యాంకరింగ్ మానేసిన ప్రదీప్ ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ వీడియోతో మేటర్ లీక్! వద్దంటున్న ఫ్యాన్స్!
ప్రదీప్ మాచిరాజు స్టార్ యాంకర్. చాలా కాలంగా బుల్లితెరపై ఆయన హవా నడుస్తోంది. సడన్ గా యాంకరింగ్ మానేసిన ప్రదీప్ మాచిరాజు ఏం చేస్తున్నాడో ఓ వీడియోతో వెలుగులోకి వచ్చింది.
Anchor Pradeep Machiraju
అబ్బాయిలు యాంకర్ గా సక్సెస్ కావడం అంత ఈజీ కాదు. కానీ ప్రదీప్ మాచిరాజు బుల్లితెర మీద సంచలనాలు చేశాడు. ఒక దశలో సుమ కనకాలకు పోటీ ఇచ్చిన ఏకైన యాంకర్ ఎవరంటే ప్రదీప్ మాచిరాజు.
గడసరి అత్త సొగసరి కోడలు షో ప్రదీప్ కి ఫేమ్ తెచ్చింది. ఏళ్ల తరబడి ఆ గేమ్ షోలో ప్రదీప్ యాంకర్ గా చేశాడు. ప్రదీప్ మాచిరాజు హోస్ట్ గా ప్రసారమైన కొంచెం టచ్ లో ఉంటే చెప్తా విశేష ఆదరణ పొందింది. ఇక ఢీ షోలో ప్రదీప్ యాంకరింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
డాన్స్ రియాలిటీ షో ఢీ కి ప్రదీప్ యాంకర్ గా చాలా కాలం చేశాడు. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది ఎంట్రీ అనంతరం ఢీ షో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. సుధీర్-ప్రదీప్-ఆది కాంబోలో సూపర్ సక్సెస్ అని చెప్పాలి. వీరు ముగ్గురు కామెడీ చేస్తుంటే పగలబడి నవ్వడం ప్రేక్షకుల వంతు.
కాగా ప్రదీప్ సడన్ గా బుల్లితెరకు దూరం అయ్యాడు. ప్రదీప్ ఢీ షోలో కనిపించడం లేదు. ఆయన స్థానంలో నటుడు నందు వచ్చాడు. ఢీ తో పాటు ఇతర షోలలో కూడా ప్రదీప్ కనిపించడం లేదు. ఈ క్రమంలో ప్రదీప్ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేశాడనే టాక్ వినిపిస్తుంది.
ఈ ఊహాగానాల మధ్య ప్రదీప్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రదీప్ జిమ్ లో విపరీతంగా కష్టపడుతున్నాడు. అతడు కండలు తిరిగిన శరీరం కలిగి ఉన్నాడు. ప్రదీప్ మేకోవర్ షాక్ ఇస్తుంది. ఆయన లుక్ ఆకట్టుకుంది. దీంతో ప్రదీప్ తన నెక్స్ట్ మూవీ కోసమే ఇలా మేకోవర్ అవుతున్నాడనే వాదన మొదలైంది.
Anchor Pradeep Machiraju
గతంలో పలు చిత్రాల్లో ప్రదీప్ చిన్న చిన్న పాత్రలు చేశాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రంతో హీరో అయ్యాడు. ఆ మూవీ పర్లేదు అనిపించుకుంది. హీరోగా చేసినా యాంకరింగ్ వదల్లేదు. ఆ మూవీ ఫలితం అనంతరం ప్రదీప్ వెండితెర జోలికి పోలేదు. మరి ఇప్పుడు యాంకరింగ్ వదిలేసి బాడీ పెంచుతున్న ప్రదీప్ సినిమా కోసమే కావచ్చు అనిపిస్తుంది.
అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాలు గినిమాలు మనకు వద్దు. హాయిగా యాంకరింగ్ చేసుకుందాం. మీరు మరలా బుల్లితెరకు వచ్చేయ్ అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అసలు మేటర్ ఏంటో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.