ఒక్క హిట్టు ప్లీజ్‌.. అభిమానులు కనికరిస్తారా?

First Published 16, Aug 2020, 8:35 AM

చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ అన్నింటికి సమాధానం చెబుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోలకు సినిమా విజయం సాధించాల్సిన అవసరం ఉంది. కొత్త వాళ్ళు కొత్త కథలను ఎంపిక చేసుకుంటూ సంచలనాలు సృష్టిస్తూ, పాత్‌ బ్రేక్‌ చిత్రాలతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం దాదాపు ఇరవై మంది హీరోలు విజయాలు లేక తంటాలు పడుతున్నారు. ఒక్క హిట్లు ప్లీజ్‌ అంటూ బ్రతిమాలుకుంటున్నారు. మరి ఈ సారి హిట్‌ వరిస్తుందా? చూడాలి.

చాలా రోజులుగా విజయాలు లేక డీలా పడ్డా హీరోల్లో మొదటి వరుసలో బాలయ్య బాబు నందమూరి బాలకృష్ణ ఉంటారు. నిజం చెప్పాలంటే ఆయనకు `గౌతమిపుత్రశాతకర్ణి` నుంచి సరైన హిట్టు ఒక్కటి కూడా లేదు. మూడేళ్ళుగా విజయాల కోసం ఆరాటపడుతున్నారు. `పైసా వసూల్‌`, `జైసింహా`, `ఎన్టీఆర్‌` బయోపిక్‌, `రూలర్‌` ఇలా అన్నిసినిమాలు పరాజయాలు చవిచూశాయి. `జై సింహా`ని చిత్ర బృందం సక్సెస్‌గా చెప్పుకున్నా.. కమర్షియల్‌గా అది నిర్మాతకి భారీ నష్టాలనే తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తనకు `సింహా`, `లెజెండ్‌` వంటి తిరుగులేని బ్లాక్‌ బస్టర్స్ ని అందించిన బోయపాటి శ్రీనుపైనే ఎన్నో ఆశలు పెట్టకున్నారు బాలయ్య. వీరి కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి ఓ విభిన్న కథా చిత్రం రూపొందుతుంది. ఇందులో బాలకృష్ణ రెండు డిఫరెంట్‌ రోల్స్ లో కనిపిస్తాడని టాక్‌. అందులో ఒకటి అఘోరగా కనిపించనున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌ ఆడియెన్స్ ని ఓ ఊపుఊపేసింది. దీంతో అటు అభిమానులు, ఇటు బాలకృష్ణ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు. మరి బోయపాటి ఈ సారి మ్యాజిక్‌ చేస్తాడో లేదో చూడాలి.

సక్సెస్‌ కోసం ఆరాటపడుతున్న హీరోల్లో మన్మథుడు నాగార్జున కూడా చేరిపోయాడు. ఇటీవల కాలంలో ఆయనకు సరైన విజయాలు లేవు. `ఊపిరి`, `సోగ్గాడే చిన్నినాయన` తర్వాత చెప్పుకోదగ్గ హిట్లు లేవు. రెండేళ్ల క్రితం వచ్చిన `దేవదాస్‌` కాస్త ఫర్వాలేదనిపించింది. `ఓం నమో వెంకటేశాయా`, `రాజుగాది గది 2`, `ఆఫీసర్‌`, `మన్మథుడు 2` బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫెయిల్‌ అయ్యాయి. ఆయన సక్సెస్‌ చూడక నాలుగేళ్ళు అవుతుంది. ప్రస్తుతం `వైల్డ్ డాగ్‌`పై ఎన్నో అంచనాలు, ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు హిందీలో `బ్రహ్మాస్త్ర`లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలతో గట్టిగానే కొట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మరి విజయాలు కనికరిస్తాయేమో చూడాలి.

చాలా రోజుల తర్వాత `పీఎస్‌వీ గరుడవేగ`లో అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు రాజశేఖర్‌. ఈ సినిమా వచ్చి కూడా మూడేళ్లవుతుంది. ఆ తర్వాత గతేడాది `కల్కి`తో సందడి చేశారు. `అ` వంటి జాతీయ అవార్డు చిత్రాన్ని రూపొందించిన ప్రశాంత్‌వర్మ దీన్ని తెరకెక్కించగా, ఇది మిశ్రమ స్పందనని రాబట్టుకుంది. స్ట్రాంగ్‌గా హిట్‌ ఖాతాలో పడలేకపోయింది. నెక్ట్స్ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

ఇక అర్జెంట్‌గా హిట్‌ కావాల్సిన హీరోల్లో పవన్‌ కళ్యాణ్‌  కూడా ఉంటారు. రెండేళ్ళ క్రితం ఆయన `అజ్ఞాతవాసి`తో ఫెయిల్యూర్‌ అందుకుని రాజకీయాల్లోకి వెళ్ళారు. అంతకు ముందు కూడా `అత్తారింటికి దారేది` తర్వాత హిట్‌ లేదు. దీంతో ఆయన నుంచి ఫస్ట్ ఓ సినిమా కోసం, ఆ తర్వాత హిట్‌ కోసం ఆయన అభిమానులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో `వకీల్‌సాబ్‌` చిత్రంలో నటిస్తున్నాడు. దీంతోపాటు క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా, హరీష్‌ శంకర్‌తో మరో సినిమా చేయనున్నారు. మరి ఇవి హిట్లు ఇస్తాయేమో చూడాలి.

మాస్‌ మహారాజా రవితేజ సైతం ఫెయిల్యూర్‌ హీరోల జాబితాలో చేరిపోయారు. ఆయన అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన `రాజా ది గ్రేట్‌` తో మంచి సక్సెస్‌ కొట్టాడు. అప్పట్నుంచి మళ్ళీ వరుస ఫెయిల్యూర్స్ ఆయన్ని వెంటాడుతున్నాయి. అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. `టచ్‌ చేసి చూడు`, `అమర్‌ అక్బర్‌ ఆంటోని`, `నేల టికెట్టు`, `డిస్కోరాజా`లతో నాలుగు డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. ఈ సారి గోపీచంద్‌ మలినేనితో `క్రాక్‌` చిత్రంలో నటిస్తున్నాడు. `బలుపు`, `డాన్‌శ్రీను` వంటి విజయాలను అందించిన గోపీచంద్‌ మలినేని మరి ఈ మాస్‌ యాక్షన్‌ సస్సెన్స్ థ్రిల్లర్‌తో హిట్‌ ఇస్తాడేమో చూడాలి. ఇందులో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, రవితేజ పోలీస్‌గా మెరవబోతున్నాడు.

మ్యాచో అండ్‌ యాక్షన్‌ స్టార్‌ గోపీచంద్‌ చివరగా 2015లో `జిల్‌` సినిమాతో సక్సెస్‌ కొట్టాడు. ఐదేళ్ళుగా విజయం కోసం ఆయన, ఆయన అభిమానులు రెండు కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈసారైనా హిట్‌ కొడతాడేమో అని ప్రతి సినిమాకి కాచుకుని కూర్చుంటున్నారు. కానీ ప్రతి సారి నిరాశే ఎదురవుతోంది. తనకు `గౌతమ్‌ నందా` వంటి యావరేజ్‌ సినిమాని అందించిన సంపత్‌ నందితో ప్రస్తుతం `సీటీమార్‌` సినిమా చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. మహిళా కబడ్డీ నేపథ్యంలో సాగే చిత్రమిది. మరి గోపీకి విజయాన్ని అందిస్తుందా?.

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ కూడా వరుసగా నాలుగు ఫ్లాప్‌లు అందించాడు. `గీత గోవిందం` వంటి బ్లాక్‌ బస్టర్‌తో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఆయనకు `టాక్సీవాలా`, `నోటా`, `డియర్ కామ్రేడ్‌`, `వరల్డ్ ఫేమస్‌ లవర్‌`లు డిజాస్టర్లని ఇచ్చాయి. దీంతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిన ఈ రౌడీ కూడా ఇప్పుడు హిట్‌ కోసం తాపత్రయపడుతున్నాడు. ప్రస్తుతం ఆయన పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో `ఫైటర్‌` చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగు, హిందీలో పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. మరి ఇది అభిమానులను ఖుషీ చేస్తుందా? విజయ్‌ ఇమేజ్‌ని, క్రేజ్‌ని తిరిగి తెస్తుందా అన్నది చూడాలి.

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ `ఎంఎల్‌ఏ` చిత్రంతో ఫర్వాలేదనిపించుకున్నాడు. ఇది బాగానే వర్కౌట్‌ అయ్యింది. ఆ తర్వాత చేసిన `118` కూడా ఫర్వాలేదనిపించుకుంది. `ఎన్టీఆర్‌` బయోపిక్‌, ఈ ఏడాది చేసిన `ఎంత మంచి వాడవురా` చిత్రాలు పరాజయం చెందాయి. దీంతో అర్జెంట్‌గా ఆయనకో హిట్‌ కావాలి. ప్రస్తుతం `రావణ్‌` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా అయినా సరైనా విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

భిన్నమైన సినిమాలతో డీసెంట్‌ హిట్స్ అందుకుంటూ దూసుకొస్తున్న శర్వానంద్‌ సైతం `మహానుభావుడు` తర్వాత సక్సెస్‌ కొట్టలేకపోయాడు. `పడి పడి లేచే మనసు`, `రణరంగం`, `జాను` డిజాస్టర్లుగా మిగిలాయి. ప్రస్తుతం చేస్తున్న `శ్రీకారం`పై ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడు.

మంచు విష్ణు గురించి చెప్పాల్సి వస్తే, హిట్లెన్నీ అని లెక్కబెట్టుకోవాలి. విజయాలకంటే ఫెయిల్యూర్సే వాళ్ళకి మంచి మజాని ఇస్తుంటాయి. ఆయన నటించిన `ఈడోరకం ఆడో రకం` ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత సక్సెస్‌లు లేవు. ప్రస్తుతం `మోసగాళ్ళు` చిత్రంలో నటిస్తున్నాడు. ఇండియాలో జరిగిన ఓ పెద్ద స్కాం నేపథ్యంలో ఇది రూపొందుతుంది. ఇందులో కాజల్‌ హీరోయిన్‌గా, బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. మరి ఇది విష్ణుకి విజయాన్ని అందించి కెరీర్‌ని పుంజుకునేలా చేస్తుందేమో చూడాలి.

చాలా ఏళ్ళ తర్వాత సుమంత్‌ మూడేళ్ళ క్రితం `మళ్ళీరావా`తో సక్సెస్‌ కొట్టి.. ఇంకా తాను ఇండస్ట్రీలో ఉన్నానని గుర్తు చేశాడు. ఆ తర్వాత చేసిన `సుబ్రమణ్యపురం`, ఇదం జగత్‌`, `ఎన్టీఆర్‌` బయోపిక్‌ చిత్రాలు ఫెయిల్యూర్‌గా మిగిలాయి. ప్రస్తుతం `కపటనాటకం` అనే భిన్నమైన సినిమా చేస్తున్నాడు. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సుమంత్‌ కెరీర్‌కి చాలా ముఖ్యం.

కామెడీ చిత్రాల హీరో అల్లరి నరేష్‌ హిట్‌ చూసి చాలా ఏళ్ళు అవుతుంది. గతేడాది మహేష్‌తో కలిసి నటించిన `మహర్షి` ఆయనకు కాస్త ఊరటనిచ్చింది. కానీ అది మహేష్‌ అకౌంట్‌ లో పడింది. దీంతో ఇప్పుడు `నాంది`, `బంగారు బుల్లోడు` చిత్రాలతో హిట్‌ కొట్టాలని ఆరాటపడుతున్నాడు. ఇటీవల విడుదలైన `నాంది` టీజర్‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. `బంగారు బుల్లోడు` టీజర్‌ అలరించింది. రెండు విభిన్న కథాంశాలతో రూపొందుతున్న ఈ సినిమాలు అల్లరి నరేష్‌ కి పూర్వవైభవాన్ని తెస్తాయేమో చూడాలి.

నారా రోహిత్‌కి ఇటీవల హిట్లు లేవు. `శమంతకమణి` క్రిటికల్‌గా ఆకట్టుకుంది. ఆ తర్వాత చేసిన అరడజను సినిమాలు చెత్త బుట్టలోకి చేరాయి. అయినా ఆయనకు వరుసగా సినిమాలు వస్తుండటం విశేషం. ప్రస్తుతం `అనగనగా దక్షిణాదిలో`, `శబ్దం`, `పండగలా వచ్చాడు`, `మద్రాసి`చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాల్లో ఏదో ఒక్కటైన హిట్‌ కొడుతుందేమో చూడాలి.

ఇక యంగ్ హీరోల్లో అఖిల్‌ అక్కినేనికి కచ్చితంగా హిట్‌ కావాలి. ఎందుకంటే ఆయన కెరీర్‌ బిగినింగ్‌ నుంచి విజయం అనేదే ఎరుగడు. ఇప్పటి వరకు చేసిన మూడు సినిమాలు `అఖిల్‌`, `హలో`, `మిస్టర్‌ మజ్ను` చిత్రాలు పరాజయం చెందాయి. ప్రస్తుతం  బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో నటిస్తున్న `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌`పై ఆయన గంపెడు ఆశలు పెట్టుకున్నారు. మరి అది వర్కౌట్‌ అవుతుందేమో చూడాలి.

`మాయవన్‌` చిత్రంతో తమిళంలో విజయం అందుకున్న సందీప్‌ కిషన్‌ గతేడాది `నిన్ను వీడని నీడను నేనే` చిత్రంతో యావరేజ్‌ కొట్టాడు. అయినా అది హిట్‌ కిందకు రాదు. ఆ తర్వాత చేసిన `తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌` పరాజయం చెంది. దీంతో తనకూ అర్జెంట్‌ గా హిట్‌ కావాలి. ప్రస్తుతం ఆయన తెలుగులో `ఏ 1 ఎక్స్ ప్రెస్‌`లో నటిస్తున్నాడు. హాకీ నేపథ్య చిత్రమిది. దీంతోపాటు తమిళంలో `నరగాసూరన్‌`, `కసడ తపరా`, `కన్నాడి` చిత్రాల్లో నటిస్తున్నారు. మరి ఇవి సందీప్‌ని గట్టెక్కిస్తాయా చూడాలి.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తొలి చిత్రం `అల్లుడు శీను`తో ఫర్వాలేదనిపించుకున్నాడు. మధ్యలో ఐదు సినిమాలు పోయాయి. గతేడాది చేసిన `రాక్షసుడు` కాస్త ఊరటనిచ్చింది. అయినా మనుగడ సాధించేందుకు ఇవి సరిపోవు. బలమైన హిట్‌ కావాలి. ప్రస్తుతం ఆయన సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో `అల్లుడు శ్రీను`లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఆయన కోరిక నెరవేరుతుందో చూడాలి.

మంచు మనోజ్‌..ఇటీవల హిట్‌ అనేదే లేని నటుడు. `పాండవులు పాండవులు తుమ్మెద` తర్వాత సక్సెస్‌ ఆయనకు ఆమడ దూరం పారిపోయింది. అందుకే మూడేళ్ల గ్యాప్‌ తర్వాత `ఆహాం బ్రహ్మాస్మి` చిత్రంతో రాబోతున్నాడు. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బలమైన హిట్‌ అందుకోవాలని మంచు మనోజ్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

`ఛలో` చిత్రంలో హిట్‌ కొట్టిన నాగశౌర్య సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్‌ ఖాతాలో పడుతున్నాయి. ఈ ఏడాది వచ్చిన `అశ్వథ్థామ` సైతం ఆయనకు బలమైన హిట్‌ని ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం సంతోష్‌ జాగర్లముడి దర్శకత్వంలో ఓ విభిన్న కథా చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌ సిక్స్ ప్యాక్‌తో నాగశౌర్య అదరగొడుతున్నారు.

రాజ్‌ తరుణ్‌  నటించిన దాదాపు ఎనిమిది సినిమాలు ఫెయిల్‌ అయ్యాయి. ప్రస్తుతం ఆయన `ఒరేయ్‌ బుజ్జిగా` చిత్రంలో నటిస్తున్నాడు. విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమానైనా రాజ్‌ తరుణ్‌ని గట్టెక్కిస్తుందా అనేది చూడాలి.  మరి ఈ హీరోలకు దర్శకులు, అభిమానులు హిట్‌ ఇస్తారా? తిరిగి పుంజుకునేలా చస్తారా? అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. అందరికి మంచి విజయాలు రావాలని , వరుస విజయాలతో ఇండస్ట్రీ కళకళలాడాలని కోరుకుందాం.

loader