- Home
- Entertainment
- 2024 Sankranthi Movies : గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ తో పాటు.. సంక్రాంతికి రాబోతున్న సినిమాలివే.!
2024 Sankranthi Movies : గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్ తో పాటు.. సంక్రాంతికి రాబోతున్న సినిమాలివే.!
2024 జనవరిలో సక్రాంతి కానుకగా చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ నెలలో అలరించే మోస్ట్ అవైటెడ్ చిత్రాల గురించి తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ Guntur Kaaram ఈనెలలో విడుదల కాబోతోంది. జనవరి 12 వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.
విక్టరీవెంకటేశ్ (Venkatesh) నుంచి సంక్రాంతి బరిలో ‘సైంధవ్’ (Saindhav) వస్తోంది. శైలేష్ కొలను దీనికి దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా జెరేమియా, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ కీలక పాత్రలో నటించారు. జనవరి 13న మూవీ రిలీజ్ కాబోతోంది.
యంగ్ హీరో తేజా సజ్జా Teja Sajja నటించిన సూపర్ హీరో ఫిల్మ్ ‘హనుమాన్’ HanuMan కూడా ఈనెలలో ఉంది. జనవరి 12నే రాబోతోంది. అదే రోజు మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ కూడా ఉండటం విశేషం. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. అమృత అయ్యర్ హీరోయిన్.
డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ - పరుశురామ్ పెట్ల కాంబోలో వస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ Family Star కూడా సంక్రాంతికే రిలీజ్ ఉంది. కానీ పక్కా డేట్ ను అనౌన్స్ చేయలేదు. ఈనెలలో వస్తుందా? వాయిదా పడుతుందా? అన్నది వేచి చూడాలి.
మాస్ మహారాజా రవితేజ RaviTeja రాబోయే చిత్రం ‘ఈగల్’ Eagle Movie. అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పక్కా డేట్ ఇంకా రాలేదు.
2022 సంక్రాంతికి ‘బంగార్రాజు’తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన అక్కినేని నాగార్జున Akkineni Nagarjuna 2024 సంక్రాంతి బరిలో దిగారు. ‘నా సామిరంగ’ Naa Saami Ranga మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కానీ ఈ మూవీ కూడా ఫైనల్ డేట్ ను చెప్పలేదు.
ఇక నటుడు, బిగ్ బాస్ 7 శివాజీ Sivaji ప్రధాన పాత్రలో నటించిన #90s ఏమిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ కూడా సంక్రాంతికి వారం ముందుగానే రాబోతోంది. ఈటీవీ విన్ వేదికగా జనవరి 5 నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది.
సింగర్ సునిత కొడుకు ఆకాశ్ హీరోగా పరిచయం అవుతూ వచ్చిన చిత్రం ‘సర్కారు నౌకరి’ Sarkaru Naukari) ప్రస్తుతం ఈ చిత్రం విడులైంది. ఈరోజే (జనవరి 1)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంటోంది.