MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Folk Song: పాట కొత్తదే.. కానీ లుక్ పాతది.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపించే సూపర్ సాంగ్!

Folk Song: పాట కొత్తదే.. కానీ లుక్ పాతది.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపించే సూపర్ సాంగ్!

Folk Song: ఒక పాట వైరల్ కావాలంటే క్యాచీ బీట్ ఉంటే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని పాటలు మాత్రం మ్యూజిక్ తో పాటు విజువల్స్‌తోనూ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి. అలా యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న ఓ ఫోక్ సాంగ్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Jun 17 2026, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దారిపొంటత్తుండు.. దవ్వ దవ్వత్తుండు ఫోక్ సాంగ్
Image Credit : YouTube i Tree Music

దారిపొంటత్తుండు.. దవ్వ దవ్వత్తుండు ఫోక్ సాంగ్

ఇటీవల యూట్యూబ్ లో విపరీతమైన ఆదరణ పొందిన జానపద పాటల్లో దారిపొంటత్తుండు.. దవ్వ దవ్వత్తుండు.. పాట ఒకటి. యూట్యూబ్ లో 129 మిలియన్ల వ్యూస్ తో దుమ్ములేపుతోంది. ఈ పాట వినడానికి పూర్తిగా కొత్త తరం ఫోక్ సాంగ్‌లా అనిపించినా, చూడగానే పాత తెలుగు సినిమాలను గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ఈ వీడియోలో కనిపించే హీరోయిన్ లుక్, మేకప్, డ్రెస్సింగ్ స్టైల్ పాత తెలుగు సినిమా హీరోయిన్స్ ని గుర్తు చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సహజమైన యాసతో..
Image Credit : YouTube i Tree Music

సహజమైన యాసతో..

ఈ పాటను ప్రత్యేకంగా నిలబెట్టిన అంశాల్లో మొదటిది భాష. తెలంగాణ పల్లెల్లో వినిపించే సహజమైన యాసను ఏమాత్రం మార్చకుండా పాటలో వినిపించారు. దారిపొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు, దారిద్దునా, వోనిద్దునా వంటి పదాలు వినడానికి కొత్తగా అనిపించినా, వాటిలో పల్లెటూరి మట్టి వాసన ఉంటుంది. ఈ పదాలు కేవలం లిరిక్స్‌గా కాకుండా, పల్లె యువత మాట్లాడుకునే మాటల్లా అనిపిస్తాయి. అందుకే పాట వినే ప్రతి ఒక్కరికీ అది చాలా సహజంగా అనిపిస్తుంది. అలాగే సోషల్ మీడియా రీల్స్, షార్ట్ వీడియోల ద్వారా ఈ పాట చాలా ఫాస్ట్ గా ప్రజల్లోకి వెళ్లింది.

34
పాతతరం హీరోయిన్ లుక్ తో..
Image Credit : YouTube i Tree Music

పాతతరం హీరోయిన్ లుక్ తో..

ఈ పాటను మరింత ప్రత్యేకంగా మార్చింది మాత్రం దాని వీడియో. పాట కొత్తది, సంగీతం కొత్తది, ప్రేక్షకులు కొత్త తరం వారే. కానీ వీడియోలో కనిపించే హీరోయిన్ లుక్ మాత్రం మనల్ని దశాబ్దాల వెనక్కి తీసుకెళ్తుంది. ప్రస్తుతం విడుదలయ్యే చాలా ఫోక్ వీడియోల్లో లేటెస్ట్ ఫ్యాషన్, ఆకట్టుకునే మేకప్, సోషల్ మీడియా ట్రెండ్‌ల ప్రభావం కనిపిస్తుంటుంది. కానీ “దారిపొంటత్తుండు” వీడియోలో మాత్రం అందుకు భిన్నమైన ప్రయత్నం కనిపిస్తుంది. హీరోయిన్‌ను చూసిన క్షణం పాత తెలుగు సినిమాలు జ్ఞాపకం వస్తాయి.

44
సహజంగా కనిపించే మేకప్
Image Credit : YouTube i Tree Music

సహజంగా కనిపించే మేకప్

ముఖ్యంగా పాత తెలుగు సినిమాల్లో కనిపించిన హీరోయిన్ పాత్రల మాదిరిగానే ఈ పాటలో హీరోయిన్‌ను తీర్చిదిద్దారు. చూడచక్కని దుస్తులు, మంచి హెయిర్ స్టైల్స్, బొట్టు, సహజంగా కనిపించే మేకప్ ఇవన్నీ కలిసి ఒక పాతకాలపు అందాన్ని తెరపై ఆవిష్కరించాయి. ఆ కాలంలో హీరోయిన్ల అందాన్ని గ్లామర్‌తో కాకుండా సహజంగా చూపించేవారు. అదే భావన ఈ పాటలో కూడా కనిపిస్తుంది. బహుశా అందుకే ఈ పాట ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుందేమో.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rukmini Vasanth Upcoming Movies: డ్రాగన్‌ బ్యూటీ చేతిలో అదిరిపోయే సినిమాలు.. రుక్మిణి వసంత్‌ మూవీస్‌ లిస్ట్
Recommended image2
Ktr Review on Paradise: నాని ప్యారడైజ్‌ మూవీపై కేటీఆర్‌ రివ్యూ.. కానీ అసలు విషయం చెప్పలేదేంటి?
Recommended image3
Aditya 369 Review: బాలకృష్ణకు గెస్ట్ రోల్ ఇద్దామనుకున్నారు.. అరవ హీరోతో చేయాల్సిన సినిమా.. ఆదిత్య 369 మూవీ రివ్యూ
Related Stories
Recommended image1
Folk Song: ఈ పాటలో అన్నీ డబుల్ మీనింగ్ పదాలే.. కానీ పాట మాత్రం సూపర్ హిట్, 103 మిలియన్ వ్యూస్!
Recommended image2
Mass Song: 150 మిలియన్ వ్యూస్, 1.6M లైక్స్.. యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న మాస్ సాంగ్, వింటే పూనకాలే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved