MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పుష్ప2, దేవర, కల్కి 2898 ఏడీ.. నెలకో సినిమా.. ఇక బాక్సాఫీస్ బద్దలే.!

పుష్ప2, దేవర, కల్కి 2898 ఏడీ.. నెలకో సినిమా.. ఇక బాక్సాఫీస్ బద్దలే.!

తెలుగు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంటున్న వేళ.. టాలీవుడ్ నుంచి మూడు భారీ చిత్రాలు పుష్ప2, దేవర, కల్కి 2898 ఏడీ వరుసగా విడుదల కాబోతున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు ఖాయమంటున్నారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 26 2023, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రెండు నెలల వ్యవధిలోనే మూడు భారీ స్కేల్ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటుతుండగా.. వరుసగా మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలు వరుసగా థియేటర్లలోకి రాబోతుండటం ఆసక్తికరంగా మారింది. ముందుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  నటిస్తున్న ‘పుష్ప2’ రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే ‘పుష్ప : ది రైజ్’ చిత్రంలో బన్నీ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ సినీ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. దీంతో Pushpa 2 The Rule పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి  22న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బన్నీతోనే బాక్సాఫీస్ వసూళ్ల రికార్డు ప్రారంభం కానుందని అంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన Where is Pushpa? కు మాసీవ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ ను కూడా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. దీంతో వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ థియేటర్లలోకి రాబోతోంది. చిత్రంలో రష్మిక మందన్న కథనాయిక. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్  రూ.350 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
 

36

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్  చిత్రాల్లో ఒకటైన ‘దేవర’ చిత్రం ఇప్పటికే రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది. 2024 ఏప్రిల్ 5న భారీ  స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. అయితే ‘పుష్ప2’ రిలీజ్ అయిన పదిహేను రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.NTR) నటిస్తున్నచిత్రం కావడంతో తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి. 

46

Devara  చిత్రం కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతుండటంతో అంచనాలు నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు దక్కించుకోవడంతో.. ఈ సినిమాను భారీ స్కేల్లో రిలీజ్ చేస్తున్నారు. మరోవైపు వరల్డ్ వైడ్ గా సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. అందుకు తగ్గట్టుగానే హాలీవుడ్ టెక్నీషియన్లతో భారీ వీఎఫ్ఎక్స్, యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టం ఖాయమని అంటున్నారు. 

56

నెల గ్యాప్ లోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా Kalki 2898 AD ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ సినీ వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం.. చిత్రాన్ని వచ్చే ఏడాది మే 9న విడుదల కాబోతుందని అంటున్నారు. ఈ చిత్రంపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద రూ.2000 కోట్లకు పైగా వసూళ్లు చేసే దిశగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. 
 

66

‘కల్కి 2898 ఏడీ’ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ కు మాసీవ్ రెస్పాన్స్ దక్కింది. హాలీవుడ్ రేంజ్ లో ఫస్ట్ అప్డేట్ ను అందించారు. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రంతో తెలుగు సినిమా స్థాయి నెక్ట్స్ లెవల్ కు వెళ్లడం ఖాయమంటున్నారు.  ఇలా మూడు భారీ చిత్రాలు టాలీవుడ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కాబోతుండటంతో ఇండియన్ ఆడియెన్స్ కు పండుగ అనే చెప్పాలి. రికార్డుల మోత కూడా మోగనుందని అంటున్నారు. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ గా రాబోతున్న చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొణె, కృతి సనన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి టాప్ స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూ.500 కోట్లతో తెరకెక్కుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sreemukhi: కొత్త ఇంట్లోకి శ్రీముఖి గృహ ప్రవేశం, నాలుగేళ్లలో ఇది రెండో లగ్జరీ హౌస్
Recommended image2
Dhurandhar 2 వచ్చేస్తోంది, ఓటీటీ ఆడియన్స్ కి అసలు సిసలైన పండగ.. ఈ వారం రిలీజ్ కాబోతున్న మరిన్ని సినిమాలు
Recommended image3
Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved