MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ఈ వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలు.. హవా మొత్తం నేషనల్‌ క్రష్‌ దే

ఈ వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలు.. హవా మొత్తం నేషనల్‌ క్రష్‌ దే

ఈ వారం థియేటర్లోకి ఐదు సినిమాలు రాబోతున్నాయి. అయితే వాటిలో అందరి చూపు రష్మిక మందన్నా నటించిన సినిమాపైనే ఉంది. అంతేకాదు డిఫరెంట్‌ జోనర్‌ మూవీస్‌ అలరించేందుకు వస్తున్నాయి. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Nov 03 2025, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఈ వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలు(నవంబర్‌ 7)
Image Credit : Asianet News

ఈ వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలు(నవంబర్‌ 7)

ఈ వారం  థియేటర్లోకి పలు ఇంట్రెస్టింగ్‌ మూవీస్‌ రాబోతున్నాయి. అయితే ఈ వారం పెద్ద సినిమాలు లేవు. మిడిల్‌ బడ్జెట్‌ చిత్రాలే ఉన్నాయి. వాటిలో రష్మిక మందన్నా నటించిన మూవీ హడావుడి ఎక్కువగా ఉంది. ఆమెతోపాటు సుధీర్‌ బాబు బాలీవుడ్‌ లో నటించిన సినిమా అదే రోజు తెలుగు, హిందీలో రిలీజ్‌ కాబోతుంది. వీటితోపాటు మరో మూడు చిన్న సినిమాలు ఈ వారం ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నాయి. ఆ సినిమాల వివరాలు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అందరి చూపు రష్మిక మందన్నా `ది గర్ల్ ఫ్రెండ్‌`
Image Credit : Asianet News

అందరి చూపు రష్మిక మందన్నా `ది గర్ల్ ఫ్రెండ్‌`

ఈ నవంబర్‌ 7న మెయిన్‌గా రాబోతున్న సినిమా నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా నటించిన `ది గర్ల్ ఫ్రెండ్` ఉంది. ఇది లవ్‌ స్టోరీ నేపథ్యంలో రూపొందింది. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీతో దీన్ని రూపొందించారు దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌. ఇందులో `దసరా` ఫేమ్‌ దీక్షిత్ శెట్టి రష్మిక మందన్నాకి జోడీగా నటించారు. వీరిద్దరు ప్రేమలో పడటం, విడిపోయేందుకు స్ట్రగుల్‌ అవడం అనే కాన్సెప్ట్ తో రూపొందినట్టుగా ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది. అయితే లవర్స్ ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదనేది చెప్పే మూవీ అవుతుందని, ఆ మధ్య ట్రైలర్‌ ఈవెంట్‌లో టీమ్‌ తెలిపింది. దీంతో ఈ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి సంయుక్తంగా నిర్మించారు. పాన్‌ ఇండియా సినిమాలతో సందడి చేసిన రష్మిక మందన్నా ఈ మూవీతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.

Related Articles

Related image1
మోహన్‌బాబుతో బాత్‌ రూమ్‌ సీన్‌ చేయనంటూ కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా? వణికిపోయిన డైరెక్టర్
Related image2
`డ్రాగన్‌` ఆగిపోవడానికి కారణం ఇదేనా.. ఎన్టీఆర్‌పై గట్టిగా పడ్డ `వార్‌ 2` డిజాస్టర్‌ దెబ్బ
36
సుధీర్‌ బాబు సరికొత్త ప్రయోగం `జటాధర`
Image Credit : Asianet News

సుధీర్‌ బాబు సరికొత్త ప్రయోగం `జటాధర`

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న మరో ప్రామిసింగ్‌ మూవీ `జటాధర`. సుధీర్‌ బాబు హీరోగా నటించిన చిత్రమిది. ఇందులో సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించింది. మహేష్‌ బాబు మరదలు శిల్పా శిరోద్కర్‌ కీలక పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రంతో సోనాక్షి సిన్హా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. హిందీ, తెలుగులో  సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ గా `జటాధర`ని రూపొందించారు. పాన్-ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాకి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ నెల 7న ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. కంటెంట్‌ పరంగా ఆకట్టుకునేలా ఉంది. కానీ సినిమాకి బజ్‌ లేకపోవడం గమనార్హం.

