- Home
- Entertainment
- ఒక్క సినిమాతో తిరుగలేని స్టార్‌డమ్.. ఏకంగా స్టార్ హీరోలతో ఛాన్స్‌లు.. ఆ హీరోయిన్ ఎవరంటే.?
ఒక్క సినిమాతో తిరుగలేని స్టార్‌డమ్.. ఏకంగా స్టార్ హీరోలతో ఛాన్స్‌లు.. ఆ హీరోయిన్ ఎవరంటే.?
Heroine: సినీ ఇండస్ట్రీలో అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోతుంటారు కొందరు హీరోయిన్స్. ఆ కోవకు చెందిన నటి ఆమె కూడా. ఒక్క సినిమాతో తిరుగులేని స్టార్ డమ్ దక్కించుకుంది. ఇలా..

ఒక్క చిత్రంతో తిరుగులేని ఫేం..
అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించింది బాలీవుడ్ నటి నికితా దత్తా. బుల్లితెర నుంచి ఓటీటీకి.. అక్కడ నుంచి సినిమాల్లోకి వచ్చి హీరోయిన్‌గా సెటిల్ అయింది ఈ బ్యూటీ. షాహిద్ కపూర్ హీరోగా వచ్చిన ఓ చిత్రంతో తిరుగులేని ఫాం దక్కించుకుంది.
ఇంటర్నెట్‌లో సెన్సేషన్..
అర్జున్ రెడ్డి రీమేక్‌గా వచ్చిన 'కబీర్ సింగ్' సినిమాతో మంచి ఫాం దక్కించుకుంది నికితా దత్తా. అప్పటిదాకా తాను అంటే ఎవరికీ తెలియదు. ఆ సినిమాలో చేసిన క్యారెక్టర్‌తో ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. ముందుగా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసిన ఈ భామ.. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.
'లేకర్ హమ్ దీవానా దిల్' సినిమాతో అరంగేట్రం..
నికితా దత్తా తొలి చిత్రం 'లేకర్ హమ్ దీవానా దిల్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత్ అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన 'గోల్డ్' సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఇక 'లస్ట్ స్టోరీస్' మూవీలో బోల్డ్ రోల్ చేసి అందరిని తన నటనతో మెప్పించింది.
కబీర్ సింగ్ చిత్రంతో ఫేం..
డ్రీమ్ గర్ల్(2015), ఏక్ దుజే కే వాస్తే(2016), హాసిల్(2017) వంటి షోలతో టెలివిజన్‌లో తనదైన ముద్ర వేసుకుని.. కబీర్ సింగ్ చిత్రంతో వెండితెరపై ఫాం దక్కించుకుంది. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించగా.. షాహిద్ కపూర్ హీరోగా నటించాడు.
సైఫ్ సరసన ఓటీటీ సినిమాలో..
మొన్నీమధ్య సైఫ్ అలీఖాన్ సరసన 'జెవెల్ థీఫ్' అనే చిత్రంలో నటించింది. అలాగే 'ఘరత్ గణపతి' చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం సినిమాలతో పాటు ఓటీటీలలోనూ వరుస ఆఫర్స్ దక్కించుకుంటోంది నికితా దత్తా.