- Home
- Entertainment
- నేను పడ్డ కష్టాలు వాళ్లకు ఉండవు... నెపోటిజంపై దేవరకొండ ఇలా స్పందిస్తాడని ఊహించలేదు!
నేను పడ్డ కష్టాలు వాళ్లకు ఉండవు... నెపోటిజంపై దేవరకొండ ఇలా స్పందిస్తాడని ఊహించలేదు!
చిత్ర పరిశ్రమలో నెపోటిజం ఎప్పటి నుండో చర్చనీయాంశం. హీరోల వారసులకు మాత్రమే ఎదిగే అవకాశం ఉంటుందని, మిగతా వారిని కావాలని తొక్కేస్తారనే వాదన ఉంది. ఇక స్వశక్తితో స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ నెపోటిజం పై తన అభిప్రాయం వెల్లడించారు.

Vijay Devarakonda
లైగర్(Liger) ట్రైలర్ విడుదల వేడుకలో విజయ్ దేవరకొండ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. నా అయ్య ఎవడో తెలియదు, మా తాత ఎవడో తెలియదు, ఎవ్వడూ తెలియదు... మీరు మాత్రం నన్ను ఇంతలా అభిమానిస్తున్నారు. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ఒకింత వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ లేని విజయ్ దేవరకొండ స్టార్ కిడ్స్, స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ ఈ కామెంట్స్ చేశారన్న వాదన తెరపైకి వచ్చింది.
స్వశక్తితో హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ ఎన్టీఆర్(NTR), మహేష్, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వంటి స్టార్స్ ని విమర్శించినట్లు ఆ కామెంట్స్ ఉన్నాయి. విజయ్ దేవరకొండ కామెంట్స్ కి బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చాడు . పరిశ్రమలో తాతలు, తండ్రులు ఉంటే సరిపోదు... టాలెంట్ లేకుండా ఎవరూ స్టార్స్ కాలేరు బ్రదర్ అంటూ బండ్ల ట్వీట్ చేశాడు. విజయ్ పేరు పొందుపరచుకున్నా ఈ ట్వీట్ విజయ్ దేవరకొండ గురించే అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Vijay Devarakonda
కాగా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోస్ట్ కరణ్ జోహార్... నెపోటిజం పై తన అభిప్రాయం తెలియజేయాలని కోరారు. దానికి విజయ్ దేవరకొండ డిప్లొమాటిక్ సమాధానం చెప్పాడు. మన పుట్టుకను మనం నిర్ణయించుకోలేము. అలాగే అందరూ ఒకే ఆర్ధిక స్థోమత, అందం, హైట్, వెయిట్ కలిగి ఉండరు. ఇప్పుడు స్టార్స్ వారసులుగా పుట్టినవారెవరు అనుకొని స్టార్ కిడ్స్ కాలేదు.
మనం ఎవరికి పుట్టాలో మన చేతిలో లేదు. రేపు నాకు పిల్లలు పుడితే వాళ్ళు స్టార్ కిడ్ అవుతారు. మనం ఎవరైనా కానీ మన లక్ష్యం కోసం పోరాడాలి. సాధించాడనికి కృషి చేయాలి. స్టార్ కిడ్ గా పుట్టడం వలన కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. మంచి స్టార్ట్ దొరుకుతుంది. నేను పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న ఒడిదుడుకులు, అవమానాలు హీరోగా ఎదగడానికి కారణమయ్యాయి అని విజయ్ దేవరకొండ అభిప్రాయ పడ్డారు. మొత్తంగా నెపోటిజంకి తాను వ్యతిరేకం కాదని విజయ్ పరోక్షంగా తెలియజేశారు.
కాఫీ విత్ కరణ్ షోలో విజయ్ దేవరకొండ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కెరీర్ బిగినింగ్ లో విజయ్ దేవరకొండ ప్రాధాన్యం లేని చిన్న చిన్న పాత్రలు చేశాడు. హీరోగా పెళ్లి చూపులు మూవీ ఆయనకు బ్రేక్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి మూవీతో భారీ ఇమేజ్ దక్కింది. గీత గోవిందం మూవీ విజయ్ కి స్టార్ హోదా తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్, జనగణమన వంటి భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. లైగర్ విజయం సాధిస్తే దేవరకొండ కెరీర్ మరో మలుపు తిరిగినట్లే. విజయ్ దేవరకొండ నటించిన గత రెండు చిత్రాలు డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. లైగర్ విజయం విజయ్ కి చాలా కీలకం.