ఈ వారం హవా అంతా ఓటీటీలదే.. సందడంతా శుక్రవారమే..
ఈ వారంలో ధియేటర్ల రిలీజ్ హడావిడి లేకుండా ఓటీటీలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.తమ ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యడానికి ప్రతి శుక్రవారం క్రేజీ మూవీస్ ని థియేటర్స్ కు పోటీగా బయటకు వదులుతున్నారు.మరి ఈవారం ఓటీటీ ల్లో రిలీజ్ అవుతున్న ఇంట్రస్టింగ్ మూవీస్ ఏంటో చూసేద్దాం.

ప్రతీ వారంలా.. ఈ వారం కూడా క్రేజీ సినిమాలఅనౌనస్ మెంట్ తో అప్పుడే డేట్స్ లాక్ చేసేసుకున్నాయి. ఫిబ్రవరి 4 న ధియేటర్లో పెద్దసినిమాలు లేకపోయినా.. ఓటీటీల్లో మాత్రం హాలీవుడ్... బాలీవుడ్ సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఇక థియేటర్లలో స్వర, శ్రీకాంత్ కోతలరాయుడు, విశాల్ సామాన్యుడు లాంటి కొన్ని సినిమాలు మాత్రమే రిలీజ్ కు ఉన్నాయి. సందడంతా ఓటీటీలోనే ఉంది.
ఈ వీకెండ్ సందడిఅంతా ఓటీటీ లదే .ముఖ్యంగా ఈ నాలుగో తారీకున బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో ఇంట్రస్టింగ్ మూవీస్ ఓటీటీలలో హడావిడి చేయబోతున్నాయి. ఓటీటీ రిలీజ్ అయినా.. ఆడియన్స్లో గట్టిగా హైప్ క్రియేట్ చేస్తోంది తాప్సీ లూప్ లపేటా మూవీ. తాప్సీ, తాహిర్ బన్ లీడ్ రోల్స్లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ జర్మన్ కల్ట్ క్లాసిక్ రన్ లోలా రన్ అనే మూవీకి రీమేక్గా వస్తోంది. ఆకాష్ భాటియా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 4న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతోంది.
సస్పెన్స్ , థ్రిల్లింగ్ డ్రామాను బాగా ఇష్టపడే ఫాన్స్ కోసం రిలీజ్ కు రెడీ అవుతుంది. ద గ్రేట్ఇండియన్ మర్డర్ మూవీ. ఈ సినిమాను డిస్నీ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 4నే రిలీజ్ చేస్తున్నారు. స్లమ్ డాగ్ మిలియనీర్ నోవెల్ రాసిన వికాస్మరో బెస్ట్ సెల్లింగ్ బుక్ ద సిక్స్ సస్పెక్ట్స్ఆధారంగా ద గ్రేట్ ఇండియన్ మర్డర్ మూవీని టిగ్ మాన్షు తెరకెక్కించారు. ప్రతీక్గాంధీ, రిచాచడ్డా అషుతోష్, రఘుబీర్ లాంటి స్టార్ట్ కాస్ట్ తో ఈ మిస్టరీ థ్రిల్లర్ ఈ ఫ్రైడే సందడి చేయబోతుంది.
లెజండరీ సైంటిస్ట్స్ డాక్టర్హోమి బాబా, విక్రమ్ సారా భాయ్ లైఫ్ హిస్టరీ ఆధారంగా తెరకెక్కిన సినిమా రాకెట్ బాయ్స్ . జిమ్ , షాక్ లీడ్ రోల్స్ లో అభయ్ పన్ను డైరెక్ట్ చేసిన గ్రేట్ ఎంటర్ టైనర్ రాకెట్బాయ్స్ . ఎంటర్ టైనింగ్ గా ఎంగేజింగ్ గా వస్తున్న ఈ సీరియస్ సబ్జెక్ట్ ఫిబ్రవరి 4న సోనీ లివ్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్అవుతోంది.
హాలీవుడ్ నుంచి ఓటీటీ ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యబోతోందిమరో సినిమా. స్పానిష్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో జూలియో పెనా, క్లారాగల్లే లీడ్ రోల్స్ ప్లే చేసిన సినిమా త్రు ద విండో. తను ఇష్టపడుతున్న పక్కింటిఅబ్బాయిని కిటికీ నుంచిచూస్తూ రోజూ సీక్రెట్ గా చూస్తూ ఉంటున్న ఓఅమ్మాయి స్టోరీయే త్రూద విండో. ఈ సినిమా ఫిబ్రవరి 4న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ కాబోతోంది.