ చదివిన వ్యక్తే. రచ్చ సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ కంట్లో పడిన ఈ యంగ్ స్టార్ రంగం సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఆతరువాత రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో వై ఎస్ జగన్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. 

67

ఇక ఇప్పటి వారే కాదు.. అలనాటి టాలీవుడ్ లెజెండరీ నటులలో కూడా డాక్టర్లు ఉన్నారు. తన కామెడీతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన  అల్లు  రామలింగయ్య కూడా   డాక్టరే. కాని ఆయన ఆయుర్వేదంలో స్పెషలిస్ట్. అటు సినిమాలు చేసుకుంటూనే తనకు వచ్చిన వైధ్య వృత్తిని కూడా అప్పుడప్పుడు చేసేవారట పెద్దాయిన. 
 

77

తెలుగు చిత్ర పరిశ్రమలోని మరో లెజండరీ యాక్టర్ ప్రభాకర్ రెడ్డి కూడా డాక్టరే. ఆయన మెడిసిన్ కంప్లీట్ చేసి.. కొంత కాలం ప్రక్టీస్ చేసిన తరువాత సినిమాలపై ఫుల్ గ్రిప్ తెచ్చుకున్నారట. ఇలా టాలీవుడ్ లో మరికొంత మందిస్టార్స్ మెడిసిన్  పూర్తి చేసినవారు ఉన్నారు.. మధ్యలోనే ఆపి మూవీ కెరీన్ ను చూసుకన్న వాళ్ళు కూడా ఉన్నారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి

Latest Videos
Recommended Stories
Recommended image1
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image2
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Recommended image3
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved