- Home
- Entertainment
- `డ్రాగన్` ఆగిపోవడానికి కారణం ఇదేనా.. ఎన్టీఆర్‌పై గట్టిగా పడ్డ `వార్ 2` డిజాస్టర్ దెబ్బ
`డ్రాగన్` ఆగిపోవడానికి కారణం ఇదేనా.. ఎన్టీఆర్‌పై గట్టిగా పడ్డ `వార్ 2` డిజాస్టర్ దెబ్బ
ఎన్టీఆర్ పై `వార్ 2` డిజాస్టర్ ప్రభావం గట్టిగానే ఉంది. దీని కారణంగానే `దేవర 2` ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న `డ్రాగన్`పై కూడా గట్టిగా పడింది.

`దేవర` సక్సెస్‌తో జోష్‌లో ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ `దేవర` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ మూవీకి నెగటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబట్టింది. అయితే నార్త్ లో బాగా ఆడింది. యాక్షన్ మూవీ కావడంతో హిందీ ఆడియెన్స్ ఈ మూవీని బాగా ఆదరించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కంటే హిందీ బెల్ట్ లో ఈ మూవీకి విశేష స్పందన లభించడం విశేషం. అదే సమయంలో తారక్‌కి హిందీలో మంచి మార్కెట్ కూడా ఏర్పడింది. ఈ మూవీ ఇచ్చిన హైలో కొత్త ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పారు ఎన్టీఆర్. అనంతరం వచ్చిన చిత్రమే `వార్ 2`.
`వార్ 2`తో డిజాస్టర్ ఎదుర్కొన్న తారక్
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన `వార్ 2` చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీ ఆగస్ట్ 14న విడుదలైంది. మొదటి షో నుంచే నెగటివ్ టాక్ వచ్చింది. ఓవరాల్‌గా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీకి ముందు ఎన్టీఆర్ ఎంతో కాన్పిడెన్స్ ని వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగిన `వార్ 2` ఈవెంట్‌లో మొదటిసారి ఆయన డబుల్ కాలర్ ఎగరేశారు. దీంతో ఫ్యాన్స్ ఊగిపోయారు. కానీ థియేటర్‌లోకి వెళ్లి చూస్తే ఆ రేంజ్‌లో సినిమా లేదు. స్పై యాక్షన్ మూవీస్ హిందీలో బాగా ఆడతాయి. మన ఆడియెన్స్ కి పెద్దగా ఎక్కవు. ఈ మూవీ విషయంలో అదే జరిగింది. అయితే విచిత్రంగా `వార్ 2` నార్త్ లో కూడా ఆడకపోవడం విచారకరం.
`డ్రాగన్` మూవీపై `వార్ 2` ఎఫెక్ట్
ఈ మూవీ డిజాస్టర్ ఎఫెక్ట్ ఎన్టీఆర్‌పై గట్టిగానే ఉంది. ఆయన చాలా డిస్టర్బ్ అయినట్టు తెలుస్తోంది. కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారట. అందులో భాగంగానే `దేవర 2` ఆగిపోయిందని, దీన్ని పక్కన పెట్టారనే టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా ఉంటుందని ఆ తర్వాత `దేవర` ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా టీమ్ వెల్లడించింది. `దేవర 2` కోసం వెయిట్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలో ఇప్పుడు `డ్రాగన్` మూవీపై పెద్ద దెబ్బ పడింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే మూవీ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్ కూడా పూర్తయ్యింది.
`డ్రాగన్` ఆగిపోయిందా?
కానీ ఇప్పటి వరకు వచ్చిన ఔట్ పుట్‌ని చూసి ఎన్టీఆర్ సంతృప్తి చెందలేదట. కంటెంట్ పరంగానూ డిజప్పాయింట్ అయ్యారట. తన లుక్స్ కూడా నచ్చలేదట. ఇలా అయితే సినిమా వర్కౌట్ కాదని చెప్పారట. దీంతో ఇప్పటి వరకు షూట్ చేసిన కంటెంట్ మొత్తాన్ని పక్కన పెట్టారట. ఈ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్‌కి, ఎన్టీఆర్‌కి మధ్య కొంత బేధాభిప్రాయాలు కూడా వచ్చినట్టు సమాచారం. ఎన్టీఆర్ చెప్పిన మార్పులను ప్రశాంత్ నీల్ ఒప్పుకోవడం లేదని, అదే ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ కి కారణమయ్యిందని అంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ లోనూ కొన్ని మార్పులు చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే మళ్లీ మూవీ షూటింగ్‌ని ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అయితే సినిమా ఆగిపోయిందా అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ప్రాజెక్ట్ ఆగిపోలేదని, కొన్ని మార్పులతో మూవీని త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
ప్రశ్నార్థకంగా ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీస్
ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ లు కూడా ప్రశ్నార్థకంగా మారాయి. ఎన్టీఆర్, నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఓ మూవీ అనుకున్నారు. నాగవంశీ ఈ సినిమాని సెట్ చేశారు. త్వరలోనే అనౌన్స్ మెంట్ కూడా వస్తుందని భావించారు. కానీ ఇప్పుడు దాన్ని హోల్డ్ లో పెట్టారట. నాగవంశీ నిర్మించిన సినిమాలు కూడా వరుసగా పరాజయం చెందుతున్నాయి. దీంతో ఆయన భారీగా నష్టపోయారు. ఆ ప్రభావం కొత్త ప్రాజెక్ట్ లపై పడుతుందని అంటున్నారు. దీంతోపాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్.. వెంకటేష్‌తో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత తారక్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఉన్న క్లారిటీ ప్రకారం ఈ మూవీ ఒక్కటే ఉండబోతుందని అంటున్నారు. మిగిలిన మూవీస్ సెట్స్ పైకి వచ్చేంత వరకు క్లారిటీ లేదని టాక్.