- Home
- Entertainment
- B.R.Ambedkar : బీఆర్ అంబేద్కర్ జీవితంపై వచ్చిన సినిమాలివే! లైఫ్ లో ఒక్కసారైనా చూడాలి..
B.R.Ambedkar : బీఆర్ అంబేద్కర్ జీవితంపై వచ్చిన సినిమాలివే! లైఫ్ లో ఒక్కసారైనా చూడాలి..
భారత రాజ్యాంగం రూపకల్పనలో క్రియాశీలక పాత్ర పోషించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన జీవితం, సిద్ధాంతాల నుంచి తెలియజేసిన పలు చిత్రాల గురించి తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
భారత రాజ్యాంగ పితామహుడు, భీమ్ రావ్ రామ్ జీ అంబేద్కర్ (BR Ambedkar) దేశానికి ఎంతో సేవ చేశారు. అన్ని వర్గాలకు సమ న్యాయం, హక్కులు, రక్షణ, సరైన పాలన అందేందుకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భారత రాజ్యాంగ రూపకల్పనలోప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు అంబేద్కర్ 67వ వర్ధంతి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా నివాళులు వెల్లువెతున్నాయి. ఆయనను గుర్తుచేసుకుంటున్నారు. ఇక తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇప్పటికే ‘ప్రగతి భవన్’కు ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రజా భవన్’గా పేరు మార్చి ఎన్నికల ఫలితాల రోజే ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవితం, సిద్ధాంతాలను తెలియజేసిన కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం.
అంబేద్కర్ జీవిత చరిత్రను చెప్పిన మొదటి మరాఠి చిత్రం ‘భీమ్ గర్జన’ (Bheem Garjana). 1989లో సుధాకర వాగ్మేర్ దర్శకత్వంలో తెరకెక్కింది. మరాఠి స్టార్స్ కృష్ణ ఆనంద్ మరియు ప్రతిమ దేవి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు చేసిన కృషినే ఎక్కువగా చూపించారు.
జబ్బర్ పటేల్ దర్శకత్వంలో ’డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్’ 2000 లో విడుదలైంది. ఈ చిత్రంలో ఆయన జీవితచరిత్రను చక్కగా వివరించారు. అంబేద్కర్ జీవితాన్ని, బాల్యం నుంచి మొదలు భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అతని కీలక పాత్ర వరకు విస్తృతంగా చూపించారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించడం విశేషం.
2005లో కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్’ చిత్రం విడుదలైంది. శాండల్ వుడ్ డైరెక్టర్ శరణ్ కుమార్ కబ్బుర్ దర్శకత్వం వహించారు. విష్ణుకాంత్ బీజే అంబేద్కర్ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అంటరానితనంతో తాను ఎదుర్కొన్న సమస్యలను చూపించారు.
2011లో ‘రామాబాయీ భీమ్ రావ్ అంబేద్కర్’తో మరో జీవితచరిత్ర వచ్చింది. హిందీలో వచ్చిన ఈ చిత్రానికి ప్రకాష్ జాదవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అంబేద్కర్ భార్య రామాబాయీ గొప్పతనాన్ని చూపించారు. అంబేద్కర్ చదువుల కోసం కష్టపడుతున్న తరుణంలో మదర్ రమా ఇచ్చిన సపోర్ట్ ను తెలియజేశారు. మరోవైపు అంబేద్కర్, రమాబాయ్ మధ్య ఉన్న ఉన్నతమైన బంధాన్ని తెలియజేసే చిత్రమిది.
ఇక 2018లో టైటిల్ Bal Bhimraoతో ఓ చిత్రం వచ్చింది. ప్రకాశ్ నారాయణ్ జాదవ్ దర్శకత్వం వహించారు. అంబేద్కర్ బాల్యం గురించి చెప్పిన చిత్రమిది. అంటరానితం, దళితులు ఎదుర్కొన్న అంశాలను సృషించారు.
జై భీమ్.. తమిళ స్టార్ సూర్య నటించిన చిత్రం Jai Bhim. ఈ చిత్రం 2021 నవంబర్ 2న విడుదలైంది. ఇందులో అంబేద్కర్ గురించి చెప్పకపోయినా.. ఆయన సిద్ధాంతాలు.. ఆయన స్లోగన్ ను అనుకరిస్తూ కథ నడుస్తుంది. సూర్య పోషించిన పాత్ర అంబేద్కర్ ను గుర్తుచేసే అనుభూతిని కలిగిస్తుంది. దళితుల కోసం పోరాడే లాయర్ గా సూర్య అలరించారు. ఈ చిత్రం ఆస్కార్ కు కూడా పోటీ పడింది. ఇక పైన చెప్పిన చిత్రాలన్నీ ఆయా ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉన్నాయి. యూట్యూబ్ లోనూ చూసే వీలుంది.