MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండ వదులుకున్న 4 బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే! కారణం?

విజయ్ దేవరకొండ వదులుకున్న 4 బ్లాక్ బస్టర్ మూవీస్ ఇవే! కారణం?

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో భారీ క్రేజ్ ఉంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన చిత్రాల కోసం ప్రేక్షకులు ఎగబడతారు. కాగా విజయ్ దేవరకొండ నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలు వదులుకున్నాడు. అవేమిటో చూద్దాం..  

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 06 2025, 06:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కెరీర్ బిగినింగ్ లో ప్రాధాన్యత లేని సపోర్టింగ్ రోల్స్ చేశాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు చిత్రం ఆయనకు హీరోగా గుర్తింపు తెచ్చింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కిన రొమాంటిక్ లవ్ డ్రామా పెళ్లి చూపులు ఏకంగా నేషనల్ అవార్డు సొంతం చేసుకుంది. కమర్షియల్ గా కూడా ఆడింది. పెళ్లి చూపులు అనంతరం విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ఒక సెన్సేషన్. బోల్డ్ అండ్ ఇంటెన్స్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నిర్మాతలకు పెద్ద మొత్తంలో లాభాలు పంచింది. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. గీత గోవిందంతో విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ గా మారిపోయాడు. గీత గోవిందం తో విజయ్ దేవరకొండ మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. గీతా ఆర్ట్స్ నిర్మించిన రొమాంటిక్ లవ్ డ్రామా గీత గోవిందం అనేక రికార్డులు బ్రేక్ చేసింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించింది. 

 

36
rx 100 movie

rx 100 movie

గీత గోవిందం అనంతరం విజయ్ దేవరకొండ నుండి ఆ రేంజ్ మూవీ రాలేదు. ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా విజయ్ దేవరకొండ నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలను చేజేతులా వదులుకున్నారు. వాటిలో ఆర్ ఎక్స్ 100 ఒకటి. కార్తికేయ హీరోగా నటించిన ఆర్ ఎక్స్ 100 సంచలన విజయం నమోదు చేసింది. డెబ్యూ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించాడు. అర్జున్ రెడ్డి కి ఏమాత్రం తీసిపోకుండా ఆర్ ఎక్స్ 100 ఉంటుంది. 

46

అయితే అప్పటికే అర్జున్ రెడ్డి మూవీ చేసి ఉన్న విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేశాడట. అర్జున్ రెడ్డి ఛాయలు ఈ సినిమాలో ఉన్నాయని దేవరకొండ ఆర్ఎక్స్ 100 చేయలేదట. పూరి జగన్నాధ్-రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 75 కోట్ల గ్రాస్ రాబట్టింది. పూరి, ఛార్మిలను ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ మూవీకి మొదట అనుకున్న హీరో విజయ్ దేవరకొండ. కానీ విజయ్ దేవరకొండకు హీరో క్యారెక్టరైజేషన్ నచ్చక నో చెప్పాడట. 

56

మెగా హీరో వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెన. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ సేతుపతి కీలక రోల్ చేశాడు. కరోనా ఆంక్షల మధ్య కూడా వసూళ్లు కుమ్మేసిన ఈ మూవీకి హీరోగా బుచ్చిబాబు సాన విజయ్ దేవరకొండను అనుకున్నారట. కాకపోతే.. అర్జున్ రెడ్డి, గీత గోవిందం విజయాలతో విజయ్ దేవరకొండ ఇమేజ్ మారిపోవడంతో, తనకు ఉప్పెన కథ సెట్ కాదని ఆయన భావించారట. 

 

66

వెంకీ కుడుముల-నితిన్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ భీష్మ. నితిన్ కి జంటగా రష్మిక మందాన నటించింది. నితిన్ కెరీర్లో భీష్మ వన్ ఆఫ్ ది హిట్ మూవీస్. ఈ మూవీలో హీరోగా మొదట విజయ్ దేవరకొండను అనుకున్నారట. కానీ విజయ్ దేవరకొండ భీష్మ కథను రిజెక్ట్ చేశాడట. దాంతో విజయ్ దేవరకొండ మరో హిట్ కోల్పోయాడు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image2
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Recommended image3
Mouni Roy House: విశ్వంభర నటి లగ్జరీ హోమ్ చూస్తే షాక్ అవుతారు, సిటీ వ్యూ, స్టైలిష్ డెకర్‌తో అదరగొట్టేసిందిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved