MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • Supreeth Reddy: కారు డ్రైవర్‍ ను చితకబాదిన ఛత్రపతి నటుడు కాట్రాజ్..వివాదంలో సుప్రీత్ రెడ్డి

Supreeth Reddy: కారు డ్రైవర్‍ ను చితకబాదిన ఛత్రపతి నటుడు కాట్రాజ్..వివాదంలో సుప్రీత్ రెడ్డి

Supreeth Reddy: ఛత్రపతి సినిమాలో కాట్రాజ్ గుర్తున్నాడా..ఎందుకు గుర్తుండరు...మర్చిపోయే క్యారెక్టరా అది. ఒక్క సీన్‍తో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడా కాట్రాజ్...ఓ క్యాబ్ డ్రైవర్ కొట్టి వివాదంలో ఇరుకున్నాడు. 

1 Min read
Author : Nandini Arava
Published : Jun 09 2026, 07:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
క్యాబ్ డ్రైవర్‍పై కాట్రాజ్ వీరంగం
Image Credit : telangana voice/instagram

క్యాబ్ డ్రైవర్‍పై కాట్రాజ్ వీరంగం

తెరపై విలన్‌గా భయపెట్టిన కాట్రాజ్...రియల్ లైఫ్ లోనూ అదే ధోరణి కనిపించడం వివాదాస్పదంగా మారింది. చిన్న గొడవ చివరకు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. కేసు కూడా నమోదైంది. ఇంతకీ ఆ విలన్ ఎవరూ అంటే...ఛత్రపతి సినిమాలో నటించిన కాట్రాజ్..సుప్రీత్ రెడ్డి.

పోలీసులు చెప్పిన ప్రకారం...శ్రీహరి అనే వ్యక్తి ఊబర్ నడుపుతుంటారు. ఆదివారం రోజూ తన ట్రిప్ ఫినిష్ చేసి మరో ట్రిప్ కోసం నాగారం చౌరస్తా సమీపంలో వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో అటుగా వచ్చిన సుప్రీత్ రెడ్డి తనకు అడ్డంగా క్యాబ్ ఉందని కోపంలో ఊగిపోయాడు. ఆ ఆవేశంతో వెంటనే కారు దిగి క్యాబ్ డ్రైవర్‍తో వాగ్వాదానికి దిగారు.

ఆ చిన్న గొడవ కాస్తా ముదిరి వివాదానికి దారి తీసింది. అదే కోపంతో సుప్రీత్ రెడ్డి...తనను కొట్టి, తిట్టినట్లు క్యాబ్ డ్రైవర్ శ్రీహరి తెలిపారు. ఫోన్ కూడా తీసుకున్నారని...ఎంత బతిమాలినా ఇవ్వలేదని వాపోయారు. 20 నిమిషాల తర్వాత ఫోన్ ఇచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22
సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన వివాదం
Image Credit : twitter

సోషల్ మీడియాలో చర్చకు దారితీసిన వివాదం

కీసర పోలీసులు...క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఘటనాస్థలిని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ కూడా సేకరించే పనిలో ఉన్నారు. విచారణలో భాగంగా సుప్రీత్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది.

ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీసింది. సెలబ్రిటీలు సాధారణ ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు క్యాబ్ డ్రైవర్ల సంఘాలు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.

సుప్రీత్ రెడ్డి టాలీవుడ్ ప్రజలకు తెలియని వ్యక్తేం కాదు. పవన కల్యాణ్ నటించిన జానీ సినిమాలో నటించారు. ఛత్రపతి సినిమాలో కాట్రాజ్ పాత్రతో గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మర్యాద రామన్న, దూకుడు, మిర్చి సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 

Related Articles

Related image1
Karuppu Controversy: డైరెక్టర్‌పై సూర్య అభిమానులు ఫైర్.. ఇంత పెద్ద హిట్టైనా గొడవేంటి? సీఎం విజయ్‌ వల్లే వివాదం
Related image2
Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ల సినిమా ఎలా ఉందంటే?

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Injury: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక, షూటింగ్స్ తో ఇక ఫుల్ బిజీ.. ఇవన్నీ మిస్ అవుతా, వైరల్ ఫోటోస్
Recommended image2
Tortoise First Look: అస్సలు గుర్తు పట్టలేని విధంగా రాజ్ తరుణ్, ఇంత వైల్డ్ గా ఉన్నాడేంటి
Recommended image3
Korean Kanakaraju: థియేటర్స్ లో సక్సెస్, ఓటీటీ స్ట్రీమింగ్ వరుణ్ తేజ్ మూవీ రెడీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే
Related Stories
Recommended image1
Karuppu Controversy: డైరెక్టర్‌పై సూర్య అభిమానులు ఫైర్.. ఇంత పెద్ద హిట్టైనా గొడవేంటి? సీఎం విజయ్‌ వల్లే వివాదం
Recommended image2
Peddi Movie Review: పెద్ది మూవీ రివ్యూ, రేటింగ్‌.. రామ్‌ చరణ్‌, జాన్వీకపూర్‌ల సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved