- Home
- Entertainment
- రష్మిక వదులుకున్న భారీ చిత్రాలు ఏమిటో తెలుసా? ఏం జడ్జి చేసింది రా బాబు, అన్నీ అట్టర్ ప్లాప్!
రష్మిక వదులుకున్న భారీ చిత్రాలు ఏమిటో తెలుసా? ఏం జడ్జి చేసింది రా బాబు, అన్నీ అట్టర్ ప్లాప్!
స్టార్ లేడీ రష్మిక మందాన టాలీవుడ్ లో అడుగుపెట్టాక పట్టిందంతా బంగారమే. వరుస హిట్స్ తో టాప్ రేంజ్ కి వెళ్ళింది. అయితే ఆమె కొన్ని భారీ చిత్రాలను రిజెక్ట్ చేశారని టాక్.

చిత్ర పరిశ్రమలో మన ఫేట్ సక్సెస్ డిసైడ్ చేస్తుంది. సక్సెస్ కేవలం లక్ పై ఆధారపడి ఉంటుందనేది అపోహ మాత్రమే. స్క్రిప్ట్ సెలక్షన్ తెలియకపోతే పరిశ్రమలో నిలబడడం కష్టమే. మనం ఎంచుకునే కథలు సక్సెస్ ఫెయిల్యూర్స్ నిర్ణయిస్తారు. ఆ విషయంలో ఓ అడుగు ముందున్న రష్మిక మందాన టాప్ రేంజ్ కి వెళ్ళింది. ఈ స్టార్ లేడీ కొన్ని భారీ చిత్రాలను రిజెక్ట్ చేయడం విశేషం. అవి చేస్తే కెరీర్ ఢమాల్ అయ్యేది... రష్మిక రిజెక్ట్ చేసిన చిత్రాలేమిటో చూద్దాం...
ఆర్ ఎక్స్ 100 సక్సెస్ తో అజయ్ భూపతి రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. బాగా గ్యాప్ తీసుకుని ఈ దర్శకుడు చేసిన మహా సముద్రం ఆడలేదు. ఈ సినిమాను రష్మిక రిజెక్ట్ చేసినట్లు సమాచారం. సమంత కూడా ఈ ప్రాజెక్ట్ వదులుకుంది.
నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ కమర్షియల్ గా ఆడలేదు. మూవీ క్రెడిట్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, నాని కొట్టేశారు. ఈ మూవీని రష్మిక రిజెక్ట్ చేశారట.
ఆచార్య 2022 డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. చిరంజీవి-రామ్ చరణ్ ల ఈ మల్టీస్టారర్ దారుణ పరాజయం చవి చూసింది. దర్శకుడు కొరటాలకు ఫస్ట్ ప్లాప్ ఇచ్చింది. ఈ మూవీ హీరోయిన్ గా రష్మికను అనుకుంటే చేయను అన్నారట.
దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన మాస్టర్ తెలుగులో ప్లాప్. తమిళంలో విజయ్ మేనియాతో ఆడింది. ఈ చిత్రంలో హీరోయిన్ కి ఏమాత్రం ప్రాధాన్యత ఉండదు. రష్మికను సంప్రదిస్తే చేయను అన్నారట.
ఇక విజయ్ ఈ మధ్యకాలంలో నటించిన చిత్రాల్లో బీస్ట్ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని రష్మిక రిజెక్ట్ చేయడంతో పూజా హెగ్డేను తీసుకున్నారట.
నాని కెరీర్లో డిజాస్టర్ గా నిలిచింది అంటే సుందరానికీ. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో రష్మికను అనుకున్నారట. కారణం తెలియదు కానీ ఆమె చేయను అన్నారట.
2022 సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. పెద్ద పండుగ కావడంతో పాటు పోటీ లేకపోవడంతో బంగార్రాజు హిట్ ఖాతాలో చేరింది. ఈ మూవీకి రష్మికను అనుకుంటే చేయను అన్నారని వినికిడి.
ఇక రష్మిక రిజెక్ట్ చేసిన చిత్రాల్లో శంకర్-రామ్ చరణ్ ల గేమ్ ఛేంజర్, సంజయ్ లీలా భన్సాలీ చిత్రాలు ఉన్నాయని సమాచారం. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్స్ ని రష్మిక ఎందుకు చేయనున్నారో తెలియాల్సి ఉంది.