Tollywood Debut Heroines 2023: నుపూర్ సనన్, సాక్షి వైద్య, ఆషికా రంగనాథ్.. టాలీవుడ్ లోకి కొత్త హీరోయిన్స్!
తెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతోంది. ఈ క్రమంలో యంగ్ హీరోయిన్లు ఇక్కడి నుంచి లాంచ్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది చాలా మంది హీరోయిన్లు టాలీవుడ్ లో తొలిసినిమా చేయడం విశేషం. వారి వివరాలు తెలుసుకుందాం..
యంగ్ హీరోయిన్ సాక్షి వైద్య (Sakshi Vaidya) ఈ ఏడాది హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. తొలుత అక్కినేని అఖిల్ సరసన ‘ఏజెంట్’తో తెలుగు ప్రేక్షకులను పరిచయం అయ్యింది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. రీసెంట్ గా వరుణ్ తేజ్ ‘గాంఢీవధారి అర్జున’తోనూ అలరించింది. నెక్ట్స్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో మెరియనుంది. ఏడాది ప్రారంభంలోనే ఆడియెన్స్ కు పరిచయమై వరుసగా అవకాశాలు అందుకుంటోంది.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ నుపూర్ సనన్ (Nupur Sanon) టాలీవుడ్ లో డెబ్యూ ఫిల్మ్ చేసింది. మాస్ మహారాజ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ (Tiger Nageswara Rao)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలె నుపూర్ సనన్ కావడం విశేషం. తొలి చిత్రంతో కాస్తా మంచి క్రేజ్ నే దక్కించుకుంది.
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) టాలీవుడ్ లోకీ ఎంట్రీ ఇచ్చింది. నందమూరి కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. చిత్రంలోని తన పెర్ఫామెన్స్, డాన్స్ కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
మలయాళం, తమిళ చిత్రాల్లో చాలానే సినిమాలు చేసింది కేరళ కుట్టి రెబా మోనికా జాన్ (Reba Monica John). ఇక ఈ ఏడాది తెలుగులోకీ ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు సరసన ‘సామజవరగమణ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. అంతకు ముందుకు Boo అనే తెలుగు, తమిళం బైలింగువల్ మూవీతో అలరించింది.
యంగ్ బ్యూటీ గీతికా తివారి (Geethika Tiwari)ని తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ తేజ పరిచయం చేశారు. తన రీసెంట్ గా దర్శకత్వం వహించి తెరకెక్కించిన చిత్రం ‘అహింస’ (Ahimsa)లో గీతికా అద్భుతంగా నటించింది. దగ్గుబాటి అభిరామ్ హీరో. ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తూనే వస్తోంది.
బెల్లంకొండ గణేశ్ బాబు డెబ్యూ ఫిల్మ్ ‘నేనూ స్టూడెంట్ సార్’ చిత్రంతో యంగ్ బ్యూటీ అవంతిక దసాని (Avantika Dasani) ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. గతంలో హిందీలో ‘మిత్య’ అనే వెబ్ సిరీస్ లో నటించింది.
యంగ్ హీరో అండ్ డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ తెరకెక్కించిన ‘మేమ్ ఫేమస్’ (Mem Famous) మూవీతో సార్య లక్ష్మణ్ (Saarya Laxman) తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. పల్లెటూరి అమ్మాయిగా - మేమ్ ఫేమస్ తో అదరగొట్టింది. నటన, డాన్స్, డైలాగ్స్ తోనూ ఆకట్టుకుంది.
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన రిత్తికా చక్రవర్తి (Rittika Chakraborthy) ‘అనంత’ అనే చిత్రంలో టాలీవుడ్ లో డెబ్యూ ఫిల్మ్ చేసింది. శృతి అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
యంగ్ బ్యూటీ యుక్తి తరేజా ( Yukti Thareja) నాగశౌర్య రీసెంట్ ఫిల్మ్ ‘రంగబలి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. టాలీవుడ్ లో తొలి చిత్రమే అయినా తన నటనతో అదరగొట్టింది. నెక్ట్స్ ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి.