- Home
- Entertainment
- Jagapathi Babu: నా భార్య ఎప్పుడూ నా వెంట నడవదు, ఆ రోజు చాలా బాధపడింది.. వైఫ్ గురించి ఓపెనైన జగపతిబాబు
Jagapathi Babu: నా భార్య ఎప్పుడూ నా వెంట నడవదు, ఆ రోజు చాలా బాధపడింది.. వైఫ్ గురించి ఓపెనైన జగపతిబాబు
జగపతిబాబు ప్రస్తుతం `పెద్ది` చిత్రంతో అలరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన భార్య గురించి ఓపెన్ అయ్యారు. ఆమె ఎప్పుడూ తన వెంట నడిచేందుకు ఇంట్రెస్ట్ చూపించదని వెల్లడించారు జగపతి.

`పెద్ది`తో ఆకట్టుకుంటున్న జగపతిబాబు
జగపతిబాబు ఒకప్పుడు హీరోగా మెప్పించారు. స్టార్ హీరోగా రాణించారు. మంచి ఫ్యామిలీ చిత్రాలు చేసి ఆకట్టుకున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ లో తన ఫాలోయింగ్‌ని పెంచుకున్నారు. అయితే `లెజెండ్` తర్వాత రూట్ మార్చారు జగపతిబాబు. క్యారెక్టర్స్ వైపు టర్న్ తీసుకున్నారు. హీరోగా చేసిన చిత్రాలు ఆడకపోవడంతో బలమైన పాత్రల్లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. విలన్‌తోపాటు బలమైన ఇతర క్యారెక్టర్స్ చేస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన `పెద్ది`లో మెరిశారు.
అప్పలసూరిగా దుమ్ములేపిన జగపతిబాబు
పెద్ది సినిమాలో అప్పలసూరి పాత్రలో కనిపించారు జగపతిబాబు. తమ కొండకింద వూరు కోసం ఆయన రైల్వే స్టేషన్ తేవడం కోసం పోరాడే వ్యక్తి పాత్రలో కనిపించారు. ముప్పైఏళ్లపాటు ఆయన తన పోరాటం కొనసాగించి, చివరికి ఆ ట్రైన్ యాక్సిడెంట్‌లోనే మరణిస్తాడు. చాలా బలమైన పాత్ర, చాలా ఎమోషన్స్ ఉన్న పాత్రలో ఆయన అదరగొట్టారు. ఈ సినిమా విజయవంతంగా రన్ అవుతుంది. రెండో వారం కలెక్షన్లు తగ్గాయి. బ్రేక్ ఈవెన్‌కి వెళ్తుందా అనే సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే పోటీ లేకపోవడం ఈ చిత్రానికి కలిసి వచ్చే అవకాశం ఉంది.
తన భార్య గురించి ఓపెన్ అయిన జగపతిబాబు
ఇదిలా ఉంటే జగపతిబాబు.. తన ఫ్యామిలీ గురించి, తన భార్య గురించి ఎప్పుడూ పెద్దగా మాట్లాడరు, వారి ప్రస్తావన కూడా రాదు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఓపెన్ అయ్యారు. తన జీవితంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటన గురించి ఆయన వెల్లడించారు. తన భార్య లక్ష్మి బాధపడిన సందర్భం గురించి, ఆమె తన వెంట నడవకపోవడానికి సంబంధించిన రహస్యాన్ని జగపతిబాబు వెల్లడించారు. కొన్నాళ్ల క్రితం జగపతిబాబు తన ఇంటిని అమ్మేశారు. తాను ఉంటున్న ఇళ్లు అమ్మడానికి కారణం అప్పులు అని తెలుస్తోంది. మూడు కోట్ల అప్పు కోసం ఇంటిని అమ్మేశారట. అయితే ఆ ఇంటిని ఖాళీ చేసేటప్పుడు ఇంట్లో తాను లేడట. `లెజెండ్` షూటింగ్ జరుగుతుందట. ఆ షూటింగ్‌లో ఉన్నాడట. తన భార్య, పిల్లలు మాత్రమే వెకేట్ చేశారట. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు జగపతిబాబు.
నా భార్య అప్పుడు బాధపడింది
తాను లేకపోవడం అనేది తనకు బాధ లేదని, కాకపోతే ఫ్యామిలీ, సెంటిమెంట్ అనే యాంగిల్‌లో చూస్తే బాధగానే ఉంటుందని, కానీ ఆ సమయంలో తన పరిస్థితి వేరే అని, ఆ ఎమోషన్ తనకు లేదన్నారు. అయితే తన భార్య బాధపడి ఉండొచ్చు అన్నారు. ఆమె తనతో ఎప్పుడూ తన బాధని చెప్పలేదు, కానీ కచ్చితంగా ఆమె బాధపడే ఉంటుంది. ఆడవారికి ఆ ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది, పైగా ఆ సమయంలో వాళ్ల వెంట నేను లేను, కాబట్టి బాధ అనేది కచ్చితంగా ఉంటుందన్నారు జగపతిబాబు.
తనతో నడవడం ఆమెకి ఇష్టం లేదు
తన భార్య, పిల్లల ప్రస్తావన ఎప్పుడూ రాదనే ప్రశ్నకి సమాధానం చెబుతూ, వాళ్లకి ఈ పబ్లిసిటీ ఇష్టం లేదు, మీడియాలో రావాలని, బయటకు ఎక్స్ పోజ్ కావాలని ఎప్పుడూ అనుకోరు, అది వారికి నచ్చదు. అందుకే మేం ఎప్పుడైనా బయటకు వెళితే, షాపింగ్, మాల్ వంటి వాటికి వెళ్తే, ఎప్పుడూ నా వెంట నడవదు, ముందు అయినా వెళ్లిపోతారు, ఆ తర్వాత వెనకాల అయినా వస్తారు, గానీ నాతో మాత్రం కలిసి నడవరు. వాళ్లు సినిమాకి పూర్తి దూరంగా ఉండాలనుకుంటారు` అని తెలిపారు జగపతిబాబు.

