MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుమన్ లాగే చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చిన హీరో, ఒక్కసారిగా డౌన్ ఫాల్..ఫెయిల్యూర్ కి కారణాలు ఇవే

సుమన్ లాగే చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చిన హీరో, ఒక్కసారిగా డౌన్ ఫాల్..ఫెయిల్యూర్ కి కారణాలు ఇవే

చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో ఆయనకి బాగా పోటీ ఇచ్చిన హీరో సుమన్. సుమన్ కి అందగాడు అనే పేరు ఉంది. అదే విధంగా మార్షల్ ఆర్ట్స్ లో సుమన్ కి ప్రావీణ్యం ఉంది.సుమన్ తరహాలో చిరంజీవి కి గట్టి పోటీ ఇచ్చి ఆ తర్వాత డౌన్ అయిన హీరో మరొకరు ఉన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 31 2024, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి కొన్ని దశాబ్దాల పాటు టాలీవుడ్ లో అగ్రస్థానంలో కొనసాగారు. నటన, డ్యాన్సులు, ఫైట్స్ విషయంలో చిరంజీవి స్టైల్ అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. చిరంజీవి సమకాలీకుల్లో ఆయనకి గట్టి పోటీ ఇచ్చిన హీరోలు అంటే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పేర్లు చెప్పొచ్చు. 

26

చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో ఆయనకి బాగా పోటీ ఇచ్చిన హీరో సుమన్. సుమన్ కి అందగాడు అనే పేరు ఉంది. అదే విధంగా మార్షల్ ఆర్ట్స్ లో సుమన్ కి ప్రావీణ్యం ఉంది. మంచి మంచి చిత్రాలతో కెరీర్ జోరందుకుంటున్న టైంలో సుమన్ కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది. అందుకు కారణాలు అందరికి తెలుసు. 

36
actor suman

actor suman

ఒక కేసులో సుమన్ చిక్కుకోవడం వల్ల 6 నెలలు జైలు జీవితం అనుభవించారు. అప్పటి తమిళనాడు సీఎం ఎంజీఆర్ వల్లే సుమన్ జైలుకి వెళ్లారు అనే ప్రచారం ఉంది. ఇదంతా పక్కన పెడితే సుమన్ తరహాలో చిరంజీవి కి గట్టి పోటీ ఇచ్చి ఆ తర్వాత డౌన్ అయిన హీరో మరొకరు ఉన్నారు. 

46

ఆయన ఎవరో కాదు యాంగ్రీ మాన్ రాజశేఖర్. ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ కి ఈ ప్రశ్న ఎదురైంది. ఒక దశలో చిరంజీవికి పోటీ ఇచ్చే హీరోగా ఉన్న మీరు ఎందుకు డౌన్ ఫాల్ అయ్యారు అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి రాజశేఖర్ సమాధానం ఇచ్చారు. చిరంజీవికి పోటీ ఇచ్చే హీరో అని నన్ను అంతా అంకుశం మూవీ టైంలో ప్రశంసించారు. అది నిజమే. 

56

అంకుశం చిత్రం రాజశేఖర్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటి. కానీ ఆ తర్వాత డౌన్ ఫాల్ కావడానికి కారణాలు ఉన్నాయని రాజశేఖర్ అన్నారు. నేను కెరీర్ ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు. ఏ నిర్మాత వచ్చినా, ఏ దర్శకుడు వచ్చినా కథ వినేవాడిని. మంచి కథా కాదా అని మాత్రమే చూశా. వాళ్ళు పెద్ద డైరెక్టర్లా చిన్న డైరెక్టర్లా అనే విషయం పట్టించుకోలేదు. 

66

దానివల్ల కొన్ని మంచి కథలని కూడా కొందరు డైరెక్టర్లు సరిగ్గా తీయలేదు. దీనితో చాలా సినిమాలు పోయాయి అని రాజశేఖర్ అన్నారు. పెద్ద డైరెక్టర్లతోనే సినిమాలు చేసి ఉంటే నేను కూడా టాప్ లో ఉండే వాడిని ఏమో అని రాజశేఖర్ తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajendra Prasad: కాంతారావుని చూస్తే ఎంజీఆర్‌కి వణుకు.. నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ అనుచిత వ్యాఖ్యలు
Recommended image2
100 ఎకరాల పొలం, వంట కూడా రావాలి.. కాబోయే భర్తపై రవితేజ హీరోయిన్ కండిషన్స్
Recommended image3
Ustaad Bhagat Singh Censor Review: ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సెన్సార్‌ రివ్యూ.. పవన్‌ సినిమాని ఎవరు చూడొచ్చు, నిడివి ఎంత అంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved