ఆర్తి అగర్వాల్ కెరీర్ నాశనం అయ్యింది అతడి వల్లే, అందుకే డిప్రెషన్ లోకి వెళ్ళింది, నిర్మాత షాకింగ్ కామెంట్స్
ఆర్తి అగర్వాల్ అనూహ్యంగా ఈ లోకాన్ని విడిచిపోయారు. ఆమె మరణానికి పరోక్షంగా కొందరు కారణమయ్యారనే వాదన ఉంది. ఆ వ్యక్తి ఎవరో సీనియర్ నిర్మాత బయటపెట్టారు.
కొందరు అమ్మాయిలు పరిశ్రమలో అడుగు పెడుతూనే సంచలనం క్రియేట్ చేస్తారు. వారిలో ఆర్తి అగర్వాల్ ఒకరు. పాగల్ పన్ అనే హిందీ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది ఆర్తి అగర్వాల్. దర్శకుడు కే విజయ భాస్కర్ టాలీవుడ్ కి తీసుకొచ్చారు. వెంకటేష్ కి జంటగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఆర్తి అగర్వాల్.
నువ్వు నాకు నచ్చావ్ బ్లాక్ బస్టర్ కావడంతో ఆఫర్స్ క్యూ కట్టాయి. అనంతరం అల్లరి రాముడు, ఇంద్ర చిత్రాల్లో ఆమె నటించారు. ఏక కాలంలో ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇంద్ర ఇండస్ట్రీ హిట్ కొట్టింది. వరుసగా ఆర్తి అగర్వాల్ కి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయి. మహేష్ బాబు, ప్రభాస్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్స్ తో జతకట్టింది.
తరుణ్ కి జంటగా నువ్వు లేక నేను లేను, సోగ్గాడు చిత్రాల్లో ఆర్తి అగర్వాల్ నటించింది. వీరిద్దరి మధ్య ఎఫైర్ నడిచిందనే వాదన ఉంది. తరుణ్-ఆర్తి అగర్వాల్ వివాహం చేసుకోవాలని అనుకున్నారట. కుటుంబ సభ్యులు వీరి ప్రేమను వ్యతిరేకించారని కథనాలు వెలువడ్డాయి. తరుణ్ పేరెంట్స్ ఆర్తి అగర్వాల్ తో ఎఫైర్ వార్తలను ఖండించారు.
ఆర్తి అగర్వాల్ కెరీర్ నాశనం చేసింది ఆమె తండ్రే అని నిర్మాత చంటి అడ్డాల చెప్పడం చర్చకు దారి తీసింది. ఆయన మాట్లాడుతూ... అల్లరి రాముడు మూవీలో ఎన్టీఆర్ కి జంటగా ఛార్మి నటించాల్సింది. కానీ ఆర్తి అగర్వాల్ ని తీసుకున్నాము. మా బ్యానర్ లో అడవి రాముడు చిత్రం కూడా చేసింది. ఆర్తి అగర్వాల్ సెట్స్ లో చాలా హుషారుగా ఉండేది.
వాళ్ళ నాన్న వస్తే సైలెంట్ అయిపోతుంది. ఆర్తి అగర్వాల్ మీద ఆమె తండ్రి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. సినిమాల ఎంపికతో పాటు కెరీర్ విషయంలో తండ్రే నిర్ణయాలు తీసుకునేవాడు. ఆర్తి అగర్వాల్ తండ్రి ఒత్తిడి కారణంగానే డిప్రెషన్ గురైంది, అన్నారు. చంటి అడ్డాల చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.
బరువు పెరిగి షేప్ అవుట్ అయిన ఆర్తి అగర్వాల్ కెరీర్ 2010 తర్వాత పూర్తిగా నెమ్మదించింది. 2011 అనంతరం ఓ నాలుగేళ్లు ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. 2007లో వివాహం చేసుకున్న ఆర్తి అగర్వాల్ 2009లో విడాకులు తీసుకుంది. 2015లో ఆర్తి అగర్వాల్ కన్నుమూశారు. బరువు తగ్గేందుకు లైపోసక్షన్ చేయించుకోవడం కారణంగానే ఆమె మరణించారనే వాదన ఉంది.