46
`మసూద` హీరో క్రేజీ కామెడీ మూవీ
Image Credit : Asianet News

`మసూద` హీరో క్రేజీ కామెడీ మూవీ

వీటితోపాటు మరో రెండు చిన్న సినిమాలున్నాయి. వాటిలో ప్రధానంగా ఆసక్తిని క్రియేట్‌ చేస్తోన్న మూవీ `ది గ్రేటెస్ట్ ప్రీ వెడ్డింగ్‌ షో`. `మసూద` ఫేమ్‌ తిరువీర్‌ హీరోగా నటించిన చిత్రమిది. ఆద్యంతం కామెడీ ఎంటర్‌ టైనర్‌గా రూపొందింది. ఇందులో టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటించింది. రాహుల్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. 7పీఎం ప్రొడక్షన్స్, పప్పెట్‌ షోస్‌ పతాకాలపై అగరం సందీప్‌, అష్మిత రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్‌ షూట్ ఇప్పుడు ట్రెండ్‌ అయ్యింది. ఆ షూట్‌ విషయంలో చోటు చేసుకున్న కామెడీనే ఈ మూవీగా ఉంటుందని తెలుస్తోంది. ఈ నెల 7న చిన్న చిత్రాల్లో ఇది ఆసక్తికరంగా మారింది. మరి ఏ మేరకు నవ్విస్తుందో చూడాలి.

56
బాలనటుడుసాత్విక్‌ హీరోగా సినిమా
Image Credit : Asianet News

బాలనటుడుసాత్విక్‌ హీరోగా సినిమా

అనేక సినిమాల్లో బాల నటుడిగా నటించిన సాత్విక్‌ వర్మ హీరోగా నటిస్తోన్న మూవీ `ప్రేమిస్తున్నా`. ఇందులో ప్రీతి నేహా హీరోయిన్‌గా నటించింది. భాను దర్శకత్వంలో వరలక్ష్మి పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మించిన చిత్రమిది. సరికొత్త టీనేజ్‌ లవ్‌ స్టోరీతో ఈ చిత్రం తెరకెక్కింది. ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ మూవీ ఈ నెల 7న ఆడియెన్స్ ముందుకు రాబోతుంది.

66
డబ్బింగ్‌ మూవీ విష్ణు విశాల్ `ఆర్యన్‌`
Image Credit : Asianet News

డబ్బింగ్‌ మూవీ విష్ణు విశాల్ `ఆర్యన్‌`

ఇదే రోజు రాబోతున్న మరో మూవీ `ఆర్యన్`. తమిళంలో రూపొందిన చిత్రమిది. ఇందులో విష్ణు విశాల్‌ హీరోగా నటించారు. ప్రవీణ్‌ కె దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్‌, మానస చౌదరీ హీరోయిన్లుగా నటించారు. విష్ణు విశాల్ స్టూడియో నిర్మించిన ఈ మూవీ ఈ నెల 31న తమిళంతో విడుదల అయ్యింది. అక్కడ మిశ్రమ స్పందన రాబట్టుకుంది. సీరియల్‌ కిల్లర్‌ నేపథ్యంలో క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాని ఈ నెల 7న తెలుగులో విడుదల చేయబోతున్నారు. మరి తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా అనేది చూడాలి. ఇలా ఈ వారం ఐదు సినిమాలు ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేయబోతున్నాయి. ఐదు డిఫరెంట్‌ జోనర్‌ మూవీస్‌ ఉండటం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
రష్మిక మందన్న

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image3
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Related Stories
Recommended image1
మోహన్‌బాబుతో బాత్‌ రూమ్‌ సీన్‌ చేయనంటూ కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా? వణికిపోయిన డైరెక్టర్
Recommended image2
`డ్రాగన్‌` ఆగిపోవడానికి కారణం ఇదేనా.. ఎన్టీఆర్‌పై గట్టిగా పడ్డ `వార్‌ 2` డిజాస్టర్‌ దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved