MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Entertainment
  • Mass Song: 150 మిలియన్ వ్యూస్, 1.6M లైక్స్.. యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న మాస్ సాంగ్, వింటే పూనకాలే!

Mass Song: 150 మిలియన్ వ్యూస్, 1.6M లైక్స్.. యూట్యూబ్ ని షేక్ చేస్తోన్న మాస్ సాంగ్, వింటే పూనకాలే!

Mass Song: యూట్యూబ్‌లో ఒక పాట విడుదలై కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించడం సాధారణమే. కానీ కొన్ని సాంగ్స్ మాత్రం రిలీజై నెలలు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గదు. అలా 3 నెలల్లో 150M వ్యూస్, 1.6M లైక్స్ తో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న మాస్ సాంగ్ ఏంటో తెలుసా?

2 Min read
Author : Kavitha G
Published : May 27 2026, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యూట్యూబ్ లో దుమ్ము లేపుతున్న ఆయా షేర్ సాంగ్
Image Credit : X

యూట్యూబ్ లో దుమ్ము లేపుతున్న ఆయా షేర్ సాంగ్

యూట్యూబ్‌ను షేక్ చేస్తూ కోట్ల వ్యూస్ సాధించిన సాంగ్స్ చాలా ఉన్నాయి. కానీ తక్కువ టైంలో అలాంటి హైప్ సొంతం చేసుకున్న పాటల్లో హీరో నాని నటిస్తున్న ‘ది పారడైజ్’ మూవీ నుంచి వచ్చిన ఆయా షేర్ సాంగ్ ఒకటి. రిలీజ్ అయిన క్షణం నుంచే ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో సెన్సేషన్‌గా మారింది. ముఖ్యంగా నాని కొత్త మాస్ లుక్, ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్స్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన పవర్‌ఫుల్ బీట్ ఈ పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
150 మిలియన్లకు పైగా వ్యూస్
Image Credit : X

150 మిలియన్లకు పైగా వ్యూస్

ఆయా షేర్ సాంగ్ విడుదలై దాదాపు మూడు నెలలు కావస్తోంది. ఈ 3 నెలల్లో 150 మిలియన్లకు పైగా వ్యూస్, 1.6 మిలియన్లకు పైగా లైక్స్ తో యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. నాని కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ గ్రోత్ అందుకున్న పాటగా ఆయా షేర్ నిలిచిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ను కూడా చాలా వేగంగా దాటింది.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode:దక్షిణమూర్తికి యాక్సిడెంట్-ప్రాణం కాపాడిన శివన్నారాయణ-ఏం జరగబోతుంది?
Related image2
Karthika Deepam 2 Today Episode: చిచ్చు పెట్టిన జ్యో- శివన్నారాయణ ఉగ్రరూపం- కార్తీక్ కి చెంప దెబ్బ
35
నాని హుక్ స్టెప్
Image Credit : X

నాని హుక్ స్టెప్

ఈ పాటకు ఇంతటి రీచ్ రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి నాని చేసిన హుక్ స్టెప్. ఈ స్టెప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వేలాది మంది అభిమానులు ఈ స్టెప్ ని రీల్స్ చేయడం ప్రారంభించారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ పాటకు డ్యాన్స్ చేయడం సాంగ్ రీచ్‌ను మరింత పెంచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న చాలా వీడియోల్లో ఈ పాట బ్యాక్‌గ్రౌండ్‌గా వినిపించడం మనం చూస్తూనే ఉన్నాం.

45
మూవీపై భారీ అంచనాలు
Image Credit : Asianet News

మూవీపై భారీ అంచనాలు

ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన ఎనర్జిటిక్ కంపోజిషన్ ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకుంది. తెలంగాణ ఫోక్ టచ్‌తో పాటు మాస్ బీట్ కలిపిన విధానం సాంగ్‌ను ప్రత్యేకంగా నిలబెట్టిందనే చెప్పాలి. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్ లో వచ్చిన దసరా సినిమా బ్లాక్‌బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కాంబోలో వస్తున్న ది ప్యారడైజ్ మూవిపై కూడా మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను “ఆయా షేర్” సాంగ్ మరింత పెంచింది. ముఖ్యంగా నాని ఈ సినిమాలో కనిపించిన రగ్గ్డ్ లుక్, భారీ సెట్స్, మాస్ విజువల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

55
ఆయా షేర్ సాంగ్ లిరిక్స్
Image Credit : X

ఆయా షేర్ సాంగ్ లిరిక్స్

యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న ఆయా షేర్ సాంగ్ లిరిక్స్ ఓసారి చూసేయండి

హేయ్ నీ అయ్యా జాగీరా.. చల్ మావోడొచ్చిండ్రా

ఇగ జడ్తియ్యాలే.. జుంబలికే ఆయా షేర్..

హేయ్ దర్ కా సుల్తానే.. మా గర్ కా సైతానే

చల్ షికార్ జెయ్యా.. జుంబలికే ఆయా షేర్

పచ్చబొట్టు గాయమిది.. ఆయా షేర్..

గుంజుకునే న్యాయమిది.. ఆయా షేర్..

బూడిదల గడ్డ ఇది.. ఆయా షేర్..

మాతో రాయబడ్డ కథే ఇదీ.. ఆయా షేర్..

జడలురో జడలురో హడలురో దఢలురో..

కొడతరో తొడలురో తీస్తరో తోలురో..

సవారికే దొరుకు బిడ్డా.. శవాలే లేస్తయ్ బిడ్డా..

పేగుల్ తీసి మెడలో యేసి..

ఆడుతం బిడ్డా ఆడుతం బిడ్డా..

ఆడ ఈడ ఏడ జూడు బిడ్డా..

వణుకే పుట్టాలింక పడితెనే నా నీడ..

బొంద పెడుతా మాలిక్‌నైనా గూడా..

వాడి సావు రాసుకొచ్చిన దేవునికాడా..

చల్ ఉడుకుతుంది సారా బట్టిలో మా కంట తడే

జుంబలికే ఆయా ఆయా షేర్..

ఇక రాలుతది బొట్టు బొట్టులో నీ పంచె తడే

జుంబలికే ఆయా ఆయా షేర్..

జడలురో జడలురో హడలురో దఢలురో..

కొడతరో తొడలురో తీస్తరో తోలురో..

సవారికి దొరుకు బిడ్డా... శవాలే లేస్తయ్ బిడ్డా..

పేగుల్ తీసి మెడలో యేసి..

ఆడుతం బిడ్డా ఆడుతం బిడ్డా..

హే బరి బాతాలున్నొన్రా... బర్ బాధే అయినొన్రా

నన్ను పీకుతావా... జుంబలికే ఆయా షేర్

హే మొల్దారం లేనోన్రా... నీకన్నా మొండోన్రా

ఇగ పీకుతావా... జుంబలికే ఆయా షేర్...

పొట్టు పొట్టు ఆకలుంది... ఆయా షేర్

మెట్టు మెట్టు ఎక్కుతరా... ఆయా షేర్

పేరు పత్తా లేనొన్నిర్రా... ఆయా షేర్

చూస్కో ప్యారడైజ్‌కే అడ్రస్ అయితా... ఆయా షేర్..

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rhea Chakraborty Home: వావ్.. రియా చక్రవర్తి కొత్త ఇల్లు చూశారా? లండన్ స్టైల్ కిచెన్‌తో అదుర్స్!
Recommended image2
Tollywood: సింగిల్ స్క్రీన్ లో టికెట్ ధర రూ.300, ఆడియన్స్ కి ఇక చుక్కలే.. తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు
Recommended image3
Ayesha Khan: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందా? మిస్టరీ మ్యాన్‌తో ఆయేషా ఖాన్ ఫొటోలు వైరల్
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దక్షిణమూర్తికి యాక్సిడెంట్-ప్రాణం కాపాడిన శివన్నారాయణ-ఏం జరగబోతుంది?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: చిచ్చు పెట్టిన జ్యో- శివన్నారాయణ ఉగ్రరూపం- కార్తీక్ కి చెంప దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved