- Home
- Entertainment
- Kaikala Satyanaryana: కైకాల సత్యనారాయణ చివరి కోరిక అదే... తీరకుండానే కన్నుమూసిన లెజెండ్!
Kaikala Satyanaryana: కైకాల సత్యనారాయణ చివరి కోరిక అదే... తీరకుండానే కన్నుమూసిన లెజెండ్!
దాదాపు ఎనిమిది వందల చిత్రాల్లో నటించిన కైకాల సత్యనారాయణకు ఒక కోరిక ఉందట. అది తీరకుండానే ఆయన కన్నుమూశారు. గతంలో ఆయన చేసిన కామెంట్స్ అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

70-80వ దశకంలో సత్యనారాయణ(Kaikala Satyanaryana) సీరియస్ విలన్ రోల్స్ చేశారు. పౌరాణిక చిత్రాల్లో తన ఆహార్యానికి తగిన భీముడు పాత్రలు చేశారు. యముడు పాత్రలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. వెండితెర యముడంటే కైకాల సత్యనారాయణే. యమగోల మూవీలో మొదటిసారి కైకాల ఆ పాత్ర చేశారు.
అనంతరం యముడికి మొగుడు, యమలీల ఇలా పలు హిట్ చిత్రాల్లో నటించారు. 2012లో విడుదలైన దరువు చిత్రంలో చివరిగా ఆయన యముడు పాత్ర చేశారు. ఇక మాయాబజార్ మూవీలో ఎస్వీఆర్ చేసిన ఐకానిక్ రోల్ ఘటోత్కచుడు గా కూడా నటించే అదృష్టం కైకాల సత్యనారాయణకు దక్కింది. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఘటోత్కచుడు చిత్రంలో కైకాల ఆ పాత్ర చేశారు.
60 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కైకాల చేయని పాత్ర లేదు, వేయని వేషం లేదు. హీరో, విలన్, కమెడియన్, క్యారెక్టర్ రోల్స్... అన్ని పార్శ్వాలు ఉన్న పాత్రలు చేసి విలక్షణ నటుడన్న పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ లెజెండరీ యాక్టర్ ఒక కాంబినేషన్ కోరుకున్నారట. అది సాకారమైతే ఆ చిత్రంలో నటించాలి అనుకున్నారట.
వి. రామచంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ దేవుడు చేసిన మనుషులు. ఎన్టీఆర్-కృష్ణ హీరోలుగా నటించారు. ఈ మూవీలో జగ్గయ్య, సత్యనారాయణ కీలక రోల్స్ చేశారు. 1973లో విడుదలైన దేవుడు చేసిన మనుషులు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాత జనరేషన్ లో టాప్ స్టార్స్ గా అవతరించిన చిరంజీవి-బాలకృష్ణ కలిసి మల్టీస్టారర్ చేస్తే చూడాలి, ఆ చిత్రంలో నటించాలని కైకాల ఆశపడ్డారట. అయితే ఆయన కోరిక తీరలేదు. కొందరు ప్రయత్నం చేసినా ఈ కాంబో సెట్ కాలేదు. అయితే ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి నటించడాన్ని ఆయన ఆస్వాదించారట. ఆర్ ఆర్ ఆర్ మూవీ చూసి చాలా సంతోషం వ్యక్తం చేశారట.