- Home
- Entertainment
- తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే ఏడాది 2023.. ఓ వైపు ఆస్కార్, మరోవైపు నేషనల్ అవార్డు..
తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే ఏడాది 2023.. ఓ వైపు ఆస్కార్, మరోవైపు నేషనల్ అవార్డు..
తెలుగు చిత్ర పరిశ్రమ ఈ ఏడాది ఎప్పటికీ నిలిచిపోతుంది. ప్రధానంగా రెండు విషయాలు ఎప్పటికీ మర్చిపోలేనివి చోటు చేసుకున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమని ప్రపంచ పటంలో నిలబెట్టే సంఘటనలు చోటు చేసుకున్నాయి.

ఆస్కార్ అవార్డు అనేది ప్రపంచ సినీ మేకర్స్ కి ఓ డ్రీమ్. దాన్ని సాధిస్తే ఇక చాలు అనుకునే వాళ్లు ఉంటారు. కానీ ఆస్కార్ అవార్డు ఇండియన్స్ తో దోబూచులాడుతుంది. భారతీయ సినిమాలకు ఒక కలగానే మిగిలిపోయింది. భారతీయులకు ఇతర దేశాల నుంచి ఆస్కార్ అవార్డు వచ్చింది. కానీ ఇండియన్ సినిమాలకు మాత్రం అవార్డు రాలేదు.
దాన్ని సాధ్యం చేసి పెట్టాడు రాజమౌళి. తాను రూపొందించిన `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంలో దాన్ని సాధించాడు. ఈ మూవీలోని `నాటు నాటు` పాటకి ఆస్కార్ అవార్డు అవార్డు వరించిన విషయం తెలిసిందే. పాట రాసిన లిరిక్ రైటర్ చంద్రబోస్, మ్యూజిక్ కంపోజ్ చేసిన ఎంఎం కీరవాణికి ఈ ఆస్కార్ అవార్డు దక్కింది. ఇండియన్ గర్వపడేలా చేసింది.
ఈ ఆస్కార్ రావడంలో రాజమౌళి టీమ్ చేసిన కృషి మామూలు కాదు, దీనికోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. తనే పూర్తి బాధ్యత తీసుకుని, హాలీవుడ్‌లో ప్రమోషన్ చేశారు. ఆస్కార్ కమిటీకి `ఆర్‌ఆర్‌ఆర్`ని దగ్గర చేశారు. దీంతోపాటు `నాటునాటు` పాటని ప్రపంచ ఆడియెన్స్ కి దగ్గరయ్యేలా చేశారు. దీంతో అదే సినిమాని ప్రమోట్ చేసింది. ఆస్కార్ రావడంలో ఆ పాట కీలక భూమిక పోషించింది. ఆస్కార్ కల సాధ్యమైంది ఈ ఏడాది కావున, ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఒక మైలు రాయిగా నిలుస్తుంది.
అంతేకాదు ఈ ఏడాదికి మరో ప్రత్యేకత ఉంది. వందేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఇప్పటి వరకు తెలుగు యాక్టర్స్ కి జాతీయ అవార్డు రాలేదు. ఆ అవార్డుని సాధించి పెట్టాడు అల్లు అర్జున్. ఆయనకు `పుష్ప` చిత్రంలోని నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని అందుకున్నారు.
Rrr -Pushpa 2
తెలుగులో ఎంతో మంది గొప్ప నటులు ఉన్నారు. కానీ ఎవరికీ సాధ్యం కాలేదు. ఇతర విభాగాల్లో జాతీయ అవార్డులు వచ్చాయి. కానీ నటుడిగా బెస్ట్ యాక్టర్‌గా జాతీయ అవార్డు రాలేదు. ఓ కలగా ఉన్న నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టాడు బన్నీ. సుకుమార్ రూపొందించిన `పుష్ప` పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో ఎర్రచందనం స్మగ్లర్‌గా బన్నీ నటించాడు. పుష్పరాజ్‌గా అదరగొట్టాడు. ఆయన `పుష్ప తగ్గేదెలే` అనే మేనరిజం అంతర్జాతీయంగానూ పాపులర్ అయ్యింది.
అంతేకాదు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది తెలుగు సినిమాలకు ఏకంగా పది జాతీయ అవార్డులు వరించాయి. అల్లు అర్జున్‌తోపాటు `ఆర్‌ఆర్‌ఆర్`, కొరియోగ్రాఫర్‌గా రక్షిత్ మాస్టర్‌కి, `ఆర్‌ఆర్‌ఆర్` యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా సోలోమన్, స్పెషల్ ఎఫెక్ట్స్ కి శ్రీనివాస్ మోహన్‌కి, ఉత్తమ సంగీత దర్శకులుగా దేవిశ్రీ ప్రసాద్(పుష్ప`, కీరవాణిల(ఆర్‌ఆర్‌ఆర్)కు, ఉత్తమ గాయకుడిగా కాళభైరవ(ఆర్‌ఆర్‌ఆర్), అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా `ఆర్‌ఆర్‌ఆర్`కి, అలాగే లిరిక్ రైటర్‌గా చంద్రబోస్‌కి, తెలుగు ఉత్తమ చిత్రంగా ఉప్పెనకి జాతీయ అవార్డులు దక్కాయి. తెలుగు సినిమా చరిత్రలోనే ఇలా అత్యధిక జాతీయ అవార్డు పొందిన ఏడాది ఇదే కావడం విశేషం. ఇలా అరుదైన ఘనతలు సాధించిన చిత్రంగా 2023 టాలీవుడ్‌కి చాలా స్పెషల్‌గా నిలిచిందని చెప్పొచ్చు.