- Home
- Entertainment
- Thug Life Collections: `థగ్ లైఫ్` 5 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్, కమల్ మూవీ ఎంత వసూలు చేసిందంటే?
Thug Life Collections: `థగ్ లైఫ్` 5 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్, కమల్ మూవీ ఎంత వసూలు చేసిందంటే?
కమల్ హాసన్ నటించిన `థగ్ లైఫ్` మూవీ ఐదు రోజుల కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
`థగ్ లైఫ్` ఐదు రోజుల కలెక్షన్లు
మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్, సింబు, త్రిష, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్ వంటి అనేక మంది నటించిన చిత్రం ‘థగ్ లైఫ్’. ఇది తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. జూన్ 5న ఇతర భాషల్లో విడుదలైన ఈ చిత్రం కన్నడ భాషా వివాదం కారణంగా కర్ణాటకలో మాత్రం విడుదల కాలేదు. మిగిలిన నాలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే మిశ్రమ స్పందన లభించింది.
ప్రమోషన్ చేసినా ప్రయోజనం లేదు
సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ బాగానే ఉన్నప్పటికీ, తర్వాతి రోజుల్లో అనుకున్న స్థాయిలో ఆదరణ లభించలేదు. దీంతో ‘థగ్ లైఫ్’ చిత్ర బృందం నిరాశకు గురైంది. సినిమా విడుదలకు రెండు వారాల ముందు నుంచే చిత్ర బృందం అనేక రాష్ట్రాల్లో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించింది. తమిళనాడులో కూడా ప్రమోషన్ ఈవెంట్స్ గట్టిగానే చేసింది. తెలుగులోనూ ఈవెంట్లు నిర్వహించారు. కానీ అది సినిమాకి ఆశించిన స్థాయిలో హెల్ప్ కాలేదు.
`థగ్ లైఫ్`పై భారీ అంచనాలు
రెహ్మాన్ సంగీతం అందించిన మూవీ పాటలు హిట్ అయ్యాయి, కన్నడ భాషా వివాదం, కేరళ ప్రేక్షకుల కోసం జోజు జార్జ్‌ని సినిమాలో చేర్చుకోవడం, యువతను ఆకర్షించడానికి సింబుని చేర్చుకోవడం, `జింగుచా` పాట హిట్ కావడం వంటివి సోషల్ మీడియాలో భారీ అంచనాలను పెంచాయి.
38 ఏళ్ల తర్వాత మణిరత్నం దర్శకత్వంలో కమల్ నటిస్తున్నారని తెలియగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, టీజర్‌లను చూసి సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి అంచనాలను పెంచారు.
వసూళ్లలో దెబ్బతిన్న ‘థగ్ లైఫ్’
కానీ సినిమా విడుదలైన తర్వాత వారు ఊహించిన స్థాయిలో లేకపోవడం, కథ బలహీనంగా ఉండటంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. సోషల్ మీడియాలో ‘థగ్ లైఫ్’ చిత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఇదే సినిమా వసూళ్లు తగ్గడానికి కారణంగా చెబుతున్నారు. పెద్దగా ప్రచారం లేకుండా తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సమయంలో, భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్, కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినా కథ బాగా లేకపోవడంతో `థగ్ లైఫ్` ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోతుంది.
‘దగ్ లైఫ్’ ఐదు రోజుల కలెక్షన్లు
`థగ్ లైఫ్’ కలెక్షన్లు చూస్తే, చిత్రం మొదటి రోజు రూ.15.5 కోట్లు, రెండో రోజు రూ.7.15 కోట్లు, మూడో రోజు రూ.7.75 కోట్లు, నాలుగో రోజు రూ.6.5 కోట్లు, ఐదో రోజు రూ.3.25 కోట్లు వసూలు చేసింది. భారతదేశం మొత్తం మీద దాదాపు రూ.40 కోట్లు వసూలు చేసింది.
ఇక ఓవర్సీస్‌లో మాత్రం దుమ్ములేపుతుంది. ఈ చిత్రం అక్కడ ఇప్పటికే రూ.40కోట్లు దాటిందని సమాచారం. అక్కడ ఇంకా మంచి ప్రభావాన్నిచూపుతుంది. దీంతో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.80కోట్లకుపైగా వసూళ్లని రాబట్టినట్టు సమాచారం. అయితే వసూళ్ల విషయంలో చిత్ర బృందం మౌనంగా ఉండటం గమనార్హం.