MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఈ వారం థియేటర్స్ లో సందడి చేసే చిత్రాలు, విజయ్ సేతుపతి నుంచి అక్షయ్ కుమార్ వరకు..

ఈ వారం థియేటర్స్ లో సందడి చేసే చిత్రాలు, విజయ్ సేతుపతి నుంచి అక్షయ్ కుమార్ వరకు..

అక్షయ్ కుమార్, విజయ్ సేతుపతి, రాజ్ కుమార్ రావు లాంటి క్రేజీ హీరోలు నటించిన చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 19 2025, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
థియేటర్లలో అక్షయ్ కుమార్, విజయ్ సేతుపతి సందడి
Image Credit : Asianet News

థియేటర్లలో అక్షయ్ కుమార్, విజయ్ సేతుపతి సందడి

ఈ వారం కొన్ని ఆసక్తికర చిత్రాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అక్షయ్ కుమార్, విజయ్ సేతుపతి, రాజ్ కుమార్ రావు లాంటి క్రేజీ హీరోలు నటించిన చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఆ చిత్రాల రిలీజ్ డేట్ లో ఇతర వివరాలు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఏస్ మూవీ
Image Credit : Asianet News

ఏస్ మూవీ

ఆర్ముగ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఏస్ చిత్రంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ జంటగా నటించారు. రొమాంటిక్ క్రైమ్ కామెడీ జానర్లో ఈ చిత్రం తెరకెక్కింది. మే 23న ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ కి రెడీ అవుతోంది.

37
కేసరి చాప్టర్ 2
Image Credit : instagram

కేసరి చాప్టర్ 2

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన కేసరి చాప్టర్ 2 చిత్రం ఆల్రెడీ హిందీలో విడుదలై ప్రశంసలు దక్కించుకుంది. ఈ మూవీలో అనన్య పాండే, రెజీనా, మాధవన్ ఇతర కీలక పాత్రలో నటించారు. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1919 జలియన్ వాలాబాగ్ సంఘటన ఆధారంగా కథ ఉంటుంది. మే 23న సురేష్ ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

47
భూల్ చుక్ మాఫ్
Image Credit : ANI

భూల్ చుక్ మాఫ్

రాజ్ కుమార్ రావు, వామిక గబ్బి జంటగా నటించిన భూల్ చుక్ మాఫ్ చిత్రం మే 9నే రిలీజ్ కావాల్సింది. ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో డైరెక్ట్ గా మే 16న ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. పరిస్థితులు చక్కబడడంతో తిరిగి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మే 23న ఈ చిత్రం థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

57
వైభవం
Image Credit : Asianet News

వైభవం

డెబ్యూ డైరెక్టర్ సాత్విక్ దర్శకత్వంలో రూపొందిన వైభవం చిత్రం మే 23న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీలో రుత్విక్, ఇక్రా ఇద్రిసి జంటగా నటించారు. కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందింది.

67
కేసరి వీర్
Image Credit : ANI

కేసరి వీర్

బాలీవుడ్ లో మరో హిస్టారికల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రిన్స్ థిమన్, కనుబాయి చౌహాన్ దర్శకత్వంలో రూపొందిన కేసరి వీర్ చిత్రం మే 23న రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ మూవీలో సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్, ఆకాంక్ష శర్మ కీలక పాత్రలో నటించారు. హిస్టారికల్ మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి.

77
ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్ సిరీస్ లు
Image Credit : Asianet News

ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్ సిరీస్ లు

అమెజాన్ ప్రైమ్ లో మే 20 నుంచి మోటార్ హెడ్స్ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. సారా సిల్వర్ మ్యాన్ మే 20 న, రియల్ మెన్ వెబ్ సిరీస్ మే 21న, డివైడ్ రోబో అనే యానిమేషన్ మూవీ మే 24న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇక జియో హాట్ స్టార్ లో ల్యాండ్ మాన్ వెబ్ సిరీస్ మే 21న, హార్ట్ బీట్ 2 మే 22న స్ట్రీమింగ్ కానున్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
బాలీవుడ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chakkora Movie Review: చకోర మూవీ రివ్యూ.. సరికొత్త ప్రేమ కథలోని సందేశం ఎలా ఉందంటే?
Recommended image2
Top 5 Mangli Folk Songs: యూట్యూబ్ షేక్ అంతే.. మంగ్లీ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image3
Rajamouli: మాట తప్పిన అల్లు అరవింద్.. కోపంతో రగిలిపోయిన రాజమౌళి! ఏం చేశాడంటే?
Related Stories
Recommended image1
కొత్త ఇంట్లో భావోద్వేగానికి గురైన అనసూయ, ఆ పేరు వెనుక ఎమోషనల్ స్టోరీ
Recommended image2
శివయ్యా అని పిలిస్తే రారు, మంచు మనోజ్ సెటైర్లు వైరల్.. ఎన్ని జన్మలైనా మోహన్ బాబు కొడుకునే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved