- Home
- Entertainment
- Latha Mangeshkar:లతాజీ ఎందుకు వివాహం చేసుకోలేదు? మాజీ క్రికెటర్ తో వివాహం ఎందుకు క్యాన్సిల్ అయ్యింది?
Latha Mangeshkar:లతాజీ ఎందుకు వివాహం చేసుకోలేదు? మాజీ క్రికెటర్ తో వివాహం ఎందుకు క్యాన్సిల్ అయ్యింది?
లతా మంగేష్కర్ (Latha Mangeshkar) లెగసి వర్ణించడానికి పదాలు చాలవు. కోట్లాది అభిమానుల సంగీత దేవతగా ఆమె ఆరాధించబడ్డారు. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన ఆమె కీర్తి ఎనలేనిది. అలాంటి లతా మంగేష్కర్ వ్యక్తిగత జీవితం అసంపూర్ణం. డబ్బు, హోదా, కీర్తి, ఆనందం లతాజీ సొంతం. అయినప్పటికీ ఆమె వివాహం ఎందుకు చేసుకోలేదనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది.

నిండైన చీర, నుదుటున కుంకుమ, వాలు జడ... లతాజీ వస్త్రధారణ, అలంకరణ చాలా సింపుల్. చివరి శ్వాస వరకు ఆమె ఇదే సాంప్రదాయం కొనసాగించారు. చిన్న వయసులోనే స్టార్ సింగర్ గా ఫేమ్ తెచ్చుకున్న లతాజీ వివాహం ఎందుకు చేసుకోలేదనే ప్రశ్న ఆమె అభిమానుల మనస్సులో అలానే నిలిచిపోయింది . అయితే గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో లతాజీ ఈ ప్రశ్నకు స్పందించారు.
latha mangeshkar
ఓ ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న లతా మంగేష్కర్ పెళ్లిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . జీవితంలో ప్రతిదీ దేవుడు నిర్ణయం ఆధారంగానే జరుగుతుంది. ఏది జరిగినా అది మన మంచి కోసమే అనుకోవాలి. పెళ్లి వద్దనుకునే ఆడపిల్లలు కూడా ఉంటారా? అనే ఈ ప్రశ్న ఓ నలభై ఏళ్ల క్రితం అడిగి ఉంటే నా ఆన్సర్ మరోలా ఉండేదేమో. ఈ వయసులో అలాంటి ఆలోచలకు తావు లేదు.. అంటూ ఆమె సమాధానం చెప్పారు. ఈ ఇంటర్వ్యూ నాటికి లతాజీ వయసు 82 సంవత్సరాలు.
அம்மா - சகோதரியுடன் லதா மங்கேஷ்கர்
లతాజీ పెళ్లిపై చేసిన మరొక కామెంట్... కుటుంబంలో పెద్ద అమ్మాయిని కావడం వలన అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఓ దశలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పటికీ ఈ కారణంగా కుదరలేదు, అని లతా మంగేష్కర్ తెలిపారు. లతా మంగేష్కర్ 13ఏళ్ల వయసులో తండ్రి మరణించారు. దీనితో కుటుంబ పోషణ బాధ్యత లతాజీ తీసుకున్నారు . అతి చిన్న ప్రాయంలో ఆమె కెరీర్ మొదలుపెట్టారు.
అయితే మాజీ క్రికెటర్, బీసీసీఐ ప్రెసిడెంట్ రాజ్ సింగ్ దుంగార్పూర్ తో లతాజీ అత్యంత సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. రాయల్ ఫ్యామిలీకి చెందిన రాజ్ సింగ్ దుంగార్పూర్ తండ్రితో లతాజీని వివాహం చేసుకుంటానని చెప్పారట. ఆయన అంగీకరించకపోవడంతో ఈ వివాహం జరగలేదనేది ప్రచారంలో ఉన్న ఒక వార్త. అయితే తాను పెళ్లి చేసుకోకపోవడానికి ఇది ఒక కారణంగా లతా మంగేష్కర్ ఎప్పుడూ చెప్పలేదు.
వివాహం చేసుకోని లతాజీ ఒంటరితనం ఎప్పుడైనా ఫీల్ అయ్యారా..? అంటే ఈ ప్రశ్నకు ఆమె సమాధానం... తన క్లోజ్ ఫ్రెండ్స్ లో చాలా మంది మరణించారు. నర్గీస్, మీనా కుమారి నాకు అత్యంత ఆప్తులు వారు ఇప్పుడు లేరు. వారు చనిపోయేవరకు కూడా ఎప్పుడూ టచ్ లో ఉండేవారం. అలాగే దేవ్ ఆనంద్ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఇక పాటలు పాడడం నాకు అత్యంత ఇష్టమైన విషయం. అప్పుడు ఎలాంటి ఒంటరితనం ఫీల్ అవును.. అంటూ చెప్పుకొచ్చారు.