- Home
- Entertainment
- `సలార్`లో ఇవే హైలైట్.. కనెక్ట్ అయ్యాయా బాక్సాఫీసు వద్ద ఊచకోతే.. ఇక `బాహుబలి`నే టార్గెట్ ?
`సలార్`లో ఇవే హైలైట్.. కనెక్ట్ అయ్యాయా బాక్సాఫీసు వద్ద ఊచకోతే.. ఇక `బాహుబలి`నే టార్గెట్ ?
`సలార్` మూవీ తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. గూస్ బంమ్స్ తెప్పిస్తుంది. అయితే ఇందులో పలు అంశాలు హైలైట్‌గా ఉండబోతున్నాయట. అవి వర్క్ అయితే బాక్సాఫీసు వద్ద ఊచకోత తప్పదంటున్నారు.

`సలార్` సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్ కి అసంతృప్తులే ఎక్కువగా ఎదురయ్యాయి. గ్లింప్స్ లో ఆయన్ని చూపించకపోవడంతో చాలా డిజప్పాయింట్ అయ్యారు. కానీ దాన్ని ఆదరించారు. ఇటీవల వచ్చిన ట్రైలర్ చూసి బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు, సినిమా ప్రియులుసైతం ప్రభాస్ ఇలా ఉన్నాడేంటి? డైలాగులేంటి ఇలా ఉన్నాయి? ఆయన ఎక్కువగా కనిపించలేదనే ఫీలింగ్ కలిగింది. దీనిపై చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆ సెగ చిత్ర బృందానికి తగిలింది. దీంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ దిగొచ్చాడు.
తాజాగా `సలార్` రిలీజ్ ట్రైలర్ ని విడుదల చేశారు. ప్రభాస్ ఎలివేషన్లు, భారీ యాక్షన్ సీన్లతో ఈ ట్రైలర్ సాగింది. `కేజీఎఫ్` అంటే దాన్ని మించి ఇందులో యాక్షన్ సీన్లు ఉన్నాయి. ఒక్క మిషన్ గన్ కాదు, పదుల సంఖ్యలో ఉన్నాయి. అవన్నీ ఒకేసారి ప్రయోగిస్తే ప్రత్యర్థులు చిత్తు చిత్తు కావడమే, ఇక తనకు ఎదురొచ్చాడని ఒకడు ప్రభాస్ ముందు ఓవర్ చేస్తే, సింపుల్‌గా గన్ ఎక్కుపెట్టే లారీనే లేపేశాడు. అంతటి క్రూరంగా ప్రభాస్ పాత్రని చూపించారు.
అంతేకాదు స్నేహం కోసం ఎంతటి సాహసానికైనా తెగించే యోధుడిలా ఇందులో ప్రభాస్ పాత్రని చూపించాడు ప్రశాంత్ నీల్. అతనికి ఎదురే లేదని, అతని ముందు బలమైన సైన్యం కూడా దిగదుడుపే అనే విషయాన్ని స్పష్టం చేశాడు. స్నేహం కోసం ఏదైనా చేస్తాడని, ఏమైనా తెచ్చిస్తాడని, వద్దు అంటే దేన్నీ మిగిల్చడని చెప్పించిన తీరు ప్రభాస్ పాత్ర ఎంతటి పవర్‌ఫుల్‌గా ఉంటుందో తెలియజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అతని పాత్ర ముందు హీరో అనేది చాలా తక్కువైపోతుందని, డైనోసార్ అనేది కరెక్ట్ అనిపించేలా చేశాడు.
`సలార్` సినిమాలో ప్రధానంగా ప్రభాస్ పాత్ర ఎంతటి పవర్‌ఫుల్‌గా ఉంటుందో చూపించాడు ప్రశాంత్. ఆయనకు ఎదురు నిలబడే వాడే లేడని, సలార్ వచ్చాడంటే సామ్రాజ్యాలు అంతం కావడం ఖాయమనేలా ఇందులో ఆవిష్కరించారు. అయితే ప్రశాంత్ నీల్ ఈ ట్రైలర్ ద్వారా, ఇప్పటి వరకు ఆయన చెప్పిన విషయాల ద్వారా కొన్ని మెయిన్ అంశాలు హైలైట్‌గా నిలుస్తున్నాయి. వాటిపైనే ఈ సినిమా నడుస్తుందని, ఈ సినిమాకి ఆయువు పట్టు అని తెలుస్తుంది.
`కేజీఎఫ్`ని మించిన యాక్షన్ ఎపిసోడ్లని ఇందులో మేళశించాడట ప్రశాంత్ నీల్. ప్రభాస్ లాంటి కటౌట్ రంగంలోకి దిగితే ఏ రేంజ్ యాక్షన్ ఉంటుందో ఆ రేంజ్‌లో డిజైన్ చేశాడట. అందుకు తాజా ట్రైలరే ఉదాహరణగా చెప్పొచ్చు. దీనిలో భారీ యాక్షన్ సీన్లకి కొదవ లేదు. దీనికితోడు సరికొత్త మెషిన్ గన్‌లను వాడబోతున్నారు. `కేజీఎఫ్`లో వాడిన గన్ కి మించినవి, అలాగే పదుల సంఖ్యలో వాటిని వాడటం, అలాగే వాహనాల సైజ్ చూస్తుంటేనే పోరాట సన్నివేశాలు గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉండబోతున్నాయని తెలుస్తుంది.
దీంతోపాటు స్నేహానికి పెద్ద పీట వేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఏ సినిమాకైనా, ఎంతటి యాక్షన్ ఉన్నా, దాన్ని నడిపించే ఎమోషన్ చాలా ముఖ్యం. ఈ సినిమాకి `స్నేహం` ఆ ఎమోషన్ అని తెలుస్తుంది.ఈ మూవీ ఫ్రెండ్‌షిప్ పై సాగుతుందని దర్శకుడు తెలిపారు. తాజాగా ట్రైలర్లలో చూపించారు. విడుదల చేసిన `సూరీడే` పాటలోనూ చూపించారు. ఆ స్నేహం అనే ఎమోషన్ బలంగా ఉంటుందని, చివరికి ప్రాణ స్నేహితులు బద్ద శత్రువులుగా మారిన వైనం, బలమైన స్నేహితులు, శత్రువులుగా మారి ఢీ కొనే సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంటాయని తెలుస్తుంది.
స్నేహంతోపాటు మదర్ సెంటిమెంట్ కూడా అంతర్లీనంగా ఉండబోతుందట. ఇందులోనూ కొంత మదర్ సెంటిమెంట్‌ని చూపించబోతున్నాడని తెలుస్తుంది. అయితే అదొక చిన్న లేయర్‌గా ఉంటుంది, కానీ మెయిన్ కాదని తెలుస్తుంది.
ఖాన్‌సార్‌లోని జనాల పరిస్థితి, వారి అవస్తలను కూడా ఇందులో చూపిస్తారట. వారి దీన స్థితులు కూడా ఎమోషనల్‌గా కనెక్ట్ చేయబోతున్నాడట ప్రశాంత్ నీల్. ప్రధానంగా ఈ ఎమోషన్స్ ని నమ్ముకుని దర్శకుడు `సలార్`ని రూపొందించాడని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో స్నేహం పీక్‌లో చూపించి, శత్రువులుగా మారిన విషయాలను టచ్ చేసి వదిలేస్తారట. అదంతా రెండో భాగంలో ఉండబోతుందని సమాచారం.
ఇక ప్రశాంత్ నీల్ టేకింగ్‌కి, ప్రభాస్ లాంటి భారీ కటౌట్ చేసే యాక్షన్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బన్సూర్ బీజీఎం తోడు కావడంతో ఈ సినిమా నెక్ట్స్ లెవల్‌లో ఉండబోతుందని తెలుస్తుంది. సినిమా చాలా బాగా వచ్చిందని, కాకపోతే అది ఆడియెన్స్ కి ఎలా కనెక్ట్ అవుతుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒక వేళ ఈ సెంటిమెంట్లు, యాక్షన్ ఆడియెన్స్ కి ఎక్కిందా? ఇక `సలార్`ని ఆపడం ఎవరితరం కాదంటున్నారు పండితులు. బాక్సాఫీసు వద్ద ఊచకోత తప్పదని, టార్గెట్ `బాహుబలి`రికార్డులే కాబోతున్నాయని అంటున్నారు. మరి నిజంగానే ఆ స్థాయికి రీచ్ అవుతుందా? ఆ రేంజ్‌లో ఉంటుందా? అనేది చూడాలి.
అయితే యష్ లాంటి అప్‌కమింగ్ హీరోతో చేసిన `కేజీఎఫ్` మూవీ వెయ్యి కోట్లు వసూలు చేసింది. అలాంటిది `బాహుబలి`తో ఇండియన్ రికార్డులు షేక్ చేశాడు ప్రభాస్. అంతర్జాతీయంగానూ మంచి మార్కెట్ ఏర్పర్చుకున్నారు. ఆ తర్వాత సరైన సినిమా పడక ఫ్యాన్స్, సినీ ప్రియులు ఆయన మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు.
`సలార్`పై ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. సినిమా హిట్ అయితే మాత్రం దాన్ని ఎక్కడికో తీసుకెళ్తారని, అది `బాహుబలి` రికార్డులను బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. మరి అదిసాధ్యం అవుతుందా అనేది చూడాలి. ఈ మూవీ ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుంది.