- Home
- Entertainment
- Radhe Shyam:రాధే శ్యామ్ ని వెంటాడిన మూడు బ్యాడ్ సెంటిమెంట్స్... లేకుంటే ఫలితం వేరేలా ఉండేది!
Radhe Shyam:రాధే శ్యామ్ ని వెంటాడిన మూడు బ్యాడ్ సెంటిమెంట్స్... లేకుంటే ఫలితం వేరేలా ఉండేది!
మొదటి షో నుండే రాధే శ్యామ్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. మెల్లగా సాగే ప్లే,లవ్ ఎమోషన్స్ అంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవడం, సీజీ వర్క్ కూడా ఏమంత ఇంప్రెస్సివ్ గా లేదనేది ప్రధానంగా వినిపించిన మైనస్ పాయింట్స్.

అయితే ఒక వర్గం ప్రేక్షకులకు రాధే శ్యామ్ బాగా నచ్చేసింది. కలెక్షన్స్ పరంగా చూస్తే మాత్రం రాధే శ్యామ్ (Radhe Shyam)ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదు. ఎంత పెద్ద భారీ చిత్రమైనా వీకెండ్ ముగిసే నాటికి యాభై శాతానికి పైగా బిజినెస్ పూర్తి చేయాలి. రాధే శ్యామ్ కేవలం 30-35% మాత్రమే రికవరీ చేసింది. అంటే ఇంకా దాదాపు 70 శాతం వసూళ్లు రావాల్సి ఉంది.
Prabhas
నార్మల్ బడ్జెట్ చిత్రానికైతే రాధే శ్యామ్ ఓపెనింగ్స్ ఎక్స్లెంట్ అని చెప్పాలి. 200 కోట్లకుపై పైగా బిజినెస్ చేసిన రాధే శ్యామ్ కి ఈ ఓపెనింగ్స్ సరిపోవు. తెలుగు రాష్ట్రాల్లో రాధే శ్యామ్ పర్లేదు అనిపిస్తుంది. హిందీలో రాధే శ్యామ్ పరిస్థితి మరింత దారుణం. పూర్తి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సాహో రూ. 150 కోట్లు వసూలు చేయగా.. రాధే శ్యామ్ రూ. 50 కోట్ల మార్క్ చేరుకోవడమే కష్టంగా ఉంది.
రాధే శ్యామ్ రన్ కొనసాగుతున్నప్పటికీ తుది ఫలితం మాత్రం నిరాశపరిచేదే అని స్పష్టంగా అర్థమవుతుంది. కథ, స్క్రీన్ ప్లే, సాంకేతిక విషయాలు పక్కనపెడితే... ముఖ్యంగా మూడు బ్యాడ్ సెంటిమెంట్స్ ప్రభాస్ ని వెంటాడాయి. ఆ సెంటిమెంట్స్ రాధే శ్యామ్ ఇలాంటి ప్రతికూల ఫలితాలు అందుకోవడానికి కారణం అయ్యాయి. అవేమిటో ఒకసారి పరిశీలిద్దాం...
మొదటి సెంటిమెంట్ రాజమౌళి(Rajamouli). తనతో పనిచేసే హీరోకి ఇండస్ట్రీ హిట్ ఇవ్వడం రాజమౌళికి ఉన్న గొప్ప సెంటిమెంట్ అయితే... ఆ హిట్ తర్వాత ప్లాప్స్ సదరు హీరోని వెంటాడడం బ్యాడ్ సెంటిమెంట్. రాజమౌళితో పనిచేసిన ఏఒక్క హీరో ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేయలేకపోయారు. ప్రభాస్ కూడా అతీతుడు కాదని నిరూపిస్తున్నాడు.
బాహుబలి చిత్రాలతో ప్రభాస్ ఇమేజ్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ కి రాజమౌళి తీసుకెళ్లారు. అయితే ఆయన తాలుకూ బ్యాడ్ సెంటిమెంట్ ప్రభాస్ ని వెంటాడుతుంది. బాహుబలి 2 తర్వాత విడుదలైన సాహో, రాధే శ్యామ్ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. కనీసం సాహో హిందీ వర్షన్ హిట్ గా నిలిచింది. రాధే శ్యామ్ ని వెంటాడిన ఫస్ట్ బ్యాడ్ సెంటిమెంట్ రాజమౌళి.
పెదనాన్న కృష్ణంరాజు (Krishnamraju)వారసుడిగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన బిరుదు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే ప్రభాస్ తో కృష్ణంరాజు చేసిన చిత్రాలేవీ హిట్ కాలేదు. ప్రభాస్ మూవీలో కృష్ణంరాజు నటించడం కూడా ఓ బ్యాడ్ సెంటిమెంట్. మొదటిసారి వీరిద్దరి కాంబినేషన్ లో బిల్లా చిత్రం తెరకెక్కింది. ప్రభాస్ ఇమేజ్ కి బిల్లా ఉపయోగపడిందే కానీ కమర్షియల్ గా ఆడలేదు. అనంతరం రెబల్ మూవీలో కలిసి నటించారు. ఈ మూవీ అయితే అట్టర్ ప్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. తాజాగా రాధే శ్యామ్ మూవీలో కృష్ణంరాజు పరమహంస రోల్ చేసిన విషయం తెలిసిందే.
ఇక మూడో బ్యాడ్ సెంటిమెంట్ దర్శకుడు రాధాకృష్ణ. ఆయనకు రాధే శ్యామ్ రెండో చిత్రం. సాహో చిత్రానికి దర్శకుడిగా ఉన్న సుజీత్ కూడా తన రెండో చిత్రంతోనే ప్రభాస్ ని డైరెక్ట్ చేశాడు. యంగ్ డైరెక్టర్స్ సుజీత్, రాధాకృష్ణ ప్రభాస్ (Prabhas)పాన్ ఇండియా చిత్రాలను అనుకున్న స్థాయిలో తెరకెక్కించలేకపోయారు. ఇది రాధే శ్యామ్ ని వెంటాడిన మూడో బ్యాడ్ సెంటిమెంట్. ఇవన్నీ మూఢనమ్మకాలే అయినప్పటికీ... జనాలు మాత్రం వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.