- Home
- Entertainment
- తెలుగు మూవీ ‘లైగర్’పై అనన్య పాండే ఫీలింగ్ ఇదే.. త్రోబ్యాక్ పిక్స్ షేర్ చేస్తూ ఎమోషనల్ అయిన బాలీవుడ్ బ్యూటీ..
తెలుగు మూవీ ‘లైగర్’పై అనన్య పాండే ఫీలింగ్ ఇదే.. త్రోబ్యాక్ పిక్స్ షేర్ చేస్తూ ఎమోషనల్ అయిన బాలీవుడ్ బ్యూటీ..
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే త్వరలో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వనుంది. తన గ్లామర్ మెరుపులతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ సందర్భంగా తను నటించిన ‘లైగర్’ మూవీ గురించి ఇలా చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ లో ప్రస్తుతం అనన్య పాండే (Ananya Panday) పేరు హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అనన్య పాండే.. త్వరలో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తొలిసారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’. మూవీలో విజయ్ కి జంటగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే ఆడిపాడింది. ఆగస్టు 26న ప్రపంచ వ్యాప్తంగా Liger గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
అయితే, ఈ బాలీవుడ్ బ్యూటీ తాజాగా తెలుగు సినిమా అయిన ‘లైగర్’ను గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ షూటింగ్ సమయంలో తను ఎంత స్వేచ్ఛగా, ఎలాంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో పనిచేయగలిగిందో తెలియజేసింది. ఇందుకు యూఎస్ లోని నెవాడా స్టేట్ లో దిగిన త్రో బ్యాక్ పిక్స్ ను తన అభిమానులతో పంచుకుంది.
తనకు నచ్చిన ఫూడ్ తింటూ, మినీ డ్రెస్ లో అందంగా రెడీ అయ్యి మిర్రర్ సెల్ఫీ తీసుకుంటూ, కారు డ్రైవ్ చేస్తూ, బ్యూటీఫుల్ లోకేషన్స్ లో స్పెండ్ చేసిన పిక్స్ ను షేర్ చేసింది. అలాగే నైట్ షూట్ లోనూ కండ్లు ఎర్రబడినా వర్క్ చేసినట్టుగా తెలిపే క్లోజప్ పిక్ నూ పంచుకుంది.
ఈ పిక్స్ షేర్ చేస్తూ కాస్తా ఎమోషనల్ గా క్యాప్షన్ ఇచ్చింది. ‘నెవాడాలో ఇలాంటి ఫీలింగ్ ను ఎప్పటికీ పొందలేను. లైగర్ మూవీ షూటింగ్ నాకు బెస్ట్ టైమ్ అనుభూతిని కలిగించింది.’ అని పేర్కొంది. రెడ్ హార్ట్ ఎమోజీలతో తెలుగు సినిమాలో పనిచేయడం పట్ల తన ఫీలింగ్ ను బయటపెట్టింది.
అయితే బాలీవుడ్ లో ఇప్పటికే అనన్య పాండే నాలుగు చిత్రాల్లో నటించింది. కానీ ఎప్పుడూ ఏ చిత్రానికి సంబంధించిన షూటింగ్ గురించి మాట్లాడలేదు. తొలిసారిగా ‘లైగర్’ షూటింగ్ సమయాన్ని గుర్తు చేసుకోవడం పట్ల తెలుగు అభిమానులు సంతోషిస్తున్నారు.