MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • శోభన్ బాబు ఆస్తిలో సగభాగం అడిగిన స్టార్ డైరెక్టర్... కారణం తెలిస్తే షాక్ అవుతారు!

శోభన్ బాబు ఆస్తిలో సగభాగం అడిగిన స్టార్ డైరెక్టర్... కారణం తెలిస్తే షాక్ అవుతారు!

శోభన్ బాబు టాలీవుడ్ లో అత్యంత ఆస్తిపరుడు. ఆయన సంపాదించిన ఆస్తి ప్రస్తుత విలువ వేల కోట్లు. కాగా ఓ డైరెక్టర్ ఆయన్ని సగం ఆస్తి అడిగాడట. అందుకు కారణం ఆ డైరెక్టర్ కి శోభన్ బాబు పోలికలు ఉండటమే. అప్పుడు శోభన్ బాబు ఏం చేశారంటే..  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jun 30 2024, 09:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sobhan Babu

Sobhan Babu

శోభన్ బాబు పరిశ్రమలో క్రమశిక్షణ గల నటుడు. హీరోగా సుదీర్ఘ కాలం పరిశ్రమలో కొనసాగాడు. సంపాదించిన ప్రతి రూపాయి పెట్టుబడిగా మార్చాడు. శోభన్ బాబు తోటి నటులకు ఆర్థిక విషయాల్లో సలహాలు ఇచ్చేవాడట. భూమి మీద పెట్టుబడి పెడితే వందల రెట్లు లాభం వస్తుందని చెప్పేవాడట. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Sobhan Babu

Sobhan Babu

శోభన్ బాబు వద్దంటున్నా కొన్ని స్థలాలు అమ్మి వందల కోట్లు నష్టపోయానని నటుడు చంద్ర మోహన్ గతంలో అన్నారు. శోభన్ బాబు మాటలు విని లాభాలు పొందిన నటులు కూడా ఉన్నారు. శోభన్ బాబు డబ్బు విషయంలో అంత నిక్కచ్చిగా ఉండేవారట. 
 

36

తన కొడుకును సినిమా రంగం వైపు ఆయన తీసుకు రాలేదు. శోభన్ బాబు కుటుంబం గురించి తెలిసింది తక్కువే. ఆయన కుమారుడు వ్యాపారవేత్తగా రాణిస్తున్నాడు. చెన్నైలో రియల్ ఎస్టేట్ తో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నారు. కాగా ఓ స్టార్ డైరెక్టర్ శోభన్ బాబును సగం ఆస్తి అడిగాడట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు ఏ కోదండరామిరెడ్డి. 
 

46

80-90లలో ఏ కోదండరామిరెడ్డి స్టార్ డైరెక్టర్. ఆయన్ని అందరూ మీరు శోభన్ బాబులా ఉంటారు అనేవారట. శోభన్ బాబుతో కోదండరామిరెడ్డికి అనుభవం ఉంది. వీరి కాంబోలో ప్రేమ మూర్తులు, ఇద్దరూ ఇద్దరే, బావ మరదళ్ళు వంటి చిత్రాలు తెరకెక్కాయి. 
 

56
Sobhan Babu

Sobhan Babu

ఓ సందర్భంలో ఏ కొండరామిరెడ్డి... అందరూ నన్ను మీలా ఉన్నాను అంటున్నారు. కాబట్టి మీ ఆస్తిలో సగం నాకు ఇవ్వండి, అన్నాడట. అందుకు శోభన్ బాబు...  తీసుకోరా, కాకపోతే నా ఆస్తులన్నీ పిల్లల పేరిట రాసేశాను. నా కంటూ ఎలాంటి ఆస్తి లేదు అన్నాడట. ఈ విషయాన్ని కోదండరామిరెడ్డి ఓ సందర్భంలో వెల్లడించారు.  
 

66

ఈ సంఘటన శోభన్ బాబుకు ఎంత ఆస్తి ఉందో చెప్పడానికి నిదర్శనం. తనకంటే పెద్ద స్టార్స్ అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వద్ద లేని సంపద, ఆస్తి శోభన్ బాబు సొంతం. అందుకు ఆయన ఆర్థిక క్రమశిక్షణ, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్  కారణం అయ్యాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved